ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి ‘చుట్టమల్లె..’ సాంగ్ రిలీజ్
4 months ago | 50 Views
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాలా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో భారీ అంచనాలతో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సినిమాను అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
రీసెంట్‌గా మేకర్స్ ‘దేవర’ నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే విడుదలైన ‘ఫియర్ సాంగ్..’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా సోమవారం రోజున ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘చుట్టమల్లె..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్, అందులోని విజువల్స్ ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు పెద్ద ట్రీట్‌లా ఉంది. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. జాన్వీ కపూర్ అందం వావ్ అనిపిస్తోంది. ఇద్దరి జోడీ, మ్యూజిక్‌కి తగినట్లు వారు వేసిన డాన్స్ మూమెంట్స్‌తో ఇంటర్నెట్‌లో పాట వైరల్ అవుతోంది.
హీరోపై తనకున్న ప్రేమను హీరోయిన్ చెప్పటమే ఈ సాంగ్. పాటను రామజోగయ్య శాస్త్రి అద్భుతంగా రాశారు. ఎన్టీఆర్, జాన్వీ జంట పాటలో రొమాంటిక్‌గా కనిపించటం అభిమానులకు కనువిందుగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. బీచ్ తీరంలో ఎన్టీఆర్ డాన్స్, జాన్వీ కపూర్ గ్లామర్ అవతార్‌లో కనిపిస్తూ, వినసొంపుగా ఉన్న పాట మనసును హత్తుకుంటోంది. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చూడటానికి సింపుల్‌గా కనిపిస్తూనే కళ్లు తిప్పుకోనీయట్లేదు.
అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యంలో ‘చుట్టమల్లె..’ పాట ఈ ఏడాది బెస్ట్ మెలోడీ సాంగ్‌గా ప్రేక్షకులను మెప్పించనుంది. శిల్పా రావ్ పాటను ఎంతో శ్రావ్యంగా పాడారు. ఈ కాంబోతో పాట నెక్ట్స్ లెవల్‌కు చేరింది.
హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘దేవర’ను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇది కచ్చితంగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వనుంది. ఇందులో ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ ్ చాకో, నరైన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి ఆర్.రత్నవేలు సినిమాటోగ్రాఫర్, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.
ఇంకా చదవండి: 'ఫస్ట్ లవ్' సాంగ్ ఒక బ్యూటీఫుల్ సినిమా చూసిన ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది: ఎస్ఎస్ తమన్
# Devara # JrNtr # SaifAliKhan # PrakashRaj # JanhviKapoor # OTT