ఆకట్టుకుంటున్న వెంకీ సాంగ్‌

ఆకట్టుకుంటున్న వెంకీ సాంగ్‌

3 months ago | 5 Views

టాలీవుడ్‌ యాక్టర్‌ వెంకటేశ్‌ కాంపౌండ్‌ నుంచి రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్‌ రావిపూడి డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన మీను సాంగ్‌ ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. తాజాగా మేకర్స్‌ ఫుల్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ను లాంచ్‌ చేశారు. అనంత్‌ శ్రీరామ్‌ రాసిన ఈ పాటను భీమ్స్‌ సిసిరోలియో, ప్రణవి ఆచార్య పాడారు. మీనాక్షి చౌదరి వెంకీను ఫాలో అవుతూ సాగే ఈ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. వెంకీ నుంచి అభిమానులు కోరుకునే ఎలిమెంట్స్‌తో సాగుతున్న ఈ సాంగ్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మేకర్స్‌ ఇప్పటికే గోదారి గట్టు మీద రామసిలకవే.. ఓ.. గోరింటాకెట్టుకున్న సందమామవే సాంగ్‌ లాంచ్‌ చేయగా.. మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ రాబడుతూ దూసుకెళ్తోంది. భాస్కర భట్ల రాసిన ఈ పాటను రమణ గోగుల, మధుప్రియ పాడగా.. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు. ఈ మూవీలో పాపులర్‌ మరాఠీ యాక్టర్‌, యానిమల్‌ ఫేం ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్‌ నటుడు వీటీవీ గణేశ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రయాంగిల్‌ క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు.

ఇంకా చదవండి: థియేటర్లలోనే 'ఇండియన్‌-3'

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# వెంకటేశ్‌     # అనిల్‌ రావిపూడి    

trending

View More