'దేవర'లో ఆయుధపూజ సాంగ్‌!

'దేవర'లో ఆయుధపూజ సాంగ్‌!

3 months ago | 46 Views

గ్లోబర్‌ స్టార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'దేవర'.    కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రానుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్‌ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మ్యూజిక్‌ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ఫియర్‌ సాంగ్‌, చుట్టమల్లె పాటలు సోషల్‌ విూడియాను షేక్‌ చేస్తున్నాయి. ఇక సినిమాకే హైలెట్‌గా నిలువబోయే ఆయుధ పూజ  సాంగ్‌ లుక్‌ విడుదల చేశారు. 

తారక్‌ దేవరగా ఆయుధాలతో పోరాటం నేపథ్యంలో పాట ఉండబోతున్నట్టు హింట్‌ ఇస్తున్నాడు కొరటాల శివ.  దేవర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న తారక్‌ టీం చెన్నైలో సందడి చేసింది. రిలీజ్‌ వరకు ఏదో ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ ప్లాన్‌తో అభిమానులను ఫుల్‌ ఖుషీ చేయాలని తారక్‌ ఫిక్సయినట్టు అర్థమవుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. దేవరలో బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళ యాక్టర్‌ టామ్‌ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇంకా చదవండి:"చిట్టి పొట్టి" మూవీ నుండి మరిచిపోకమ్మ మారువబోకమ్మ పాట విడుదల !!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Devara     # JrNtr     # SaifAliKhan     # PrakashRaj     # JanhviKapoor     # OTT    

trending

View More