"నేను - కీర్తన" నుంచి "మనసయ్యింది" లిరికల్ వీడియో విడుదల!!

3 months ago | 51 Views

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన "నేను-కీర్తన" ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి "మనసయ్యింది" లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.  అంచుల నాగేశ్వరరావు - సి.హెచ్.ఆర్ రాసిన ఈ గీతానికి  హరి గుంట - లాస్యప్రియ గాత్రం అందించారు. ఎం. ఎల్.రాజా ఈ చిత్రానికి సంగీతం సారధి. ఈ గీతాన్ని "రమేష్ బాబు - మేఘన"లపై కులుమనాలిలో చిత్రీకరించారు!!


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ... నేను - కీర్తన" చిత్రానికి పాటలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.  మా టీమ్ అందరికీ మంచి పేరు తెస్తుందనే నమ్మకం నాకుంది. మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్కిన "నేను - కీర్తన" చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు!!

రేణుప్రియ, సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన

ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ,

డి.ఐ: భాను ప్రకాష్,

వి.ఎఫ్.ఎక్స్: నవీన్,

ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి,

పోరాటాలు: నూనె దేవరాజ్,

నృత్యాలు: అమిత్ కుమార్ - సి.హెచ్.ఆర్,

పాటలు: సి.హెచ్.ఆర్ - అంచుల నాగేశ్వరరావు - శ్రీరాములు,

సంగీతం: ఎం.ఎల్.రాజా,

ఛాయాగ్రహణం: కె. రమణ,

కూర్పు: వినయ్ రెడ్డి బండారపు,

సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ),

నిర్మాత: చిమటా లక్ష్మికుమారి,

రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)!!

ఇంకా చదవండి: "ఈసారైనా?!" సినిమా నుండి మొదటి పాట ఆడియన్స్‌ ను అలరిస్తోంది

# NenuKeerthana     # Tollywood    

trending

View More