విజయ్ ‘సాహిబా’ ఆల్బమ్ ప్రోమో విడుదల
1 month ago | 5 Views
రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లో ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్న విషయం తెలిసిందే. హీరియే పాటతో క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ జాస్లీన్ రాయల్ విజయ్‌తో ఈ ఆల్బమ్ చేస్తుంది. ‘సాహిబా’ అంటూ ఈ ఆల్బమ్ రానుండగా.. ఇందులో విజయ్ సరసన రాధిక మోహన్ నటిస్తుంది. ఇప్పటికే రాధికా- జస్లీన్ రాయల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘నై జానా’ సాంగ్ సూపర్ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సాంగ్ ఎలా ఉండబోతుందని ప్రేక్షకుల ఎదురుచూస్తున్నారు. ఈ ఆల్బమ్‌కి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్‌లు విడుదల చేయగా.. ఆకట్టుకుంటున్నాయి.
ఈ సాంగ్‌ను నవంబర్ 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ‘సాహిబా’ ఆల్బమ్ నుంచి ప్రోమోను విడుదల చేసింది. ప్రోమో చూస్తుంటే ఇందులో విజయ్ ఫొటోగ్రాఫర్‌గా కనిపించబోతున్నాడు.
ఇంకా చదవండి: బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేతుల మీదుగా "మిస్టర్ ఇడియట్" సినిమాలోని 'కావాలయ్యా..' లిరికల్ సాంగ్ రిలీజ్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# సాహిబా # విజయ్‌దేవరకొండ # రాధికమోహన్