'గేమ్ ఛేంజర్' నుంచి నాలుగో పాట, ట్రైలర్ ప్లాన్ అదుర్స్!
4 days ago | 5 Views
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం 'గేమ్‌ఛేంజర్'. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనుండగా.. ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది శంకర్ టీం. 'గేమ్‌ఛేంజర్' నుంచి తాజాగా లాంచ్ చేసిన మూడో సాంగ్ నానా హైరానా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ కలర్‌ఫుల్‌గా సాగుతూ విజువల్ ట్రీట్ పక్కా అని చెబుతోంది. మరోవైపు ఇప్పటికే రిలీజ్ చేసిన రా మచ్చ, జరగండి జరగండి సాంగ్‌కు నెట్టింట మంచి స్పందన వస్తోంది. అప్పుడే నాలుగో పాట విడుదలతో పాటు ట్రైలర్ అప్‌డేట్‌కు సంబంధించిన వార్త అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం నాలుగో సింగిల్ డిసెంబర్ రెండోవారంలో రాబోతుంది. జనవరి మొదటివారంలో ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్నారు. నాలుగో పాట రాంచరణ్, అంజలి కాంబినేషన్‌లో వచ్చే మెలోడీ సాంగ్ అని తెలుస్తుండగా.. ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో రాబోతుందట. అయితే మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా..ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఇంకా చదవండి: 'పుష్ప2' నుంచి పీలింగ్స్ సాంగ్ ప్రోమో రిలీజ్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# గేమ్‌ఛేంజర్ # రామ్ చరణ్ # కియారాఅద్వానీ