వినూత్న కథాంశంతో 'సింబా'

వినూత్న కథాంశంతో 'సింబా'

2 months ago | 43 Views

ఓ వైపు దర్శకునిగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు కథా రచయితగా వినూత్నమైన కాన్సెప్ట్స్‌తో పలు సినిమాలకు షోరన్నర్‌ గా వుంటున్నారు దర్శకుడు సంపత్‌ నంది. గాలిపటం, పేపర్‌ బాయ్‌, ఓదెల రైల్వేస్టేషన్‌ ఆయన కథలతో వచ్చిన సినిమాలే. ఇప్పుడు ఆయన కథతో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ’సింబా’. రంగస్థలంలో పవర్‌ ఫుల్‌ రోల్స్‌ లో ఆదరగొట్టిన జగపతి బాబు., అనసూయ లాంటి స్టార్స్‌ ఇందులో ప్రధాన పాత్రలు పోషించడంతో సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రకృతి నేపధ్యంలో ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌, సైంటిఫిక్‌ ఎలిమెంట్స్‌ జోడిరచి మురళీ మనోహర్‌ రెడ్డి తీసిన ’సింబా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌ లో ఓ దారణ హత్య జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి పార్థ(కబీర్‌ సింగ్‌) గ్రూపుకి సంబధించిన కీలక వ్యక్తి. దీంతో ఈ కేసును సీరియస్‌ గా తీసుకుంటారు పోలీసులు. విచారణ జరుగుతుండగానే మరో హత్య జరుగుతుంది. ఈ రెండు హత్యల వెనుక స్కూల్‌ టీచర్‌ అక్షిక(అనసూయ), ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ ఫాజిల్‌(శీనాథ్‌ మాగంటి) ఉన్నారని నిర్దారించిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్‌ చేస్తారు.

ఇంతలో వీరిద్దరిని చంపాలని చూసి వ్యక్తి పోలీసుల సమక్షంలోనే హత్యకు గురౌతాడు. తర్వాత ఏం జరిగింది ? అసలు ఈ వరుస హత్యలకు కారణం ఏమిటి ? ఎవరు చంపుతున్నారు ? పార్థకి, హత్యలు చేస్తున్న వ్యక్తికి లింక్‌ ఏమిటి ? ఇందులో పురుషోత్తమ్‌ రెడ్డి(జగపతిబాబు) పాత్ర ఏమిటి ? ఇదంతా మిగతా కథ. ’సింబా’లో బయోలాజికల్‌ మెమరీ కాన్సెప్ట్‌ ఆధారంగా ఒక రివెంజ్‌ డ్రామాగా ఈ కథని తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకునేలానే వుంటుంది. ముఖ్యంగా ఒక కైమ్ర్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో పర్యావరణం, పకృతి పరిరక్షణ గురించి చెప్పిన తీరుని అభినందనీయం. నిజానికి సమాజానికి చాలా అవసరమైన అంశం ఇది. మర్డర్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ తరహలో సినిమా మొదలౌతుంది. ఫస్ట్‌ హాఫ్‌ లో వచ్చే వరుస హత్యలు కథపై ఆసక్తిని పెంచుతాయి. సెకండ్‌ హాఫ్‌ లో అసలు పాయింట్‌ రివిల్‌ అవుతుంది. ఫారెస్ట్‌ మ్యాన్‌ గా జగపతి బాబు క్యారెక్టర్‌ చుట్టూ వున్న నేపధ్యం ఆసక్తికరంగా తీశారు.చాలా సన్నివేశాలు ప్రేక్షకులు ఊహకు అందిపొతుంతాయి. ఫస్ట్‌ హాఫ్‌ లో పోల్చుకుంటే సెకండ్‌ హాఫ్‌ లో వచ్చే కథనం ఆసక్తికరంగా వుంటుంది. జగపతిబాబు తన అనుభవంతో ఈ పాత్రని చాలా యీజ్‌ తో చేశారు. ఆయన ఇమేజ్‌, ఆహార్యం పాత్రకు తగ్గట్టుగా వుంది. అనసూయ, శ్రీనాథ్‌ మాగంటి పెర్ఫార్మెన్స్‌ డీసెంట్‌ గా వుంది. ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా వశిష్ఠ సింహాకి మంచి మార్కులు పడతాయి. కబీర్‌ పాత్రని ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సింది. గౌతమి, కస్తూరి స్పెషల్‌ రోల్స్‌ లో కనిపిస్తారు. ఇక మురళీ మనోహర్‌ దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌ అయ్యాడని చెప్పాలి.

ఇంకా చదవండి: మూవీ రివ్యూ : గ్రావిూణ నేపథ్యంలో సాగిన 'కమిటీ కుర్రోళ్లు'

# Simbaa     # JagapathiBabu     # AnasuyaBharadwaj    

trending

View More