SPEED220 మూవీ  రివ్యూ : స్వచ్ఛమైన  ప్రేమకథ!

SPEED220 మూవీ  రివ్యూ : స్వచ్ఛమైన ప్రేమకథ!

2 months ago | 36 Views

టాలీవుడ్ లో యువతను ఎంగేజ్ చేసే సినిమాలకి  ప్రస్తుతం ఎంతో క్రేజ్ ఉంది.  అందుకే నవతరం  దర్శకులు, నిర్మాతలు యూత్ ఫుల్ స్టోరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తుంటారు. ఫలితంగా  బాక్సాఫీస్ వద్ద కూడా నిర్మాతలు ఆశాజనకంగా గట్టేక్కే పరిస్థితి ఉంటుంది.  అందుకు తోడు ఓటీటీకి ఇలాంటి స్టోరీస్ బాగా వర్కవుట్ అవుతాయి. తాజాగా ఇలాంటి కథ... కథనాలతో తెరకెక్కిందే.. SPEED220. ఈచిత్రాన్ని విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో  కొల్ల గణేష్, మల్లిడి హేమంత్ రెడ్డి, భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్, శర్మ జాహ్నవి, తాటికొండ మహేంద్రనాథ్ తదితరులు నటించారు. డెబ్యూ దర్శకుడు హర్ష బీజగం ఈ సినిమాకు  దర్శకత్వం వహించారు. రా లవ్ స్టోరీ.. స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. యువతరాన్ని ఎంత మేరకు ఆకట్టుకుంది..? తెలుసుకుందాం....   

కథలోకి ...  సూర్య(హేమంత్), చందు(గణేష్) ఇద్దరూ మంచి స్నేహితులు. ఊళ్లో వాళ్లకి తలలో నాలుకలా ఉంటూ అందరికీ సహాయం చేస్తూ ఎంతో అన్యోన్యంగా బతికేస్తూ ఉంటారు. అదే గ్రామానికి చెందిన భిక్షపతి (తాటికొండ మహేంద్రనాథ్) అనే ఓ జమిందారు  ఇంట్లో పనిచేస్తూ... ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆయనకు మాయ (భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్) అనే ఓ ఆధునిక  భావాలు కలిగిన యువతి ఉంటుంది. సూర్య, గణేష్, మాయ ముగ్గురు చిన్నప్పటి నుంచే చదువుకుంటూ పెరిగి పెద్దవారవుతారు. అయితే మాయ సూర్య, చందులను ఒకరికి తెలియకుండా ఒకరితో సాన్నిహిత్యంగా ఉంటుంది. సూర్యకి చింటూ అనే ఓ చిన్న కుర్రాడితో అటాచ్ మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ కుర్రాడు అనుమానాస్పదస్థితిలో చనిపోతాడు. అలాగే మాయ కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. దాంతో సూర్య ఓ పిచ్చివాడిలా తయారై తిరుగుతూ వుంటారు. అలా తిరుగుతున్న సమయంలో అతని మీద హత్యాయత్నం జరుగుతుంది. దాంతో సూర్య అలర్ట్ అవుతాడు. తనను చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? అసలు చింటూ, మాయలు చనిపోవడానికి కారణం ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.... 

కథ... కథనం విశ్లేషణ: రా లవ్ స్టోరీలకు యూత్ లో మంచి ఆదరణ వుంటుంది. గతంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 కానీ, అర్జున్ రెడ్డి కానీ బాక్సాఫీస్ వద్ద ఎంత బంపర్ హిట్ అయ్యాయో మనకు తెలిసిందే. ఇలాంటి కథలను తెరకెక్కించేటప్పుడు స్క్రీన్ ప్లే ప్రధాన భూమిక పోషిస్తుంది. తెలిసిన కథలే అయినా... వాటికి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని తెరమీద చూపిస్తే... యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు చెప్పినట్టు ఇది ఓ డిఫరెంట్ జోనర్ సినిమా. ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి చుట్టూ... స్వచ్ఛమైన ప్రేమకోసం ఓ ఇద్దరు నిజాయతీగల యువకులు తిరిగే కథ. దానిని తెరమీద కొన్ని బోల్డ్ సీన్స్ తోనూ... ‘రా’ రొమాన్స్ ను యువతను ఆకర్షించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం ఫలించింది.   ప్రీతి సుందర్ అందచందాలు  ప్రేక్షకులను కత్తియపడేశాయని చెప్పొచ్చు.  ఎక్కడా బోరింగ్  లేకుండా ఇద్దరు యువకులతో ప్రీతి చేసిన రొమాన్స్ ను యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో అంతా... లవ్, రొమాన్స్ ను చూపించిన దర్శకుడు... సెకెండాఫ్ లో మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. సినిమా నిడివి కూడా తక్కువ వుండటంతో సినిమా ఎక్కడా బోరింగ్ లేకుండా సాగిపోతుంది. ఈ సినిమా చూడటానికి ఆర్ ఎక్స్ 100 ఛాయలున్నా... ఓ సారి లుక్కేయొచ్చు.  ఇధొక యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమా.

ఇందులో మాయ పాత్రలో చేసిన భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్  నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది.   బోల్డ్ సీన్స్ లో అందంగా కనిపించింది. ఉత్తరాది అమ్మాయే అయినా... తెలుగమ్మాయిలా చూడచక్కగా ఉంది. ప్రతీ ఫ్రేమ్ లోనూ  ఇట్టే ఆకట్టుకుంటుంది.    ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. మల్లిడి హేమంత్ రెడ్డి సూర్య పాత్రలో రఫ్ గా కనిపించి ఆకట్టుకుంటారు. అతడు భగ్న ప్రేమికుడిగా మంచి నటనే కనబరిచారు. అలాగే గణేష్ కూడా చందు పాత్రలో మెప్పించారు. సుప్రియ పాత్రలో చేసిన శర్మ జాహ్నవి  పల్లెటూరి అమ్మాయి పాత్రలో లంగా వోణిలో ఆకట్టుకుంటుంది. జమిందారుడు భిక్షపతిగా, హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన తాటికొండ మహేంద్రనాథ్ నటన ఓకే అనిపిస్తుంది.  చింటూ పాత్రలో కనిపించిన చిన్నకుర్రాడు కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. 

దర్శకుడు హర్ష... ఇలాంటి సినిమాని ఎంచుకోవడం మంచిదే. స్వచ్ఛమైన లవ్ కోసం చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగిన ఓ ఇద్దరు యువకులు, ఓ యువతిల మధ్య జరిగే ట్రయాంగిల్ కథ.. కథనాలు ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. అయితే వీరితో కలిసి పెరిగిన అమ్మాయి... పెరిగి పెద్దయిన తరువాత ఎందుకు అలా ఆధునిక భావాలతో సెంటిమెంట్ కు తావులేకుండా పెరగాల్సివచ్చిందో కనీసం తండ్రితోనైనా చెప్పించి వుంటే మరింత బాగుండేది. పైగా నా కూతురు కామంతో మీ ఇద్దరితో ఇలా ఆడుకుందని చెప్పించడం అంతగా నప్పలేదు. ఆమె అలా పెరగడానికి కారణం... ఓ బలమైన కారణం వుండేలా చూపించాల్సింది.  అప్పుడు ప్రేక్షకులకు మరింత కన్వెన్సింగ్ గా వుండేది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. రొమాంటిక్ సన్నివేశాలను, హీరోలను, హీరోయిన్లను అందంగా చూపించారు. పల్లెటూరి వాతావరణాన్ని బాగా చూపించారు. నేపథ్య సంగీతం బాగుంది. ఓ ఐటెం సాంగు కూడా యూత్ కోసం పెట్టినట్టువుంది. అది కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని చాలా క్వాలిటీగా నిర్మించారు. ఇది స్వచ్ఛమైన ప్రేమకోసం తపించే ఇద్దరు మిత్రుల కథ.  అన్ని వర్గాలను అలరించే SPEED220 చిత్రాన్ని ఓ సారి లుక్కేయండి... 

రేటింగ్: 3/5

ఇంకా చదవండి: మూవీ రివ్యూ : రొటీన్‌కు భిన్నంగా 'సరిపోదా శనివారం'

# SPEED220     # OTT    

trending

View More