
'సారంగపాణి జాతకం' మూవీ రివ్యూ : వినోదాన్ని పంచే ఫ్యామిలీ డ్రామా!
18 days ago | 5 Views
చిత్రం :సారంగపాణి జాతకం'
విడుదల : 25, ఏప్రిల్ - 2025
రేటింగ్ : 3/5
నటీనటులు : ప్రియదర్శి, రూపా కొడువయూర్, వీకే నరేష్, తణికెళ్ల భరణి, వైవా హర్ష , అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ : పీజీ విందా
ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్
స్క్రీన్ ప్లే దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాత : శివలెంక కృష్ణ ప్రసాద్
ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం 'సారంగపాణి జాతకం'. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు (25, ఏప్రిల్ - 2025) విడుదలయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో వెళ్లి తెలుసుకుందాం...
కథ: తన చేతిలో ఉన్నవి గీతలు కాదు మన తలరాతలు అంటూ సారంగపాణి (ప్రియదర్శి) జాతకాల్ని ఎక్కువగా నమ్ముతాడు. సారంగపాణి ఓ కారు కంపెనీలో సేల్స్ మెన్‌గా పని చేస్తుంటాడు. అదే కంపెనీలో మైథిలీ (రూపా కొడవయూర్) మేనేజర్‌గా పని చేస్తుంటుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లికి సిద్దపడటంతో ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఆ టైంలోనే సారంగపాణి జాతకం చూసిన జిగ్గేశ్వర్ (శ్రీనివాస్ అవసరాల) ఓ షాకింగ్ విషయం చెబుతాడు. ఇంతకీ ఏమిటి ఆ విషయం ?.. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు ఏమిటి ? అతని జాతకంలో ఒక హత్య చేస్తాడు అని ఉండటంతో సారంగపాణి ఏం చేస్తాడు ?, ఈ క్రమంలో సారంగకు ఎదురైన పరిస్థితులు ఏంటి?, అతని జాతకంలో చెప్పినట్టుగానే అంతా జరిగిందా ? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: ‘సారంగపాణి జాతకం’ అంటూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, కామెడీ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, రెగ్యులర్ ప్లే, సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. సెకండ్ హాఫ్ బాగానే స్టార్ట్ అయినా… ప్లేలో ఇంట్రెస్ట్ మిస్ అయింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. మొత్తానికి ఇంద్రగంటి డైరెక్షన్ స్కిల్స్, హీరో క్యారెక్టరైజేషన్, బీజీఎం బాగున్నప్పటికీ.. సినిమా మాత్రం యావరేజ్ గానే అనిపిస్తుంది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మరింత మేలు జరిగేది. జాతకం ఆధారంగా జరుగుతున్న సంఘటనలు నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు చాలా బాగున్నాయి. దర్శకుడు ఇంద్రగంటి యూత్ ఫుల్ కథలో వినోదాన్ని పండించే ప్రయత్నం చేశాడు. దాంతో సినిమాలో కామెడీ టచ్ బాగానే కుదిరింది. ఓపెనింగ్ నుంచి హీరో ప్రియదర్శి క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా ప్రియదర్శి పాత్రకి, హీరోయిన్ పాత్రకి మధ్య నడిచే సన్నివేశాలు మరియు కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. హీరో ప్రియదర్శి పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, అంతే స్థాయిలో కొన్నిచోట్ల ఈ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో ఆసక్తికరమైన కథనాన్ని ఇంకా ఇంట్రెస్ట్ గా రాసుకుంటే బాగుండేది. అలాగే కథలో ఇంకా కామెడీని మరియు ఉత్కంఠను పెంచడానికి స్కోప్ ఉంది.
నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే... చాలా బాగుందనే చెప్పాలి. ప్రధాన పాత్రలో నటించిన ప్రియదర్శి తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ప్రియదర్శి తన పాత్రను చాలా బాగా పండించారు. హీరోయిన్ గా రూపా కొడువయూర్ నటన ఆకట్టుకుంది. అదే విధంగా కీలక పాత్రలో నటించిన అవసరాల శ్రీనివాస్ నటన కూడా బాగుంది. ఆయన డైలాగ్స్, ఆయన హావభావాలు బాగున్నాయి. ఇతర కీలక పాత్రల్లో నటించిన వీకే నరేష్, తణికెళ్ల భరణి, , వెన్నెల కిషోర్, వైవా హర్ష మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం : సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా ఓకే. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ తగ్గించాల్సింది. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి తగ్గట్టు కొన్ని చోట్ల ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. కానీ, కొన్ని సీన్స్ తో ఆకట్టుకున్నారు. ఓవరాల్ గా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంది ఈ సినిమా.
ఇంకా చదవండి: 'ఓదెల 2' మూవీ రివ్యూ : గాడి తప్పిన ప్రయాణం!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# సారంగపాణి జాతకం # ప్రియదర్శి # రూపా కొడువయూర్