'డబుల్‌ ఇస్మార్ట్‌' నుంచి మరో పాట విడుదల!

'డబుల్‌ ఇస్మార్ట్‌' నుంచి మరో పాట విడుదల!

4 months ago | 49 Views

ఉస్తాద్‌ రామ్‌ పోతినేని , డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ల డెడ్లీ కాంబినేషన్‌లో సంజయ్‌ దత్‌ పవర్‌ ఫుల్‌ పాత్రలో ,కావ్య థాపర్‌ కథానాయికగా తెరకెక్కిన మోస్ట్‌-వెయిటెడ్‌ పాన్‌ ఇండియా మూవీ 'డబుల్‌ ఇస్మార్ట్‌’ ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్‌ ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో వేగం పెంచుతూ రెండు పాటలను విడుదల చేసి సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లే  ప్రయత్నాలు చేసింది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం మూడో సింగిల్‌ 'క్యా లప్డా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇప్పటివరకు వచ్చిన ఫస్ట్‌ సింగిల్‌ 'స్టెప్పా మార్‌’, సెకెండ్‌ సింగిల్‌ 'మార్‌ ముంత చోడ్‌ చింత’ అదిరిపోయే స్పందనను రాబట్టుకోగా ఇప్పుడు మేకర్స్‌ థర్డ్‌ సింగిల్‌ 'క్యా లప్డా’ ప్రోమోతోనే మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది.


తాజాగా విడుదలైన పాట కూడా వాటిని మించేలా మంచి మెలోడియస్‌గా ఉంది. మణిశర్మ మార్క్‌ వినిపించింది. అంతేకాదు విజువల్స్‌ పరంగా పూరి  తన గురువు ఆర్జీవీని అట్టే దించేసినట్లు ఆ క్లోజప్‌ షాట్లు చూస్తే ఇట్టే తెలిసి పోతుంది. పాటలో రామ్‌, కావ్యా థాపర్‌  రొమాంటిక్‌ కెమిస్టీ వండర్‌ ఫుల్‌గా కుదిరింది.

ఆగస్ట్‌ 15న స్వాతంత్య దినోత్సవం రోజున ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్  చేస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి సామ్‌ కె నాయుడు, జియాని గియానెలీ సినిమాటోగ్రఫీ బాధ్యతను నిర్వర్తించారు.

ఇంకా చదవండి: ''లక్కీ భాస్కర్'' చిత్రం నుంచి టైటిల్ ట్రాక్ విడుదల

# DoubleIsmart     # RamPothineni     # PooriJagannath     # CharmiKaur    

trending

View More