‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రంలో విలన్ల ప్రేమగీతం ఆవిష్కరణ.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా లాంచ్!
14 days ago | 5 Views
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రం నుంచి ఒక వినూత్నమైన ప్రేమగీతం ఆవిష్కరణ జరిగింది. ఈ సినిమాలో విలన్లు ప్రేమగీతాలు పాడుకునే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ పాటను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “సాధారణంగా సినిమాల్లో హీరో-హీరోయిన్లు ప్రేమగీతాలు పాడుకుంటారు. కానీ, ఈ సినిమాలో విలన్లు డ్యూయెట్‌లు పాడుకోవడం ఒక వెరైటీ కాన్సెప్ట్. ఈ సినిమా విడుదలైన తర్వాత విలన్లకు కూడా డ్యూయెట్‌లు పెట్టే ట్రెండ్ మొదలవుతుందని నా నమ్మకం. ఇలాంటి సరికొత్త పాటను ఆవిష్కరించే అవకాశం రావడం నాకు సంతోషంగా ఉంది,” అని అన్నారు.
దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ, “పోలీస్ వారి హెచ్చరిక’ సినిమా పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. త్వరలో సెన్సార్ పనులు పూర్తి చేసి, ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నాం,” అని తెలిపారు. నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ, “ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం.” అని పేర్కొన్నారు.
నటి నటులు: సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, గిద్దెష్, శుభలేఖ సుధాకర్, షాయాజీ షిండే, హిమజ, జయవాహిని, శంకరాభరణం తులసి, ఖుషి మేఘన, రుచిత, గోవిందా, హనుమ, బాబురామ్ తదితరులు.
కెమెరా: నళిని కాంత్
మ్యూజిక్: గజ్వేల్ వేణు
ఎడిటర్: షార్వాణి శివ
పబ్లిసిటీ & స్టిల్స్ : శ్రీకాంత్ భోక్రె
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ : హనుమంత రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: N. P. సుబ్బారాయడు
ప్రొడ్యూసర్: బెల్లి జనార్దన్
రచన మరియు దర్శకత్వం: బాబ్జి
పిఆర్ఓ : మధు VR
ఇంకా చదవండి: ఆకట్టుకుంటున్న ఓరి పిల్లడా సాంగ్
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"