‘జీబ్రా’ మూవీ రివ్యూ : క్రైమ్ థ్రిల్లర్ !
1 month ago | 5 Views
(చిత్రం : ‘జీబ్రా’,
విడుదల : నవంబర్ 22, 2024,
రేటింగ్ : 2.25/5,
నటీనటులు : సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్,
దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్,
స్క్రీన్ ప్లే : ఈశ్వర్ కార్తీక్,
నిర్మాతలు : బాల సుందరం, ఎస్.ఎన్ రెడ్డి, దినేష్ సుందరం,
సంగీతం: రవి బస్రూర్,
సినిమాటోగ్రఫీ : సత్య పొన్మార్)
సత్యదేవ్ నటించిన తాజా చిత్రం ‘జీబ్రా’. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమాలో కన్నడ నటుడు డాలీ ధనంజయ కూడా మరో లీడ్ రోల్‌లో నటించాడు. కాగా ఈ చిత్రం ఈ శుక్రవారం (నవంబర్ 22, 2024) విడుదల అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం ...
కథ : ఒక బ్యాంక్ ఎంప్లాయ్ సూర్య (సత్యదేవ్). మరో బ్యాంక్ ఎంప్లాయ్ స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నా ఇంట్లో చెప్పడానికి మాత్రం సూర్యకి దైర్యం సరిపోదు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య స్వాతి ఓ సమస్యలో ఇరుక్కుంటుంది. ఆమెను రక్షించడానికి సూర్య చేసిన ఓ పని కారణంగా అతిపెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. నాలుగు రోజుల్లో ఐదు కోట్లు ఆదికి (డాలీ ధనంజయ) ఇవ్వాల్సిన పరిస్థితి వస్తోంది. ఓ సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ అయిన సూర్య, అంత పెద్ద ఎమౌంట్ ను ఎలా తీసుకువచ్చాడు?, ఆ ఐదు కోట్లు కోసం సూర్య ఏం చేశాడు ?, ఈ మధ్యలో అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి ?, ఈ మొత్తం కథలో చివరకు జరిగిన కథ ఏమిటి ? అనేది ఆసక్తికరం.
విశ్లేషణ: ‘జీబ్రా’ అంటూ వచ్చిన ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్. మెయిన్ థీమ్, ప్రధాన పాత్రల మధ్య డ్రామా, కొన్ని ఫన్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. అలాగే, సత్యదేవ్ తో పాటు మిగిలిన నటీనటుల నటన మరియు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఐతే, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగకపోవడం, సెకండాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఈశ్వర్ కార్తీక్ తీసుకున్న కథాంశం, మరియు సత్యదేవ్ – డాలీ ధనుంజయ పాత్రలు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల స్లోగా సాగుతుంది. పైగా కీలక సన్నివేశాలు కూడా లాజికల్ గా కనెక్ట్ కావు. ముఖ్యంగా హీరో పాత్రతో పాటు విలన్ అండ్ హీరోయిన్ పాత్రలను కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది. నిజానికి ఓ సాధారణ ఉద్యోగి కేవలం నాలుగు రోజుల్లో ఐదు కోట్లు సంపాదించాల్సిన పరిస్థితి వస్తే.. అతని మనస్తత్వం ఎలా ఉంటుంది ?, అతని ప్రవర్తన ఎలా మారిపోతుంది ? వంటి అంశాలను ఇంకా ఎఫెక్టివ్ గా చూపించి ఉండి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ఎంటర్ టైన్ గా మలచలేకపోయారు. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ బాగుంది. ఓపెనింగ్ నుంచి సూర్య (సత్యదేవ్) క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా సత్యదేవ్, అతని పాత్ర చుట్టూ నడిచే మనీ రిలేటెడ్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. నాలుగు రోజుల్లో ఐదు కోట్లు సంపాదించే ట్రాక్, ఈ క్రమంలో పాత్రల మధ్య అనుకోకుండా జరిగే డ్రామా.. ఇక సత్యదేవ్ – డాలీ ధనంజయ పాత్రలను లింక్ చేస్తూ దర్శకుడు రాసుకున్న సీన్స్ బాగున్నాయి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ప్రధాన పాత్రలో నటించిన సత్యదేవ్ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ‘సూర్య’ పాత్రను సత్యదేవ్ చాలా బాగా పండించారు. మరో కీలక పాత్రలో కనిపించిన డాలీ ధనంజయ కూడా మెప్పించాడు. హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ తన పాత్రకు న్యాయం చేసింది. బాబాగా సత్యరాజ్ తన నటనతో ఆకట్టుకున్నారు. కమెడియన్ సత్య డైలాగ్స్, ఆయన హావభావాలు బాగానే నవ్వు తెప్పించాయి. అమృత అయ్యంగార్ తో పాటు ఇతర కీలక పాత్రల్లో నటించిన మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం : సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన పాటలు ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు భేష్.. అనిపిస్తాయి.
ఇంకా చదవండి: మెకానిక్ రాకీ మూవీ రివ్యూ : మాస్ షో!