రామ్ గోపాల్ వర్మ 'శారీ' చిత్రం నుండి

రామ్ గోపాల్ వర్మ 'శారీ' చిత్రం నుండి "ఐ వాంట్ లవ్" లిరికల్ వీడియో సాంగ్ విడుదల

1 month ago | 32 Views

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెన్ నుండి 'శారీ' అనే చిత్రం రాబోతోంది. పాన్ ఇండియా మూవీగా  తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయనున్నారు.  గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో 'శారీ'ని ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ వ్యాపారవేత్త  రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా  పలు నిజజీవిత సంఘటనల ఆధారాలతో  సైకలాజికల్ థ్రిల్లర్ గా 'శారీ' మూవీ రూపొందుతోంది.  

రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు సరికొత్త  సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ  జనాన్ని రంజింప చేస్తూ ఉంటారు. తన మొదటి చిత్రం 'శివ' లో  కొన్ని సన్నివేశాలను  ప్రప్రధమంగా స్టడీ క్యామ్ తో చిత్రీకరించి సినిమా పరిశ్రమకు సరికొత్త సాధనాన్ని పరిచయం చేసారు. అలాగే రక్త చరిత్ర చిత్రం తో డిజిటల్ కెమెరాలను పరిచయం చేసి రీల్స్ లేకుండా ఫిలిం లాబ్స్ ని మూయించారు. ఇప్పుడేమో మ్యూజిక్  రంగంలో మ్యూజిక్ డైరెక్టర్స్, గీత రచయితలకు, సింగర్స్ కు పనిలేకుండా చేసేలా వున్నారు. ఇక విషయానికొద్దాం....    ఆర్జీవీ డెన్ నుండి ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్ బ్యానర్ లో రాబోతున్న 'శారీ' సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఈ సారి  A I లేటెస్ట్  టెక్నాలజీని మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో ప్రయోగించారు.

అదెలా అంటే సంగీతప్రపంచంలోనూ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (కృతిమ మేధ) సప్తస్వరాలతో విన్యాసాలు చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్ కాదు, పాటల రచయితలకు సింగర్స్ కు సమానంగా సవాల్ చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'శారీ'తో భారతీయ చలన చిత్ర చరిత్రలో ఫస్ట్ టైం ఏఐ తో  రూపొందించే సంగీతంతో మ్యూజిక్ డిపార్ట్మెంట్స్ కి కంటిమీద కునుకు లేకుండా చేయనున్నారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్  పక్రియతో 'శారీ' చిత్రంలోని "ఐ వాంట్ లవ్" అనే  గీతాన్నిఈ రోజు ఉదయం 11 గంటలకు లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసి సినిమా చరిత్రలో మరో అధ్యాయాన్ని రాసారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ వెల్లడించిన అంశాలను చూద్దాం...


"మా పార్టనర్ రవివర్మతో కలసి నేను 'ఆర్జీవీ డెన్ మ్యూజిక్'ను ఆరంభిస్తున్నాని చెప్పడానికి థ్రిల్ ఫీలవుతున్నాను.ఇందులో  ఏఐ యాప్స్ తో రూపొందిన సంగీతo మాత్రమే ఉంటుంది.  'శారీ'లో మొత్తం ఏఐ సంగీతంతోనే సాగుతున్నాం. నేపథ్య సంగీతాన్ని కూడా ఏఐ మ్యూజిక్ నే ఉపయోగిస్తున్నాం.

'శారీ'నే వందేళ్ల భారతీయ చలన చిత్ర చరిత్రలో ఏఐ మ్యూజిక్ తో వస్తున్న పూర్తి స్థాయి, మొదటి  చలన చిత్రమని గర్వంగా చెప్పొచ్చు.  ఇక పై  మనుషులు స్వరపరిచే సంగీతాన్ని త్వరలోనే ఏఐ సర్వ నాశనం చేయబోతుంది. ఇక భవిష్యత్ లో మ్యూజిక్ కి సంబందించిన టెక్నిషన్స్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్, పాటలు రాసేవాళ్ళు, పాటలు పాడేవాళ్లు అందరు చరిత్రలో మిగిలిపోతారు.  

రూపాయి ఖర్చు లేకుండా  ఏఐ యాప్స్ ద్వారా సంగీతాన్ని సమకూర్చడం, పాటలు రూపొందించడం, వాటిని కావలసిన తీరున మలచుకోవడం ద్వారా మనకు ఇష్టమైన ట్యూన్ లో, ఇష్టమైన వాయిస్ లో క్షణాల్లో  కావలసిన విధంగా పాటల్ని ఏఐ ఇస్తుంది. అంతేకాదు, ఈ యాప్స్ ద్వారా  సంగీతంలో మనదైన ప్రత్యేక గుర్తింపునిస్తుంది.

ఏఐ టెక్నాలజీని వాడటం వల్ల నేను కోరుకున్న విధంగా మ్యూజిక్ చేసుకోవచ్చు. సామాన్యులకు సైతం  అర్ధమయ్యేలా ఏఐ మ్యూజిక్ అందుబాటులోకి వచ్చి ఓ 'బిగ్గెస్ట్ గేమ్ చేంజర్' కాబోతోంది. సంగీతం నేర్చుకున్నవారే కాదు ఇకపై సరిగమలు అంటే తెలియని డ్రైవర్, రైతు కూలి, నర్స్, కాలేజ్ స్టూడెంట్, స్కూల్ పిల్లలు, ఒకరేమిటి మ్యూజిక్ పై అభిమానం ఉంటే చాలు కోరుకున్న తీరున ట్యూన్స్ పలికించే అవకాశం ఉంది. కొందరు ఏఐ యాప్స్ తో మంచి సంగీతాన్ని రూపొందించలేరు అని వాదించవచ్చు. అయితే ఏమిటి 'మంచి'? ఒకరికి ఇష్టమైనది మరొకరికి ఇష్టం కాకపోవచ్చు. మరి ఏది మంచి మ్యూజిక్ అని ఎలా నిర్ణయించగలం?

ఓ పాట ట్యూన్ కట్టేటప్పుడు ఈ పాట  పాపులర్ అవుతుందా లేదా అనేది నాలుగు గోడల మధ్య పనిచేసే ఏ   దర్శకుడు,  మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయిత, సింగర్స్ చెప్పలేరు. ప్రజల్లోకి వెళ్లాకే పాట హిట్టా ఫట్టా అని తెలిసేది. కానీ ఇక్కడ అలా కాదు ఈ మ్యూజిక్  ఆకట్టుకుంటుందా? లేక ఏ విధంగానైనా మెప్పించలేదా? దేనికి సమాధానం ఏఐతో రూపొందించే సంగీతం వినియోగదారుని సంతృప్తిపరచడమే అన్నది అర్థం చేసుకోవాలి. ఎందరో పిల్లలు, కుర్రాళ్ళ మొబైల్ ఫోన్స్ లో తమకు నచ్చిన వాటిని చూసుకుంటూ ఆనందిస్తుంటారు. వాటిని ఇతరులు కూడా చూసి ఆనందించాలన్న నియమేమీ లేదు కదా! అందుకనే  ఏఐ మ్యూజిక్ తో  మనకు నచ్చెనంత వరకు ప్రయోగాలు చేసుకొనే అవకాశముంది. అది ఏ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతంలో ఉండదు. రాబోయే రోజుల్లో గాయకులు, గీతరచయితలు, సంగీతదర్శకులు, సంగీతకళాకారులకు ఏఐ మ్యూజిక్ యాప్స్ చెక్ పెట్టబోతున్నాయి. సందేహం లేదు! ఎందుకంటే ఏఐ మ్యూజిక్ యాప్స్ ద్వారా కోరుకున్న తీరున సంగీతాన్ని సృష్టించుకోవచ్చు. అదే విధంగా రచన, వాయిస్, ట్యూన్ అన్నిటినీ మనమే పుట్టించ వచ్చు .     ఫ్యూచర్  లో యూత్  మ్యూజిక్ రంగం లోకి వెళతాననడం పిచ్చి ఆలోచన. ఎందుకంటే ఏఐ మ్యూజిక్ తో మనుషులు పోటీపడలేరన్నసత్యం తెలుసుకోవాలి.

కొత్తొక వింత- పాతొక రోత అనే సామెత గుర్తుందిగా! కొత్తదనం కోసమే మన మనసు ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటుంది. అదే తీరున సరికొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతీసారి అప్పటి దాకా మనుగడలో ఉన్న పాత పద్ధతులు   కనుమరుగై పోతాయి. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు పాటలు వినాలంటే రేడియోలు, గ్రామ్ ఫోన్ రికార్డులు ఆధారం! ఇప్పుడు కోరుకున్న పాటను క్షణాల్లో సంపాదించుకొనే వీలు మన చేతిలోని మొబైల్ ఫోన్ తోనే కలుగుతోంది. అంతేనా, ఆ పాట దేనికి కాపీ అన్న వాస్తవాలూ కొన్ని యాప్స్ సూచిస్తున్నాయి. " అన్నారు.

ఇక్కడ మరికొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి కారు రాకతో గుర్రపు బండ్లు కనుమరుగయ్యాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో సాటిలైట్ చానెల్స్ లో సినిమాలు చూడటం మానేశారు, డీవీడీలు తుడిచిపెట్టుకు పోయాయి. ఈ-మెయిల్ రాకతో 'టపా' టపా కట్టేసింది. ఏఐ రాకతో ఇంకా  ఏమేమీ తుడచిపెట్టుకు పోతాయో ఎవరికి తెలుసు!?

బ్యానర్ : ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్

నటీనటులు : సత్యా యాదు, ఆరాధ్య దేవి తదితరులు  

సినిమాటోగ్రఫీ : శబరి,

నిర్మాత : రవి వర్మ,

దర్శకుడు : గిరి కృష్ణ కమల్

ఇంకా చదవండి: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'మ్యాడ్ స్క్వేర్' నుంచి 'లడ్డు గాని పెళ్లి' గీతం విడుదల

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Saaree     # RamGopalVarma     # SatyaYadu    

trending

View More