'పురుషోత్తముడు' మూవీరివ్యూ : పాత కథకకు కొత్తగా రంగులు!

'పురుషోత్తముడు' మూవీరివ్యూ : పాత కథకకు కొత్తగా రంగులు!

1 month ago | 26 Views

రాజ్‌తరుణ్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. అటు కెరీర్‌పరంగా సరైన హిట్‌ లేదు, ఇటు వ్యక్తిగత జీవితంలోని వివాదాలు తన ఇమేజ్‌ను మసక బారుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వచ్చిన  ’పురుషోత్తముడు’ శుక్రవారం విడుదలయ్యింది.  రచిత్‌ రామ్‌ (రాజ్‌తరుణ్‌) పుట్టుకతోనే కోటీశ్వరుడు. భారత్‌లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పీఆర్‌ గ్రూప్స్‌ అధినేత ఆదిత్య రామ్‌ (మురళీ శర్మ) తనయుడు. లండన్‌లో చదువులు పూర్తి చేసుకుని దేశానికి తిరిగొస్తాడు. అతను వచ్చీ రాగానే పీఆర్‌ గ్రూప్స్‌ కొత్త సీఈవోగా నియమించాలని ఆదిత్య రామ్‌ నిర్ణయించుకుంటాడు. కానీ, దానికి రచిత్‌ పెద్దమ్మ వసుంధర (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ బైలా ప్రకారం సీఈవోగా ఎంపికవ్వాల్సిన వ్యక్తి ఎవరైనా సరే 100రోజుల పాటు ఓ సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది. దీంతో రచిత్‌ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కడియం సవిూపంలో ఉన్న రాయపులంక అనే పల్లెటూరికి చేరుకుంటాడు. మరి అక్కడికి వెళ్లాక రచిత్‌ రామ్‌ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది?ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను.. ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు? రచిత్‌కు.. అమ్ము (హాసినీ సుధీర్‌)కు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది? అన్నది మిగిలిన కథ. కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్నీ వదులకొని ఓ సామాన్యుడిలా కొన్నాళ్లు అజ్ఞాత జీవితం గడపాల్సి రావడం.. ఈ క్రమంలో ఓ పల్లెటూరికి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరికి దేవుడిగా మారడం.. ఈ తరహా కథాంశాలు వెండితెరకేం కొత్త కాదు. ’పురుషోత్తముడు’ కూడా ఆ తాను ముక్కే. దర్శకుడు రాసిన  కథలోనూ.. తెరపై ఆవిష్కరించడంలోనూ ఏమాత్రం కొత్తదనం కనిపించదు. ఇది ఓ కోణంలో ’శ్రీమంతుడు’కు పాత వెర్షన్‌లా.. ఇంకో కోణంలో ’బిచ్చగాడు’కు అప్‌డేట్‌ వెర్షన్‌లా కనిపిస్తుంది. పాత్ర పరిచయం, కథా నేపథ్యంతో సినిమాను త్వరగానే మొదలు పెట్టిన దర్శకుడు రాయపులంక చేరాక, మరీ నెమ్మదిగా సాగుతుంది. హీరో`హీరోయిన్‌ పరిచయం, ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే హీరో రాయపులంక పూల రైతులకు జరుగుతున్న అన్యాయాలపై తిరగబడేందుకు సిద్ధపడతాడో.. అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంజుకుంటుంది.

అయితే ప్రథమార్ధం వరకు పడుతూ లేస్తూ సాగిన కథనం.. ద్వితీయార్దానికి వచ్చే సరికి పూర్తిగా గాడి తప్పింది. కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు. ప్రతినాయకుడి పాత్రని కూడా శక్తిమంతంగా తీర్చిదిద్దుకోలేకపోయారు.  ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పెద్దగా రక్తి కట్టలేదు. క్లైమాక్స్‌ ఊహలకు తగ్గట్లుగా ఉన్నా.. పతాక సన్నివేశాల్లో ప్రకాశ్‌రాజ్‌ పాత్ర ఎంట్రీ.. ఆయన చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి.

ఇంకా చదవండి: ధనుష్'రాయన్' మూవీ రివ్యూ : మెప్పించే రివేంజ్ డ్రామా !

# Purushothamudu     # RajTharun     # TeluguCinema    

trending

View More