'ఆయ్‌' చిత్రం నుంచి సూఫియానా సాంగ్‌ విడుదల!

'ఆయ్‌' చిత్రం నుంచి సూఫియానా సాంగ్‌ విడుదల!

3 months ago | 25 Views

నార్నే నితిన్‌ , నయన్‌ సారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆయ్‌’. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తుండగా.. టాలెంటెడ్‌ యంగ్‌ ప్రొడ్యూసర్స్‌ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్‌గా టైటిల్‌ రివీల్‌కు సంబంధించిన కాన్సెప్ట్‌ వీడియో సోషల్‌ విూడియాలో తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అలాగే ఫస్ట్‌ లుక్‌ కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుండి మెలోడి ఆఫ్‌ ది సీజన్‌ అనిపించేలా 'సూఫియానా..’ అనే పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ మధ్యకాలంలో సూపర్‌ హిట్‌ పాటలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన రామ్‌ మిర్యాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.


'సూఫియానా..’ సాంగ్‌ను రామ్‌ మిర్యాల, సవిూర భరద్వాజ్‌, రమ్యశ్రీ పాడారు. శ్రీమణి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. చక్కగా అందరికీ అర్థమయ్యేలా ఈ లిరికల్‌ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. అందమైన లొకేషన్స్‌, బ్యాగ్రౌండ్‌లో అలరించే గోదావరి అందాలు.. నార్నే నితిన్‌, నయన్‌ సారిక మధ్య కనిపిస్తోన్న కెమిస్టీ ప్రేక్షకులను అలరింపజేస్తోంది. సింపుల్‌ కొరియోగ్రఫీలో 'సూఫియానా..’ మెలోడి సాంగ్‌ అందరి హృదయాలను ఆకట్టుకునేలా ఉంది.

'ఆయ్‌’ సినిమాను ప్రారంభం నుంచి సరికొత్తగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఇది సోషల్‌ విూడియాలో తెగ వైరల్‌ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ డిఫరెంట్‌ ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఏస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్‌ కుమార్‌ మన్నె ఆర్ట్‌ డైరెక్టర్‌గా, సవిూర్‌ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేస్తున్నారు.

ఇంకా చదవండి: ‘ఆయ్’ వంటి నెటివిటీ ఫన్ ఎంటర్‌టైనర్‌కి వర్క్ చేయటం కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది : మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల

# Aay     # Narne Nithiin     # Nayan Sarika     # Bunny Vas