'వేట్టయన్' మూవీ రివ్యూ : రజనీ ఫ్యాన్స్‌కు ట్రీట్...
2 months ago | 5 Views
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించిన తాజా సినిమా 'వేట్టయన్: ద హంటర్' ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. 'జైలర్' సినిమాతో గత ఏడాది బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించే రేంజ్ లో ఊచకోత కోసిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రమిది. జైలర్, లాల్ సలామ్ తర్వాత సూపర్‌స్టార్ రజనీ కాంత్ నటించిన కొత్త చిత్రం ‘వేట్టయన్’. జై భీమ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన జ్ఞాన్ వేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, దుసరా విజయన్ లాంటి స్టార్ యాక్టర్స్ ఈ మూవీలో భాగమయ్యారు. టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ‘మనసిలాయో’ పాట, అందులో మంజూ వారియర్, రజనీల స్టెప్పులు ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ పాన్ ఇండియా సినిమా నేడు (అక్టోబర్-10, 2024) తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలయింది. తమిళనాడు అనే కాకుండా తెలుగు, కన్నడం, మళయాళంతోపాటు హిందీలో కూడా సూపర్ స్టార్ క్రేజ్ రజనీకాంత్ సొంతం. తనగురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. 73 సంవత్సరాల వయసులో కూడా సినిమాల్లో డూప్ లేకుండా నటిస్తున్నారు. జైలర్ తో సినీ పరిశ్రమలో తన సత్తా ఏమిటో చాటిన రజనీ వేట్టయన్ సినిమాతో ముందుకు వచ్చారు. దీనికి జైభీమ్ దర్శకుడు జ్ఞానవేల్ కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. అలాగే అనిరుధ్ రవిచందర్ కూడా తన మ్యాజిక్ తో మ్యూజిక్ ఇచ్చి సినిమాను మరో మెట్టు ఎక్కించాడా? లేదా? అనేది తెలుసుకుందాం.
విశ్లేషణ: సీరియస్ క్రైమ్స్ చేసి తప్పించుకునే చెడ్డవాళ్లకి న్యాయబద్ధమైన శిక్ష పదాలని చూసే అమితాబ్ బచ్చన్ ఒకవైపు, మరో వైపు అన్యాయం జరిగితే అది హద్దులు దాటిపోయింది అనిపిస్తే ఎన్ కౌంటర్ చేయడానికి సిద్ధం అయ్యే పోలీస్ అయిన హీరో ఒకవైపు నిలుస్తారు. ఇలాంటి వీళ్ళకి సీరియస్ కేసు ఒకటి సవాలుగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా . ఫస్టాఫ్ స్టార్ట్ అవ్వడం కొంచం స్లో గా స్టార్ట్ అయినా రజినీ ఎంట్రీ నుండి సినిమా ఫ్లో అలా అలా పెరుగుతూ అసలు కథ పాయింట్ కి వచ్చిన తర్వాత సీరియస్ టర్న్ తీసుకుని కథ ఆసక్తిగానే సాగుతూ ఫస్టాఫ్ పర్వాలేదు బాగుంది అనిపించగా ఎక్స్ లెంట్ ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత సెకెండ్ ఆఫ్ కథ ఆసక్తిగా స్టార్ట్ అయ్యి కొన్ని సీన్స్ రిపీటివ్ గా అనిపిస్తూ కొద్దిగా డ్రాగ్ అయినా కూడా…మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి ఆకట్టుకుంటూ సాగి ఓవరాల్ గా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ లు ఆకట్టుకునేలా ముగిసి సినిమా ఎండ్ అయ్యే టైంకి పర్వాలేదు ఓ సారి చూడొచ్చు అనిపించేలా మెప్పిస్తుంది. రజినీ హీరోయిజం, ఎలివేషన్ లు.. అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరోసారి హైలెట్ అవ్వడంతో ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ తో పాటు సీరియస్ సబ్జెక్ట్ కూడా ఉన్నప్పటికీ రెగ్యులర్ ఆడియన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దానిపై సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది చెప్పగలం. ఓవరాల్ గా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ గా…సెకెండ్ ఆఫ్ యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించగా సినిమా కూడా ఎబో యావరేజ్ లెవల్ కి అటూ ఇటూగా అనిపించింది….జైలర్ తో కంపేర్ చేసి చూస్తె కొంచం హై తగ్గినా కంటెంట్ బాగానే ఉండటంతో ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించడం ఖాయమని చెప్పాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఆయన హీరోయిజం అండ్ మేనరిజమ్స్ హైలైట్ అవుతాయి. కానీ, ఈ సినిమాలో ఆయన నటన గురించి ప్రేక్షకులు ఎక్కువ మాట్లాడతారని సినిమా చూసిన మనకు అర్థం అవుతుంది. ఇది యాక్టింగ్ బేస్డ్ సినిమా . సినిమా థీమ్ కూడా సూపర్. రజనీ ఫ్యాన్స్ కు బాగా నచ్చేస్తుంది. వేట్టయన్ సినిమాలో రజనీకాంత్ మాస్ అప్పీల్ అదిరిపోయింది. అలాగే అమితాబ్, రానా, ఫాహద్ ఫాజిల్ పాత్రలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక మంజూ వారియర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా తన పాటలతో సినిమాలకు హైప్ పెంచుతోన్న అనిరుధ్ ‘వేట్టయన్’ సినిమాకు బాణీలు అందించాడు. ఈ క్రమంలోనే తన బీజీఎమ్ తో అనిరుధ్ అదరగొట్టేశాడు. ఇటీవల రిలీజైన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫస్ట్ హాఫ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథని సామాజిక సందేశంతో దర్శకుడు జ్ఞానవేల్ అద్భుతంగా వేట్టయ్యన్ ను తెరకెక్కించారు. రజినీ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషారా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించి ఆయా పాత్రలు పరిధి మేరకు మెప్పించారు. ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా దర్శకుడు టీజే జ్ఞానవేళ్ వేట్టయన్ మూవీని తెరకెక్కించారు. ఎన్‌కౌంటర్లు చట్టానికి లోబడే జరుగుతుంటాయా? ఎన్‌కౌంటర్లను న్యాయవ్యవస్థ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా? అనే అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు వేట్టయన్ మూవీలో చూపించారు. న్యాయం జరగడంలో సొసైటీలో నెలకొన్న వివక్షను ఈ సినిమాలో చర్చించారు. సినిమా ఆరంభమైన ఇరవై నిమిషాలు రజనీ ఫ్యాన్స్‌కు ఓ ట్రీట్‌లా ఉంటుంది. రజనీ మాస్ మూమెంట్స్, హీరోయిజం, ఎలివేషన్స్‌తో ఆరంభ సన్నివేశాలను ఆకట్టుకుంటాయి. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో రజనీకాంత్ అదరగొట్టాడు. రజనీ డైలాగ్ డెలివరీ, మ్యానరిమజ్స్ మెప్పిస్తాయి.
రజనీకాంత్‌కు ధీటుగా అమితాబ్‌బచ్చన్ పాత్ర ఉంది. రజనీకాంత్, అమితాబ్‌బచ్చన్ కలిసి స్క్రీన్‌పై కనిపించే సీన్స్ అదుర్స్. పోలీస్ ఇన్ఫార్మర్ గా ఫహాద్ ఫాజిల్‌క్యారెక్టర్ ఫన్నీగా ఉంది. నవ్విస్తూనే తన యాక్టింగ్‌తో ఫహాద్ ఫాజిల్ ఆకట్టుకుంటాడు. రానా దగ్గుబాటి, దుషారా విజయన్ క్యారెక్టర్స్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. రజనీకాంత్ ఇమేజ్ ముందు కథ చిన్నదైపోవడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్‌గా మారిందని చెప్పొచ్చు. కొన్ని యాక్షన్, ఇన్వేస్టిగేషన్ సీన్స్ బాగున్నా ప్రెడిక్టబుల్ స్టోరీలైన్, స్లోఫేజ్ స్క్రీన్‌ప్లేతో కొంచం బోర్ కొట్టిస్తుంది. మనసిల్లాయో సాంగ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గెస్ట్ అప్పిరియెన్స్ ఆకట్టుకుంటుంది. అనిరుధ్ బీజీఎమ్, సాంగ్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయని చెప్పొచ్చు. సాంగ్ ప్లేస్‌మెంట్ మాత్రం సరిగా లేవనిపించింది. సాంకేతికతను ఉపయోగించుకొని హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడమే సినిమా కథ. అతన్ని రజనీకాంత్ ఎలా పట్టుకున్నాడనేదే సినిమా. దర్శకుడు జ్ఞానవేల్ మంచి స్క్రిప్ట్ రాసుకోవడంతోపాటు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. రజనీకాంత్ లాంటి స్టార్ తో దర్శకుడు చేసిన ప్రయత్నం విజయవంతమైందని చెప్పొచ్చు. ఈ సినిమాను థ్రిల్లర్ గా మలచడంలో దర్శకుడు ఎక్కడా తడబడలేదు. భావోద్వేగాలను కూడా సరైన రీతిలోనే చూపించారు.
ప్రేక్షకుల చేత రజనీ విజిల్స్ వేయిస్తారు. , అమితాబ్ పాత్ర చిన్నదే అయినా సినిమాకు కీలకమే. రానా, మంజు వారియర్, ఫాహద్ ఫజిల్, రితిక సింగ్ లాంటివారు మంచి నటనను కనబరిచారు. వారంతా రజనీకాంత్ తో పోటీపడి నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యాజిక్ చేశారు, తనవంతు బాగా కృషిచేశాడు. సంగీతం కోసం అతను వాడిన పరికరాలు శభాష్ అనిపించేలా ఉన్నాయి. విజువల్స్ బాగున్నాయి. సినిమా రజనీకాంత్ ఇంట్రో బాగా కుదిరింది. కానీ ఫస్టాఫ్ చాలా స్లోగా నడిపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. సినిమాకు అనిరుధ్ సంగీతం వెన్నెముక అని మరోసారి తనేంటో రుజువు చేసుకున్నాడు,సెకండాఫ్ సినిమాకు ప్లస్ అయింది. సినిమాలో భారీ తారాగణం ఉన్నప్పటికీ ఆయా పాత్రలకు బాగా యాప్ట్ అయ్యారు. ముఖ్యంగా నేటి టెక్నాలజీని ఉపయోగించుకుని హత్యలు చేస్తున్న ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే నేపథ్యంలో సాగే కథతో రజనీకాంత్‌తో జ్ఞాన్‌వే ల్ రాజా మంచి ప్రయోగం చేశారు. అయితే సినిమాలో అక్కడక్కడ అరవ వాసనలు కనిపించడం, పేర్లు తెలుగు వారికి కాస్త ఇబ్బంది పెడతాయి. కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా కూడా ఉన్నాయి. అక్కడక్కడ స్క్రీన్ ప్లే సమస్యలు ఉన్నాయి., లాగ్ చేసినట్టుగా అనిపిస్తాయి. అమితాబ్ బచ్చన్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ మోప్పిస్తారు. ఫాహద్ ఫజిల్, రానా, మంజువారియర్, రితికా సింగ్ పాత్రలు రజనీకాంత్‌తో పోటీ పడ్డాయి. సినిమా థ్రిల్లర్‌గా నడిచినా భావోద్వేగాలు కూడా ఆకట్టుకుంటాయి.
రేటింగ్: 3.5
ఇంకా చదవండి: మూవీ రివ్యూ : ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ ‘కలి’
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !