
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' నుంచి మొదటి గీతం 'మాట వినాలి' విడుదల
2 months ago | 5 Views
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'హరి హర వీర మల్లు' చిత్ర పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'మాట వినాలి' అంటూ సాగే మొదటి గీతాన్ని నిర్మాతలు ఆవిష్కరించారు. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించడం విశేషం.
సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే 'మాట వినాలి' లిరికల్ వీడియోతో 'హరి హర వీర మల్లు' సంగీత ప్రయాణం మొదలైంది. "వినాలి, వీరమల్లు మాట చెప్తే వినాలి" అంటూ తెలంగాణ మాండలికంలో పవన్ కళ్యాణ్ చెప్పే హృద్యమైన పంక్తులతో పాట ప్రారంభమైన తీరు అమోఘం. అందరూ పాడుకునేలా అర్థవంతమైన పంక్తులు, శక్తివంతమైన జానపద బీట్ లతో 'మాట వినాలి' గీతం మనోహరంగా ఉంది. పెంచల్ దాస్ అందించిన సాహిత్యం లోతైన భావాన్ని కలిగి ఉంది. మంచి మాటలను వినడం మరియు వాటి నుండి వచ్చే జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అద్భుతమైన సందేశంతో ఈ పాట సాహిత్యం నడిచింది. ప్రతి వాక్యం విలువైన జీవిత పాఠాలను అందిస్తుంది. జీవితంలో సానుకూలత మరియు ధర్మాన్ని స్వీకరించడానికి శ్రోతలను ప్రోత్సహిస్తుంది.
అటవీ నేపథ్యంలో చిత్రీకరించిన 'మాట వినాలి' పాట విజువల్స్ ఆకట్టుకున్నాయి. అడవిలో మంట చుట్టూ వీరమల్లు అనుచరుల బృందం గుమిగూడినట్లుగా లిరికల్ వీడియోలో చూపించారు. ఇక పవన్ కళ్యాణ్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ లు పాట విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ మనోహరమైన, ఆకర్షణీయమైన గీతం సంగీత ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేలా ఉంది. ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హృదయపూర్వకంగా ఆలపించి ఈ పాటకు మరింత అందాన్ని జోడించారు. తనదైన గాత్రంతో మొదటి నుండి చివరి వరకు శ్రోతలను కట్టిపడేసేలా చేశారు.
'హరి హర వీరమల్లు' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో అలరించనుంది. ఈ క్రమంలో మొదటి గీతాన్ని తెలుగులో మాట వినాలి, తమిళంలో కెక్కనుం గురువే, మలయాళంలో కేల్‌క్కనం గురువే, కన్నడలో మాతు కేలయ్యా మరియు హిందీలో బాత్ నీరాలి గా విడుదల చేశారు. కీరవాణి యొక్క అద్భుతమైన స్వరకల్పనకు తెలుగులో పెంచల్ దాస్, తమిళంలో పి.ఎ. విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా సాహిత్యం అందించారు.
హరి హర వీరమల్లు చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అణగారిన వర్గాల కోసం అన్యాయంపై పోరాడే యోధుడు కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.
హరి హర వీరమల్లు చిత్రీకరణ తుది దశలో ఉంది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, 'బాహుబలి' ఫేమ్ శ్రీనివాస్ మోహన్, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకత్వం: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ - లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
ఇంకా చదవండి: హీరో కిరణ్ అబ్బవరం 'దిల్ రూబా' నుంచి ఫస్ట్ సింగిల్ 'అగ్గిపుల్లె..' ఈ నెల 18న రిలీజ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!