ఘనంగా "జయహో రామానుజ" సినిమా సాంగ్స్ రిలీజ్ ఈవెంట్
1 day ago | 5 Views
లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "జయహో రామానుజ". ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర సాంగ్స్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ - లయన్ సాయి వెంకట్ నాకు మంచి మిత్రులు. ఆయన జయహో రామానుజ వంటి గొప్ప సినిమాను రూపొందించడం సంతోషంగా ఉంది. పాన్ ఇండియా భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ, హిందీ, సంస్కృతంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారంటే ఇది చిన్న సినిమా అనకూడదు. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయడంలో మా వంతు సపోర్ట్ చేస్తాం. జయహో రామానుజ సాయి వెంకట్ కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.
నిర్మాత, సినీ జర్నలిస్ట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ - "జయహో రామానుజ" సాంగ్స్ లాంఛ్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించి సాయి వెంకట్ గారికి గొప్ప పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సాయివెంకట్ గారికి శుభాకాంక్షలు అందిస్తున్నా అన్నారు.
సింగర్ పద్మ మాట్లాడుతూ - "జయహో రామానుజ" చిత్రంలో నేను పాట పాడాను. ఈ పాట పాడమని సాయి వెంకట్ గారు ఎంకరేజ్ చేశారు. సింగర్ కావాలనే నా కల ఈ చిత్రంతో తీరింది. మీరంతా "జయహో రామానుజ" చిత్రానికి పెద్ద సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నా అన్నారు
దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – మన తెలుగు రాష్ట్రాల్లో రామానుజాచార్యుల గురించి పెద్దగా తెలియదు. కానీ తమిళనాట ప్రతి ఒక్కరికీ ఆయన ఎవరో తెలుసు. చినజీయర్ స్వామి సమతామూర్తి విగ్రహాన్ని మన దగ్గర ప్రధాని, రాష్ట్రపతి వంటి పెద్ద వాళ్లు వచ్చి ఆవిష్కరించినప్పుడు తెలుగు రాష్ట్రాల వారికి బాగా ఆయన గురించి తెలిసింది. తెలుగు ప్రజలకు రామానుజాచార్యుల వారి గొప్పదనం తెలియజేసే ప్రయత్నంలోనే ఈ చిత్రాన్ని రూపొందించాను. వెంకటేశ్వర స్వామికే గురువు లాంటి వారు రామానుజులు. వెంకటేశ్వరుడికి శంఖు చక్రాలు రామానుజాచార్యుల వారే బహూకరించారు. కమల్ హాసన్ గారు సోషల్ మూవీలో 10 పాత్రలు చేశారు. కానీ పౌరాణికంలో ఎవరూ 11 పాత్రల్లో నటించలేదు. నేను "జయహో రామానుజ" చిత్రంలో 11 పాత్రలు చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నా. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయండి అని మిత్రులు ఇచ్చిన సలహాతో తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ, హిందీ, సంస్కృతంతో పాటు మిగతా ప్రపంచ భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం. ఈ రోజు నా బర్త్ డే సందర్భంగా సాంగ్స్ రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ క్రమంలో నాకు నా మిత్రులు ముత్యాల రాందాస్ తో పాటు ఇతర ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూషన్ లో సపోర్ట్ చేస్తున్నారు. నా కూతురు ప్రవళ్లిక సినిమా నిర్మాణంలో ఎంతో పట్టుదలగా పనిచేస్తోంది. త్వరలో ఓటీటీ కూడా ప్రారంభిస్తున్నాం. అన్నారు.
నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ – ముందుగా నాన్నకు బర్త్ డే విషెస్ చెబుతున్నా. "జయహో రామానుజ" వంటి భారీ చిత్రాన్ని నేను నిర్మించగలను అని నమ్మి నన్ను సపోర్ట్ చేస్తున్న నాన్నకు థ్యాంక్స్. ఆయన ప్రోత్సాహం లేకుంటే నేను ఈ సినిమా ప్రొడ్యూస్ చేసేదాన్ని కాదు. రాజమౌళి గారి సినిమాలు కూడా రిలీజ్ వాయిదా పడుతుంటాయి. క్వాలిటీ కోసం కొంత టైమ్ తీసుకోవడం మంచిదే. భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో జయహో రామానుజ చిత్రాన్ని నిర్మించాం. ఈ రోజు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని నిర్మించాను. త్వరలోనే మా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. మీరంతా మీ ఆదరణ చూపిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
నటీనటులు - లయన్ సాయి వెంకట్, జో శర్మ, సుమన్, ప్రవళ్లిక అశ్వాపురం వేణుమాధవ్, అప్పం పద్మ, తదితరులు
టెక్నికల్ టీమ్
ప్రెజెంట్స్ : సుదర్శనం హేమలత
బ్యానర్ : సుదర్శనం ప్రొడక్షన్స్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టన్ : లయన్ సాయి వెంకట్
నిర్మాతలు : సుదర్శనం సాయి ప్రసన్న, సుదర్శనం ప్రవళ్లిక
పి.ఆర్.ఓ : చందు రమేష్
ఇంకా చదవండి: యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సంతాన ప్రాప్తిరస్తు" మూవీ నుంచి 'నాలో ఏదో..' లిరికల్ సాంగ్ రిలీజ్
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"