రష్మిక మందన్నా బర్త్‌డే.. 'పుష్ప-2' నుంచి లుక్ విడుదల!
5 months ago | 50 Views
'యానిమల్' సినిమాతో నేషనల్ వైడ్‌గా స్టార్ స్టేటస్ దక్కించుకున్న కన్నడ కస్తూరి మన రష్మిక మందన్నా జన్మదినం సందర్భంగా హ్యాపీ బర్త్ డే రష్మిక పేరుతో మారు మ్రోగుతోంది. ఈ క్రమంలో 'పుష్ప-2'లో ఆమె లుక్ విడుదల చేశారు. చాలా గంభీరంగా ఉన్న ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఆమె అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన కొత్త అప్డేట్లతో సోషల్ విూడియా బద్దలు అవుతుంది.
అమె నటిస్తోన్న తెలుగు చిత్రాలకు చెందిన ఫస్ట్‌లుక్‌లు రిలీజ్ చేస్తూ ఆయా చిత్రాల టీమ్స్ రష్మిక జన్మదినాన్ని మరింత క్రేజ్‌గా మార్చేశాయి. ఈ క్రమంలో ఇప్పటికే ష్మిక మందన్నా నటిస్తోన్న మూడు పాన్ ఇండియా చిత్రాలు 'పుష్ప 2 ది రూల్' నుంచి శ్రీవల్లి లుక్‌ను రిలీజ్ చేయగా, ఆ తర్వాత ది గీతా ఆర్ట్స్ వారి గర్ల్ ఫ్రెండ్ నాగార్జున, ధనుష్‌లతో నటిస్తోన్న 'కుబేరా చిత్రాల నుంచి కూడా పోస్టర్లు రిలీజ్ చేసి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సోషల్ విూడియాలో ఈరోజు రష్మిక నామ జపం జరుపుతుండగా.. సామాజిక మాధ్యమాల్లో రష్మిక పేరు ప్రథమ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఫ్యాన్స్, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెళ్లువలా వస్తున్నాయి.
ఇంకా చదవండి: చిమటా ప్రొడక్షన్స్ "నేను-కీర్తన" ఫస్ట్ లుక్ & టీజర్ విడుదల!!
# Pushpa 2 # Allu Arjun # Fahadh Faasil # Rashmika Mandanna