ఎందుకు రుతురాజ్ గైక్వాడ్ కెరీర్‌తో ఆడుకుంటున్నారు: టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్
1 month ago | 5 Views
ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కలేదు. దాంతో సోషల్ మీడియాలో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ట్రోల్స్ వచ్చాయి. రుతురాజ్ యెల్లో జెర్సీ (చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ) వేసుకోవడం వల్లే ఎంపిక చేయలేదని కామెంట్లు చేశారు. రుతురాజ్‌ను సెలక్ట్ చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా-ఏతో మ్యాచ్‌లకు జట్టును నడిపించే రుతురాజ్.. ప్రధాన టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నాడు. భారీగా పరుగులు చేసినా అవకాశం రాకపోతే ఇంకేం చేయాలి? అని ప్రశ్నించాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ%ౌ% ‘భారత క్రికెట్‌లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.
మయాంక్ యాదవ్ నెట్స్‌లో కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ వేస్తున్నాడని చెప్పారు. చివరకు శివమ్ దూబె, రియాన్ పరాగ్ మాదిరిగా ఫిట్‌గా లేడని ప్రకటించారు. రుతురాజ్ గైక్వాడ్ విషయంలో ఏం చేస్తున్నారో మీకైనా తెలుసా?. అతడికి కూడా ఎందుకు ఎంపిక కావడం లేదో తెలియదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సెంచరీలు చేసినా టెస్టుల్లో అవకాశం రాలేదు. భారీగా పరుగులు చేసినా అవకాశం రాకపోతే ఇంకేం చేయాలి?’ అని ప్రశ్నించాడు.‘దేశవాళీ క్రికెట్‌లో సెంచరీలు చేసిన అభిమన్యు ఈశ్వరన్‌ను తీసుకోవడం మంచి నిర్ణయం. కానీ రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టడంలో లాజిక్ ఏంటో సెలెక్టర్లు చెప్పాలి. ఎందుకు అతడి కెరీర్‌తో ఆడుకుంటున్నారు?. రుతురాజ్ నుంచి ఇంకేం ఆశిస్తున్నారో చెప్పాలి. మీ ప్రణాళిక ఏంటి?.. ప్రత్యర్థిపై రోజంతా హిట్టింగ్ చేయగల సత్తా ఉన్న బ్యాటర్. కానీ అంతర్జాతీయ క్రికెట్‌కు వచ్చేసరికి మీరు పక్కన పెట్టేస్తున్నారు. రుతురాజ్‌కు కేవలం రెస్టాఫ్ ఇండియా లేదా ఇండియా-ఏ తరఫున మాత్రమే అవకాశం ఇస్తారు. ఇంకెన్నాళ్లు వెయిట్ చేయిస్తారు’ అని శ్రీకాంత్ అన్నాడు.
ఇంకా చదవండి: రాజీనామా చేసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# రుతురాజ్ గైక్వాడ్ # టీమిండియా # క్రిష్ణమాచారిశ్రీకాంత్