డిసెంబర్‌ 20ని  లాక్‌ చేసిన 'రాబిన్‌ హుడ్‌'

డిసెంబర్‌ 20ని లాక్‌ చేసిన 'రాబిన్‌ హుడ్‌'

5 months ago | 47 Views

టాలీవుడ్‌ హీరో నితిన్‌  వెంకీ కుడుముల  కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'రాబిన్‌హుడ్‌'  భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయగా..  మంచి ఆదరణ లభించింది. అయితే  శ్రీరామ నవమి సందర్భంగా మూవీ నుంచి విడదల తేదీ అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. ఈ సినిమాను వరల్డ్‌ వైడ్‌గా డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించారు.

ఈ విషయాన్ని తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో రాశీఖన్నాను నాయికగా ఖరారు చేసినట్లు సమాచారం. గతంలో ఈ జంట 'శ్రీనివాస కల్యాణం’ చిత్రంలో నటించారు. సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఈ జోడీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నది. మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ కీలకపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నితిన్‌కు ఉన్న పాన్‌ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సంజయ్‌దత్‌ ఈ సినిమాకు తీసుకున్నట్లు టాక్‌ నడుస్తుంది.

ఇంకా చదవండి: 'టుక్‌ టుక్‌' టైటిల్‌ పోస్టర్‌ వచ్చేసింది!

# Robinhood     # Nithiin     # VenkyKudumula    

trending

View More