‘మిస్టర్ సెలెబ్రిటీ’ నుంచి రిలీజ్ చేసిన ‘గజానన’ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ విశ్వరూపం
3 months ago | 49 Views
సుదర్శన్ పరుచూరి హీరోగా 'మిస్టర్ సెలెబ్రిటీ' అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ వినాయకుడి నామస్మరణే వినిపిస్తోంది. వినాయక చవితి స్పెషల్‌గా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి ఓ హుషారైన దైవ భక్తి గల పాటను రిలీజ్ చేశారు. ‘గజానన’ అంటూ సాగే ఈ పాటను మంగ్లీ ఆలపించారు. గణేష్ రాసిన ఈ పాటకు వినోద్ ఇచ్చిన బాణీ ఎంతో హుషారుగా అనిపించింది. ఇక ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఈ పాట మార్మోగిపోయేలా కనిపిస్తోంది.
గజానన అంటూ సాగే ఈ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. చాలా రోజుల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంత ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో సాంగ్‌ని చూస్తుంటే నిజంగానే ఉత్సవం జరిగినట్టు అనిపిస్తోంది. తెరపై ఈ పాట కచ్చితంగా ఓ పండుగలా ఉండబోతోందనిపిస్తోంది.
ఈ చిత్రాన్ని ఎన్. పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.
తారాగణం: వరలక్ష్మి శరత్ కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ - RP సినిమాస్
నిర్మాత -చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు
రచయిత, దర్శకుడు - చందిన రవి కిషోర్
కెమెరామెన్ - శివ కుమార్ దేవరకొండ
సంగీతం - వినోద్ యజమాన్య
పాటలు - గణేష్, రాంబాబు గోసాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వెంకట్ రెడ్డి
ఎడిటర్ - శివ శర్వాణి
పీఆర్వో - సాయి సతీష్
ఇంకా చదవండి: "35-చిన్న కథ కాదు" నుంచి నీలి మేఘములలో సాంగ్ రిలీజ్
# MrCelebrity # VaralakshmiSarathkumar # PandurangaRao