'శివం భజే' మూవీ రివ్యూ : మిస్టీరియస్ థ్రిల్లర్!
4 months ago | 47 Views
మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వం వహించిన సినిమా ‘శివం భజే’. ఈ సినిమా ఈ గురువారం (ఆగస్టు 01, 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం!
కథ : లోన్ రికవరీ ఏజెంట్. చందు (అశ్విన్ బాబు). ఎంతో తెలివైనవాడు. లోన్ కట్టకుండా తప్పించుకుని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూళ్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ కెమికల్ ల్యాబ్‌లో జాబ్ చేసే శైలజ (దిగంగనా సూర్యవంశీ)ని చూసి యాధృచ్ఛికంగానే లవ్ లో పడతాడు. అయితే, ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా అతడికి కళ్లకు ఆపరేషన్ జరుగుతుంది. అలా కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి..? అతడికి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి..? శివుడి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి..? ఈ మధ్యలో డోగ్రా (కుక్క) పాత్ర ఏమిటి..? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ : : దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌కి చక్కటి ట్రీట్ మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్‌గా రాసుకొని ఉండాల్సింది. డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓకే అనిపిస్తాయి. అయితే, కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్‌లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి కొంచెం వెలితిగా సాగాయి. డివోషనల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సాగిన ఈ మిస్టీరియస్ థ్రిల్లర్‌లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందని విధంగా ఉంది. ‘శివం భజే’ ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు ఆకట్టుకోవు. పైగా హీరో అశ్విన్ బాబు క్యారెక్టర్ కూడా బలహీనంగా సాగుతుంది. ఆ పాత్రకి కొత్త కళ్ళు వచ్చాక, ఆ పాత్రలోని పెయిన్ ఆశించిన స్థాయిలో ఎలివేట్ కాలేదు. దీనికితోడు సినిమాలో నాటకీయత ఎక్కువవడంతో సహజత్వం లోపించింది. ఇక మొదటి భాగంలో అశ్విన్ బాబు – హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ మధ్య సాగిన ప్రేమ సన్నివేశాలు కూడా ఆకట్టుకోలేకపోతాయి. దర్శకుడు రాసుకున్న క్రైమ్ డ్రామా కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ముఖ్యంగా సినిమాలో కొన్ని సస్పెన్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి. చందు పాత్రలో అశ్విన్ బాబు చక్కగా నటించాడు. హీరోయిన్ పాత్రలో దిగంగనా సూర్యవంశీ ఓకే అనిపించేలా నటించింది. సీరియస్ పోలీస్ అధికారిగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ఆకట్టుకున్నారు. హైపర్ ఆది పంచ్‌లు అండ్ మేనరిజమ్స్ బాగున్నాయి. బ్రహ్మాజీ తన పాత్రలో మెప్పించాడు. ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించిన సాయి ధీన, మురళీ శర్మ, తులసి తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే శత్రుదేశాల దాడి నేపథ్యంలో అల్లిన డ్రామా కూడా బాగానే ఉంది. దర్శకుడు అప్సర్ తీసుకున్న మెయిన్ పాయింట్, అండ్ ఆ పాయింట్‌ను ఎలివేట్ చేస్తూ రాసుకున్న కొన్ని సీన్స్ పర్వాలేదు. ఈ ‘శివం భజే’ సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా, కొన్ని చోట్ల ప్లే చాలా సింపుల్‌గా సాగుతుంది. అలాగే డివోషనల్ పాయింట్ అండ్ కంటెంట్ ఉన్నా.. మెయిన్ ప్లాట్ కూడా సింపుల్‌గానే సాగింది. అటు హత్యలకు సంబంధించిన ట్రాక్ కూడా బాగాలేదు. ఈ ట్రాక్‌కి మోటివ్ ఇంకా బలంగా ఉండాల్సింది. మొత్తానికి మేకర్స్ తాము అనుకున్న కంటెంట్‌ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా, కొన్ని సీన్స్ ఆకట్టుకోలేకపోయాయి.
సాంకేతిక విభాగం దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిస సంగీతం ఫర్వాలేదు. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి.
(చిత్రం : శివం భజే, విడుదల తేదీ : ఆగస్టు 01, 2024, రేటింగ్ : 2/5, నటీనటులు: అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, సాయి ధీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు, దర్శకత్వం : అప్సర్, నిర్మాతలు : మహేశ్వర్ రెడ్డి మూలి, సంగీత దర్శకుడు: వికాస్ బడిస, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటర్ : ఛోటా కె. ప్రసాద్)
-ఎం.డి. అబ్దుల్
ఇంకా చదవండి: 'పురుషోత్తముడు' మూవీరివ్యూ : పాత కథకకు కొత్తగా రంగులు!