'విడుదల 2' మూవీ రివ్యూ : వన్ మ్యాన్ షో!

'విడుదల 2' మూవీ రివ్యూ : వన్ మ్యాన్ షో!

8 hours ago | 5 Views

(చిత్రం:  'విడుదల 2',  విడుదల : డిసెంబర్ 20, 2024, రేటింగ్ : 2.5/5, నటీనటులు : విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ మీనన్, అనురాగ్ కశ్యప్ తదితరులు.  దర్శకత్వం: వెట్రిమారన్, నిర్మాతలు : ఎల్రెడ్ కుమార్, రామారావు చింతపల్లి, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, సినిమాటోగ్రఫీ : ఆర్ వేల్ రాజ్, ఎడిటింగ్ : ఆర్ రమర్)

 వెర్సటైల్ కథానాయకుడు  మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా సూరి, మంజు వారియర్ తదితరులు ముఖ్య పాత్రల్లో దర్శకుడు వెట్రి మారన్ తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రం “విడుదల 2” ఈ వారం మన తెలుగులో కూడా రిలీజ్ కి వచ్చింది. మరి ఈ సినిమా ఎంతమేరకు ప్రేక్షకులను  అలరించిందో  చూద్దాం... 

కథ:  మొదటి పార్ట్ లో పోలీసులు పట్టుకున్న కురుపన్ గా పిలవబడే పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ని విచారణ నుంచే మొదలవుతుంది. ఈ క్రమంలో తనని పట్టించడంలో కీలక పాత్ర పోషించిన కుమరేసన్ (సూరి) కి ఎలాంటి ప్రమోషన్ ని అందుకున్నాడా లేదా? ఈ క్రమంలో పోలీసులు పట్టుకున్న పెరుమాళ్ ని ఏం చెయ్యాలని ప్లాన్ చేస్తారు? అందుకు పరిస్థితులు ఎలా మారాయి. అసలు ఈ పెరుమాళ్ ఎవరు? అతడెందుకు బలహీన, అణగారిన వర్గాలు కోసం అంతలా పోరాడుతాడు? తన జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి? ఈ క్రమంలో కుమరేసన్ రియలైజ్ అయ్యింది ఏంటి అనేది ఈ సినిమా అసలు కథ.

 విశ్లేషణ: ఈ సినిమా వరకు దర్శకుడు వెట్రిమారన్ తీసుకున్న నేపథ్యం బాగుంటుంది కానీ ఇందులో కథనం మాత్రం నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో చాలా వరకు సన్నివేశాల్ని అనవసరంగా సాగదీతగా చేసినట్టు అనిపిస్తుంది. అలాగే సినిమాలో కేవలం సూరి కోసం చూసేవారు కూడా డిజప్పాయింట్ అవ్వొచ్చు. సినిమా  మొత్తంగా చూసినట్టు అయితే.. ఈ “విడుదల పార్ట్ 2” విజయ్ సేతుపతి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. కానీ ఒక్క హీరో వల్లే సినిమా ఫలితం డిసైడ్ కావడం కష్టం. ఫస్టాఫ్ వరకు ఓకే, సేతుపతి పాత్ర కూడా ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తుంది కానీ సినిమా సెకండాఫ్ మాత్రం వీక్ గా ఉందని చెప్పాలి. దర్శకుడు సెకండాఫ్ లో ప్రొసీడింగ్స్ బాగా ల్యాగ్ చేసారు. వీటితో సినిమా మొదటి పార్ట్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. ఇక దర్శకుడు వెట్రిమారన్ విషయానికి వస్తే.. తను ఈ సినిమాలో డీసెంట్ వర్క్ అందించారు అని చెప్పాలి. మరీ ఫస్ట్ పార్ట్ రేంజ్ లో లేదు కానీ ఇంకా బెటర్ గా పలు సీన్స్ ని డిజైన్ చేయాల్సింది. విజయ్ సేతుపతి పాత్రని తను తెరకెక్కించిన విధానం, పలు సన్నివేశాలు వాటి పరిస్థితులు వివరించిన విధానం బాగుంటాయి కానీ వాటిని ఒక సమయంలో బాగా సాగదీశారు. దీనితో సినిమా బోరింగ్ గా వెళుతున్నట్టు అనిపిస్తుంది. వీటితో ఈ సినిమాకి తన వర్క్ మాత్రం తన ఫ్యాన్స్ ని కూడా పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేయలేకపోవచ్చు.  పార్ట్ 1 కి కొనసాగింపుగా తీసుకొచ్చిన ఈ సీక్వెల్ లో దానికి అనుగుణంగా ముఖ్యంగా విజయ్ సేతుపతి పాత్రని అంచలంచలుగా తెరకెక్కించిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. అలాగే మొదటి పార్ట్ లో కొన్ని హార్డ్ హిట్టింగ్ సంఘటనలకు కారణం, వాటి వెనుక ఉన్న నిజాలు ఏంటి అనేవి రివీల్ చేయడం అటు విజయ్ సేతుపతి పాత్ర నుంచి ఇటు పోలీసులు వైపు నుంచి ఆలోచించే విధానం, ఒక నిజాన్ని తెలుసుకోవడం పరిస్థితులు ప్రభావంని వివరించే పలు సన్నివేశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. ఈ సినిమా పూర్తిగా సేతుపతి డామినేషన్ కనిపిస్తుంది కానీ సూరి పాత్రకి మరీ అంత ఇంపార్టెన్స్ ఉండదు. అలాగే మంజు వారియర్ రోల్ కూడా ఒక సమయం తర్వాత పక్కకి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా సినిమాలో విప్లవం, ఉద్యమాలు లాంటి వాటి అంశాలపై చాలా డైలాగులు, సన్నివేశాలు అందరికీ ముఖ్యంగా ప్రస్తుత జెనరేషన్ వారికి అర్ధం కాకపోవచ్చు. అలాగే హిందీ నటుడు దర్శకుడు అనురాగ్ కశ్యప్ రోల్ కూడా సినిమాలో వేస్ట్ అయ్యింది. ఇంకా విజయ్ సేతుపతి తన పాత్రలో అదరగొట్టేసారు. యుక్త వయస్సు నుంచి ఒక ఉద్యమ నాయకుడుగా ఎలా ఎదిగాడు అనే పాత్రలో తను జీవించారు అని చెప్పాలి. అలాగే మంజు వారియర్ కూడా ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఇంకా నటుడు సూరి, గౌతమ్ మీనన్ లు తమకి ఉన్న స్క్రీన్ స్పేస్ లో బాగానే చేశారు. ఇక వీరితో పాటుగా ఉన్న ఇతర నటీనటులు చేతన్, తమ సహజ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకుంటారు. ఇంకా ఈ సినిమాలో ఫస్టాఫ్ అందులో కొన్ని ఎగ్జైట్ చేసే మూమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఇక వీటితో పాటుగా సినిమాలో విజయ్ సేతుపతి పాత్రపై ఇచ్చే హార్డ్ హిట్టింగ్ ఎండింగ్ కూడా బాగుంటుంది.

 సాంకేతిక వర్గం: ఈ సినిమాలో ఇళయరాజా సంగీతం పలు సన్నివేశాల్లో మంచి ఎఫెక్టివ్ గా ఉంది. అలాగే ఆర్ వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ నుంచి విజువల్స్ బాగున్నాయి. ఆర్ రమర్ ఎడిటింగ్ ఓకే.   వి ఎఫ్ ఎక్స్ వర్క్ .సోసోగానే ఉంది.  నిర్మాణ విలువలు పర్వాలేదు.

ఇంకా చదవండి: 'బచ్చల మల్లి' మూవీ రివ్యూ : సో..సో.. మల్లి!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# విడుదల2     # విజయసేతుపతి     # చింతపల్లిరామారావు