'మిస్టర్ బచ్చన్'లో మరో రొమాంటిక్ సాంగ్
5 months ago | 51 Views
'మిస్టర్ బచ్చన్’గా సినీప్రియుల్ని అలరించనున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని హరీశ్ శంకర్ తెరకెక్కించారు. పీపుల్ విూడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా బుధవారం ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు.'చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మా.. బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా' అంటూ సాగిన ఈ మెలొడీ గీతానికి మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూర్చగా.. సాహితీ సాహిత్యమందించారు. సాకేత్ కొమండూరి, సవిూర భరద్వాజ్ సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటలో రవితేజ, భాగ్యశ్రీ జంటగా కనిపించిన తీరు.. శేఖర్ మాస్టర్ తీర్చిదిద్దిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోన్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈ సినిమాకి కూర్పు: ఉజ్వల్ కులకర్ణి, ఛాయాగ్రహణం: అయనంక బోస్.
ఇంకా చదవండి: 'మిస్టర్ బచ్చన్' సాంగ్‌పై కామెంట్స్.. గట్టిగా సమాధానం ఇచ్చిన హరీష్ శంకర్
# Mrbachchan # Raviteja # Bhagyashriborse # Jagapathibabu # August15