'పుష్ప.2'కి తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌!?

'పుష్ప.2'కి తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌!?

1 month ago | 5 Views

అల్లు అర్జున్‌ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ 'పుష్ప 2'.  ఇప్పటికే ఫస్ట్‌ ఆఫ్‌కి సంబంధించి పనులు అన్ని పూర్తి అవ్వగా సెకండ్‌ పార్ట్‌లో ఐటం సాంగ్‌ మినహా మిగతా  అన్ని పనులు పూర్తి అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ నచ్చని సుకుమార్‌ మళ్లీ చేయమని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఎడిటింగ్‌, డబ్బింగ్‌ పనులు ఇంకా పెండింగ్  ఉండడంతో ఈ పనిని తమన్‌కు అప్పగించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే తమన్‌ కూడా కొన్ని బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌లను సుకుమార్‌కి వినిపించినట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా విడుదలకు కొద్ది రోజులో ఉండడంతో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఒక్కొక్కటిగా స్టార్ట్‌ అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఓవర్సీస్‌ బుకింగ్స్‌ స్టార్ట్‌ అవ్వగా రికార్డు సేల్స్‌తో బుకింగ్స్‌ అవుతున్నాయి. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తుంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుంది.

ఇంకా చదవండి: "పుష్ప 2 ది రూల్‌" ఐటమ్ సాంగ్ లో శ్రీలీల

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# పుష్ప-2     # అల్లు అర్జున్‌     # సుకుమార్‌     # తమన్‌    

trending

View More