'పుష్ప2' నుంచి పీలింగ్స్ సాంగ్ ప్రోమో రిలీజ్
4 days ago | 5 Views
టాలీవుడ్, పాన్ ఇండియాతో పాటు వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప 2 ది రూల్'. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్ మరోసారి టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో వరుస అప్‌డేట్‌లను ఇస్తుంది చిత్రబృందం. ఈ మూవీ నుంచి ఇప్పటికే ట్రైలర్‌తో పాటు మూడు పాటలను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా మరో సాంగ్‌ను అప్‌డేట్‌ను పంచుకుంది. ఈ మూవీ నుంచి పీలింగ్స్ అనే పాట ప్రోమోను పుష్ప టీమ్ తాజాగా విడుదల చేసింది.
కొచ్చిలో జరిగిన మూవీ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఈ పాట గురించి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు. ఈ పాటలోని పల్లవి లిరిక్స్‌కు సంబంధించి అన్ని భాషల్లోనూ మలయాళంలోనే ఉండనున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న ఈ ప్రోమోను మీరు చూసేయండి.
ఇంకా చదవండి: ‘గేమ్ చేంజర్’ నుంచి మెలోడీ ఆఫ్ ది ఇయర్‌గా రొమాంటిక్ సాంగ్ ‘నా నా హైరానా’ విడుదల
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# పుష్ప2 # అల్లుఅర్జున్ # రష్మికమందన్నా # డిసెంబర్5