"చిట్టి పొట్టి" సాంగ్ విడుదల చేసిన నిర్మాత దిల్ రాజు !!

4 months ago | 46 Views

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా ... ఒక అడబిడ్డకి పుట్టింటి పైన ఉన్న ప్రేమ, మమకారం ను తెలిపే చిత్రం.  ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది.

చిట్టి పొట్టి టైటిల్ , మరియు మోషన్ పోస్టర్ కు చక్కటి ఆదరణ లభించింది, అలాగే ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లిమ్స్ కు విశేష ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో గ్లిమ్స్ లోని డైలాగ్స్ వైరల్ అవ్వడం విశేషం. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి తెలిపారు.

ఈ సినిమా నుండి చిట్టి పొట్టి సాంగ్ ను నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''సాంగ్ బాగుంది, ప్రతి అన్నా చెల్లి కి ఈ పాట కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్... శ్రీ వెంకట్ మంచి ట్యూన్ ఇచ్చారు, దర్శక..నిర్మాత...భాస్కర్ యాదవ్  దాసరి గారికి చిట్టి పొట్టి సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు. 


నటీనటులు:

రామ్ మిట్టకంటి , పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ

సాంకేతిక నిపుణులు:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి

సంగీతం: శ్రీ వెంకట్

కొరియోగ్రాఫర్: కపిల్ మాస్టర్ ఎడిటర్: బాలకృష్ణ బోయ

కెమెరా: మల్హర్బట్ జోషి

పి.ఆర్.ఓ: లక్ష్మి నివాస్

ఇంకా చదవండి: 'డబుల్‌ ఇస్మార్ట్‌' నుంచి మరో పాట విడుదల!

# ChittiPotti     # pavithra     # RamMittakanti     # DilRaju    

trending

View More