'స్వాగ్' మూవీ రివ్యూ :  ఆసక్తి కలిగించని రొటీన్ ఫన్  డ్రామా !

'స్వాగ్' మూవీ రివ్యూ : ఆసక్తి కలిగించని రొటీన్ ఫన్ డ్రామా !

2 months ago | 5 Views

(చిత్రం:  'స్వాగ్',  విడుదల: అక్టోబర్ 04, 2024, రేటింగ్ : 2.25/5, నటీనటులు : శ్రీ విష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్,  శరణ్య ప్రదీప్, సునీల్, రవి బాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు,దర్శకత్వం : హసిత్ గోలి, నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్,  సంగీత దర్శకుడు : వివేక్ సాగర్,  సినిమాటోగ్రఫీ : వేదరామన్ శంకరన్, ఎడిటర్ : విప్లవ్ నైషదం) 

నవతరం  హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం  ‘స్వాగ్’.  ఈ చిత్రానికి  హసిత్ గోలి దర్శకుడు. వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించినట్టు దర్శకుడు చెప్పుకున్నారు. ఈ చిత్రం నేడు ( అక్టోబర్ 04, 2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది.  మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం...  

కథలోకి ... రాజ కుటుంబానికి చెందిన వారసత్వానికి సంబంధించి ఈ కథ సాగుతుంది. శ్వాగణిక వంశానికి చెందిన రాజ కుటుంబానికి చెందిన కథ ఇది. అనుబంధం లేని ఓ మొరటి మనిషి భవభూతి (శ్రీ విష్ణు) ఓ పోలీస్ ఆఫీసర్. తనను వదిలి వెళ్లిపోయిన భార్యనే తలుచుకుంటూ రాక్షసంగా జీవనం సాగిస్తుంటాడు.  మరోవైపు అనుభూతి (రీతూ వర్మ) ఆడవారి అస్తిత్వం కోసం పట్టుదలగా ఉంటుంది. ఆడవారి పెత్తనమే ఉండాలనేది ఆమె అభిమతం. ఈ మధ్యలో సింగ (యంగ్ శ్రీ విష్ణు) కథ ఏమిటి?, రీల్స్ చేస్తూ వ్యూస్ కోసం అతను పడిన పాట్లు ఏమిటి?, తండ్రి ఎవరో తెలియని అతని జీవితంలోకి ఈ శ్వాగణిక వంశం ఎలా వచ్చింది?, సింగ తల్లి రేవతి (మీరా జాస్మిన్) పాత్ర ఏమిటి ?, ఇంతకీ ఈ మొత్తం కథలో శ్వాగణిక వంశానికి చెందిన వారసుడు ఎవరు?, ఆ వారసత్వం కోసం ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు ?, చివరకు వారసుడు దొరికాడా ? లేదా ? అనేది మిగిలిన చిత్ర కథ.

విశ్లేషణలోకి...  చిత్ర కథనం విషయంలో దర్శకుడు హసిత్ గోలి ఆసక్తి కలిగించ లేకపోయారు.  పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఈ స్వాగ్ చిత్రాన్ని మలచలేకపోయారు. ఈ 'స్వాగ్' కథా నేపథ్యం, అలాగే నటీనటుల పనితీరు బాగున్నప్పటికీ దర్శకుడు కథనాన్ని అనుకున్న విధంగా ప్రేక్షకులు మెచ్చే రీతిలో నడిపించలేక పోయాడు. శ్వాగణిక వంశానికి చెందిన వారసత్వం చుట్టూ సాగే డ్రామాలో  వచ్చిన సన్నివేశాలే  మళ్లీ వచ్చి  విసుగుతెప్పించాయి. రొటీన్ ఎక్కువైపోయాయి. దీనికితోడు సెకండ్ హాఫ్ లో పాత్రల మధ్య కాన్ ఫ్లిక్ట్స్, ఎమోషన్స్ కూడా ఈ మాత్రం వర్కౌట్ కాలేదు. ఇల్లాజికల్ పాయింట్ చుట్టూ ఫేక్ ఎమోషన్స్ తో స్క్రీన్ ప్లే సాగడంతో చిత్రం చాలా  చోట్ల  నిరాశ పరిచింది. పైగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే శ్వాగణిక వంశానికి చెందిన రాజు ట్రాక్ అలాగే, పోలీస్ ఆఫీసర్ భవభూతి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మెయిన్ సీన్స్ కూడా మెలో డ్రామాలా అనిపిస్తాయి. దీనికి తోడు, పాత్రలు ఎక్కువ అవ్వడం, అలాగే అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అనవసరమైన డిస్కషన్ కూడా ఆకట్టుకోలేదు. ప్రధానంగా కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది.  కథలో చెప్పాలనుకున్న మెసేజ్ కూడా రొటీన్ గానే సాగింది.  శ్వాగణిక వంశానికి చెందిన ‘రాజు’ ఫ్యామిలీ కథ దగ్గర నుంచి, పోలీస్ ఆఫీసర్ భవభూతి సోలో ట్రాక్ తో పాటు సింగ లవ్ స్టోరీ వరకూ చాలా పాత్రల మధ్య నడిచిన ఈ డ్రామాలో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి.   ముఖ్యంగా శ్రీవిష్ణు చేసిన ఐదు పాత్రలు..  వాటి చిత్రీకరణ..  ఆయా పాత్రల గెటప్స్ అండ్ సెటప్ పర్వాలేదు. . సినిమాలో శ్వాగణిక వంశానికి చెందిన థీమ్ కూడా ఓకే అనిపిస్తుంది.  అన్నిటికీ కంటే ముఖ్యంగా శ్రీవిష్ణు సినీ కెరీర్ లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంది. శ్రీవిష్ణు ఈ సినిమాలో తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు చక్కగా నటించి మెప్పించాడు. హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ చక్కగా నటించింది. మరో కీలక పాత్రలో నటించిన గోపరాజు రమణ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మీరా జాస్మిన్ పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. అయితే, ఉన్నంతలో ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందనే చెప్పాలి.  రవి బాబు నటన కూడా ఓకే అనిపించింది.  దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, గెటప్ శ్రీను మిగిలిన నటీనటులు  తమ పాత్రల పరిధి మేరకు నటించి ఉన్నంతలో ప్రేక్షకులను మెప్పించారు. ‘స్వాగ్’ అంటూ వచ్చిన ఈ శ్వాగణిక వంశానికి చెందిన వారసత్వం కథలో.. స్టైలిష్ మేకింగ్, కొన్ని ఫన్ మూమెంట్స్ అండ్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అలాగే శ్రీవిష్ణు.. ఇతర నటీనటుల నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. కానీ, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ డ్రామా మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్, బోరింగ్ సీన్స్, రెగ్యులర్ అండ్ రిపీటెడ్ సన్నివేశాలు, ముఖ్యంగా ఆసక్తికరంగా సాగని పాత్రలు వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. 

 టెక్నీకల్ విషయాలకొస్తే... ఈ చిత్రానికి   సినిమాటోగ్రఫీ  అందించిన  వేదరామన్ శంకరన్ వర్క్ చాలా బాగుంది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన సంగీతం మెచ్చుకోవలసిందే.   ఐతే సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో ఆకట్టుకునేలా లేదు.ఇక ఎడిటర్ విప్లవ్ నైషదం ఎడిటింగ్  పర్వాలేదు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ విలువలు  సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి.  ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు హసిత్ గోలి టేకింగ్ బాగున్నా..  మంచి కంటెంట్ రాసుకోవడంలో విఫలం అయ్యారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేదు. మొత్తంగా   ఈ ‘స్వాగ్’లో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.

ఇంకా చదవండి: ఎమోషనల్ ఎంటర్ టైనర్ "చిట్టి పొట్టి"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Swag     # Sreevishnu     # Tollywood    

trending

View More