‘రహస్యం ఇదం జగత్’  మూవీ రివ్యూ :   సాదాసీదా సైన్స్‌ ఫిక్షన్‌   !

‘రహస్యం ఇదం జగత్’ మూవీ రివ్యూ : సాదాసీదా సైన్స్‌ ఫిక్షన్‌ !

4 days ago | 5 Views

(చిత్రం :  ‘రహస్యం ఇదం జగత్’ ,

విడుదల తేదీ : నవంబర్ 08, 2024 ,

రేటింగ్ : 2.5/5,

నటీనటులు : రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్‌ కండాల, శివకుమార్‌ జుటూరి, ఆది నాయుడు తదితరులు.

దర్శకత్వం : కోమల్ ఆర్. భరద్వాజ్

ఎడిటింగ్ : చోటా.కె.ప్రసాద్‌,

సినిమాటోగ్రఫీ : టైలర్‌ బ్లుమెల్,

మ్యూజిక్ : గ్యానీ,

ప్రొడ్యూసర్ : పద్మ రావినూతుల, హిరణ్మయి రావినూతుల) 

రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందిన సినిమా ‘రహస్యం ఇదం జగత్’. కోమల్ ఆర్. భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో  తెలుసుకుందాం ... 

కథ : సైన్స్‌ ఫిక్షన్‌కు మైథాలజీని కనెక్ట్‌ చేస్తూ.. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ నేపథ్యంలో ఈ సినిమా  కథ  సాగింది. అభిరామ్ (రాకేష్ గలేబి), అకీరా (స్రవంతి పత్తిపాటి) ఇద్దరూ ప్రేమలో ఉంటారు. వీరిద్దరూ యూఎస్‌లో జాబ్ చేస్తూ, అక్కడే కెరీర్ ను బిల్డ్ చేసుకుంటూ లైఫ్ లో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటారు. ఐతే, అకీరా ఫాదర్ చనిపోవడంతో, ఆమె తిరిగి ఇండియా వెళ్లి, తన తల్లితోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంటుంది. అకీరా కోసం అభిరామ్ కూడా యూఎస్‌లో కెరీర్ ను వదిలేసి, ఇండియా వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభిరామ్ – అకీరా జీవితాల్లో చోటు చేసుకున్న మలుపులు ఏమిటి ?, అరుణి ఆచార్య (మానస వీణ) కారణంగా టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ అభిరామ్ జీవితగంలోకి ఎలా వచ్చింది ?, సైన్స్‌ ఫిక్షన్‌ కు మైథాలజీని కనెక్ట్‌ చేసి సాగిన ఆ టైమ్‌ ట్రావెల్‌ లో అభిరామ్ జర్నీ ఎలా సాగింది ?, ఆ ట్రావెల్‌ కారణంగా అతను సాధించింది ఏమిటి ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:  దర్శకుడు కోమల్ ఆర్. భరద్వాజ్ ఈ మైథాలాజికల్‌ సస్పెన్స్ థ్రిల్లర్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే టైమ్‌ ట్రావెల్‌ ట్రాక్ ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది.  సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్‌ గా వచ్చిన ఈ ‘రహస్యం ఇదం జగత్’లో.. టైమ్‌ ట్రావెల్‌ థీమ్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. అయితే, కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఈ ‘రహస్యం ఇదం జగత్’ సినిమాలో ఇంట్రెస్టింగ్ థీమ్ ఉన్నా.. చాలా చోట్ల ప్లే బోరింగ్ గా సాగుతుంది. తీసుకున్న పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు కోమల్ ఆర్. భరద్వాజ్ విఫలం అయ్యాడు. పైగా సైన్స్‌ ఫిక్షన్‌ కి మైథాలాజికల్‌ కి కనెక్షన్ పెట్టి, ఆ కోణంలో క్లారిటీగా సీన్స్ ను రాసుకోకుండా గజిబిజిగా సీన్స్ ను డ్రైవ్ చేశారు. నిజానికి కథనానికి అనుగుణంగా జరుగుతున్న డ్రామా పాయింట్ ఆఫ్ వ్యూలో బోలెడు సస్సెన్స్ ను మెయింటైన్ చేయవచ్చు. కానీ.. ఈ విషయంలోనూ సినిమా ఎఫెక్టివ్ గా లేదు. చనిపోయిన తన స్నేహితులను సేవ్ చేయడానికి హీరో చేసే ప్రయత్నంలోనూ లాజిక్ మిస్ అయ్యింది. పైగా అభి రామ్ పాత్ర కోణంలోనే మెయిన్ ప్లాట్ సాగడంతో సినిమాలో అదే పెద్ద మైనస్ అయింది. దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి. దర్శకుడు కోమల్ ఆర్. భరద్వాజ్ సెకండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గానీ, అది కూడా స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ ఎలిమెంట్స్ తో సాగిన ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందదు. దర్శకుడు కోమల్ ఆర్. భరద్వాజ్ రాసుకున్న మైథాలాజికల్‌ డ్రామా కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ గా సాగింది. ముఖ్యంగా సినిమాలో కొన్ని సప్సెన్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి. అభిరామ్ పాత్రలో రాకేష్ గలేబి చాలా బాగా నటించాడు. హీరోయిన్ పాత్రలో స్రవంతి పత్తిపాటి కూడా బాగానే నటించింది. మరో కీలక పాత్రలో మానస వీణ కూడా తన నటనతో ఆకట్టుకుంది. అదేవిధంగా భార్గవ్ గోపీనాథం మేనరిజమ్స్ బాగున్నాయి. కార్తీక్‌ కండాల తన పాత్రలో మెప్పించాడు. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించిన శివకుమార్‌ జుటూరి, ఆది నాయుడు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు తీసుకున్న మెయిన్ పాయింట్, అండ్ ఆ పాయింట్ ను ఎలివేట్ చేస్తూ సైన్స్‌ అండ్‌ మైథాలాజికల్‌ ఎలిమెంట్స్ ను లింక్ చేస్తూ రాసుకున్న కొన్ని సీన్స్ కొత్తగా ఉన్నాయి.

సాంకేతిక విభాగం : సినిమాలో టైలర్‌ బ్లుమెల్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. గ్యానీ సంగీతం పర్వాలేదు. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాతలు పద్మ రావినూతుల, హిరణ్మయి రావినూతుల ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

ఇంకా చదవండి: మూవీ రివ్యూ : ‘ధూం ధాం’ లేదు..!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !


# రహస్యం ఇదం జగత్     # రాకేష్ గలేబి     # స్రవంతి పత్తిపాటి    

trending

View More