'W/o అనిర్వేశ్’ మూవీ రివ్యూ :యువతరాన్ని ఆకట్టుకునే  థ్రిల్లర్ !

'W/o అనిర్వేశ్’ మూవీ రివ్యూ :యువతరాన్ని ఆకట్టుకునే థ్రిల్లర్ !

1 month ago | 5 Views

సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్య ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి కథలకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలను తీస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ప్లాట్ ను ఎంచుకుని… గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను రెండు గంటల పాటు ఎంగేజ్ చేయగలిగితే ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సులభంగా విజయం సాధిస్తాయి. ఇలాంటి క్రైం థ్రిల్లర్స్ ను దర్శకుడు గంగ సప్తశిఖర… వరుసగా తీయడం వెనుక ఉన్న విజయ రహస్యం ఇదే. గతంలో ‘ది డెవిల్స్ చైర్’తో ఆకట్టుకున్న అతడు ఇప్పుడు ‘W/o అనిర్వేశ్’ అంటూ మరో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ తో ఆడియన్స్ ను అలరించడానికి ఈ వారం వచ్చారు. ఇందులో జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా నటించారు. అతనితో పాటు జెమిని సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, నజియా ఖాన్, సాయికిరణ్ కోనేరి, కిశోర్ రెడ్డి చెలివేరి, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు నటించారు. గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం థ్రిల్ కు గురి చేసిందో చూద్దాం... 

కథ: అనిర్వేశ్(జబర్దస్త్ రామ్ ప్రసాద్) తనను తన భార్య విచెలిత(సాయి ప్రసన్న) వేధిస్తోందని సిఐ వరదరాజులు(జెమిని సురేష్)కి ఫిర్యాదు చేస్తాడు. ఇది ఇలా వుండగానే మళ్లీ విచెలిత తనను భర్త అనిర్వేశ్… నిత్యం అనుమానంతో వేధిస్తూ… చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని, తనకు చావే శరణ్యమని సీఐ వరదరాజులకు ఫోన్లో తన ఆవేధనను వెలిబుచ్చుతుంది. అదే అపార్ట్ మెంట్ లో వున్న రాబర్ట్(సాయికిరణ్ కోనేరి)… వీరిద్దరూ చెప్పేదంతా శుద్ధ అబద్ధమని… తనను ఈ భార్యభర్తలిద్దరూ కలిసి మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారంటూ సీఐకు మొరపెట్టుకుంటాడు. వీళ్ల ట్రయాంగిల్ ఫిర్యాదులు ఇలా కొనసాగుతున్న క్రమంలో ధనుర్భాక్షి(కిరిటీ) ఓ వేశ్యతో సన్నిహితంగా వుంటూ… తన ఒంటిరితనం పోవాలంటే… నువ్వు నాకు తోడుగా వుండాలంటూ ఆ యువతిని లోబరుచుకుని అతి కిరాతకంగా చంపేస్తాడు. ఈక్రమంలో అనిర్వేశ్, విచెలిత, రాబర్ట్ అసలు స్టోరీని ఛేదించడానికి సీఐ వరదరాజులు… తన సహచరుడైన మరో పోలీసు ఆఫీసర్(కిశోర్ రెడ్డి)ను నియమిస్తాడు. మరి ఈ పోలీసు అధికారి దర్యాప్తులో తేలిన అసలు విషయం ఏమిటి? వేశ్యను ధనుర్భాక్షి ఎందుకు అంత కిరాతకంగా చంపాడు? టోటల్ కేసులో ఎలాంటి నిజాలు తెలిశాయి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 విశ్లేషణ: మర్డర్ మిస్టరీ ప్లాట్ కి… కాస్త అడల్ట్ డ్రామా కంటెంట్ ను జోడించి యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. భార్య వేధిస్తోందంటూ భర్త… భర్త వేధిస్తున్నాడంటూ భార్య… వీరిద్దరూ తోడుదొంగలు… నన్ను పార్టీ పేరుతో ఇంటికి పిలిచి… నేను, నా ప్రేయసి ఏకాంతంగా ఉన్న సన్నివేశాలను వీడియో తీసి బెదిరిస్తున్నారంటూ… ఇలా ట్రయాంగిల్ లో జరిగే స్టోరీకి అడల్ట్ కంటెంట్ ను కాస్త జోడించి… సినిమాను ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవ్వకుండా చూసేలా చిత్రీకరించారు. ఇది యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో రామ్ ప్రసాద్, సాయి ప్రసన్నల మధ్య వచ్చే ఎపిసోడ్స్ రామ్ ప్రసాద్ లోని మరో కోణాన్ని చూపెడతాయి.

ఇక ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్స్ కొన్ని మరీ బోల్డ్ గా వున్నాయి. ఆ తరువాత ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు కథ రివీల్ అవుతుంది. వీరి ముగ్గురి మధ్య ఉన్న సంబంధం… అలాగే సి.ఐ.వరదరాజులు అసలు పాత్ర ఏమిటి అనేది క్లైమాక్స్ లో రివీల్ చేయడంతో… ఈ చిత్రం అసలు సిసలైన సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ అనిపించుకుంటుంది. దర్శకుడు ఎక్కడా పాత్రలపై అనుమానం రాకుండా… చివరిదాకా అసలు విషయంలో సస్పెన్స్ ను చివరి దాకా క్యారీ చేయడం నిజంగా దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. స్క్రీన్ ప్లే సామాన్య ప్రేక్షకులకు కొంత కన్ ఫ్యూజన్ కలిగించేలా వున్నా.. ఓవరాల్ గా ‘w/o అనిర్వేశ్’ ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్ ను ఇస్తాడనడంలో సందేహం లేదు.

ఇప్పటి వరకు కామెడీతోనే అలరించిన జబర్దస్త్ రామ్ ప్రసాద్… ఇలాంటి క్రైం బేస్డ్ సినిమాలో నటించి తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. అనుమానపు మొగుడిగా శాడిస్ట్ పాత్రలో బాగా ఒదిగిపోయి నటించారు. అలాగే ఇంటర్వెల్ తరువాత వచ్చే రెండు వేరియేషన్స్ వున్న పాత్రలూ వేటికవే వైవిధ్యంగా ఉన్నాయి. అతనికి జంటగా నటించిన సాయి ప్రసన్న కొన్ని బోల్డ్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక నజియా ఖాన్ హోమ్లీ గాళ్ గా చాలా క్యూట్ గా మెప్పించింది. కిరీటి క్యారెక్టర్ కూడా చివరి దాకా బాగా క్యారీ అయింది. అతని పాత్రే సినిమాకి ప్రధాన బలం. రాబర్ట్ పాత్రలో సాయి కిరణ్ కోనేరి ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు గంగ సప్తశిఖర… ఎంచుకున్న ప్లాట్ బాగుంది. దాని చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. ఎక్కడా అనవసరపు సీన్లతో ల్యాగ్ లేకుండా సినిమాను చాలా క్రిస్పీగా నడిపించారు. యూత్ కు కావాల్సిన కంటెంట్ తో సినిమాను తెరమీద చూపించారు. గతంలో అదిరే అభితో ది డెవిల్స్ ఛైర్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ ను తీశారు. దానికి ఏమాత్రం సంబంధంలేని ఓ క్రైం బేస్డ్ డ్రామాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించి మరోసారి విజయం సాధించారు. ఈ చిత్రానికి తగ్గట్టుగానే విజువల్స్ ఉన్నాయి. రొమాంటిక్ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంగేజింగ్ గా వుంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని నిర్మించారు. క్రైం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కి ఈ వారం బెస్ట్ ఛాయిస్ ఈ చిత్రం. గో అండ్ వాచ్ ఇట్.

రేటింగ్: 3.25

ఇంకా చదవండి:  ‘జిగేల్’ మూవీ రివ్యూ : ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్!

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# W/o అనిర్వేశ్     # నజియా ఖాన్    

trending

View More