స్పిన్నింగ్‌ ట్రాక్‌లో భారత్‌ కూడా ఓడిపోయింది

స్పిన్నింగ్‌ ట్రాక్‌లో భారత్‌ కూడా ఓడిపోయింది

23 days ago | 5 Views

‘‘350-ప్లస్‌ ఛేజింగ్‌ చాలా కష్టమని నేను ఊహించాను. భారత బ్యాటింగ్‌ అక్కడే అర్థమైంది. మొదటి మ్యాచ్‌లో, కివీస్‌ పేసర్లు 17 వికెట్లు తీశారు. రెండవ టెస్టులో, స్పిన్నర్లు 19 వికెట్లు తీశాడు, పేస్‌, బౌన్స్‌ (బెంగళూరు) ఉన్న ట్రాక్‌లో భారత ఆటగాళ్లు సరిగా ఆడలేకపోయారు. స్పిన్నింగ్‌ ట్రాక్‌లో భారత్‌ కూడా ఓడిపోయింది’’ అని బాసిత్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పేర్కొన్నాడు.న్యూజిలాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో ఓడిన తర్వాత టీమ్‌ ఇండియా తీవ్రమైన ట్రోలింగ్‌ కు గురవుతోంది. 12 సంవత్సరాల తర్వాత రోహిత్‌ శర్మ, అతని ఆటగాళ్లకు స్వదేశంలో కివీస్‌ తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ ఓటమిపాలు చేశారంటూ ట్రోలింగ్‌ జరుగుతోంది.తాజాగా పాక్‌ మాజీ క్రికెటర్‌ బాసిత్‌ అలీ సైతం ఈ లిస్టులో చేరాడు.

బ్యాటింగ్‌ వైఫల్యమే జట్టులో అతిపెద్ద సమస్యని.. భారత జట్టు అతి విశ్వాసంతో కనిపించిందని అందుకే అటు స్పిన్‌, పేస్‌ దేనికీ న్యాయం చేయలేకపోయారని అన్నాడు.ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు సంసిద్ధతపై కూడా బాసిత్‌ అలీ ఆందోళనను వ్యక్తం చేశాడు. ముఖ్యంగా పేసర్‌ మహమ్మద్‌ షమీని పర్యటనకు ఎంపిక చేయకపోవడంపైనా అతను కామెంట్‌ చేశాడు. ‘‘ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే జట్టులో మహమ్మద్‌ షమీ లేకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు మొత్తం భారాన్ని బుమ్రాపైనే వేశారు. అర్ష్‌దీప్‌ ఆటలో వైవిధ్యం చూపుతున్నందుకు జట్టులో ఉండవచ్చు. కానీ, జట్టులో షమీ లేకుండా భారత్‌కు ఫాస్ట్‌బౌలింగ్‌ పూర్తికాదు. ఆస్ట్రేలియాలో భారత్‌కు ఖచ్చితంగా ఫాస్ట్‌ బౌలింగ్‌ సమస్యలు ఎదురవుతాయి’’ అని బాసిత్‌ అలీ తెలిపాడు.

ఇంకా చదవండి: బీసీసీఐకి మరో ఆఫర్‌ ఇచ్చిన పీసీబీ!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# భారత్‌     # ఆస్ట్రేలియా     # మహమ్మద్‌షమీని    

trending

View More