మూవీ రివ్యూ : సాదాసీదా కథతో ముగించిన ..ది గోట్‌ !

మూవీ రివ్యూ : సాదాసీదా కథతో ముగించిన ..ది గోట్‌ !

2 months ago | 34 Views

ఈ మధ్య సినిమాల్లో కథలకు ప్రాధాన్యం లేకుండా పోతోంది. ఎటునుంచి ఎటు వెళతాయో చెప్పలేక పోతున్నారు. అలాంటి కోవలోనే 'ది గోట్‌' చేరింది. రాజకీయ ప్రవేశానికి ముందు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ నుంచి వస్తున్న చిత్రం ఇది.  ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. స్పెషల్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ బృందంలో ఏజెంట్‌గా పని చేస్తుంటాడు గాంధీ (విజయ్‌). కానీ, తన ఉద్యోగం గురించి భార్య అను (స్నేహ)కు అసలు చెప్పడు. తనొకసారి ఓ మిషన్‌ కోసం థాయ్‌ ల్యాండ్‌ వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక మిషన్‌ వల్ల గాంధీ కుటుంబానికి ఓ ముప్పు ఎదురవుతుంది. ఈ క్రమంలోనే తన ఐదేళ్ల కొడుకు జీవన్‌ను కోల్పోతాడు. ఆ ఘటనతో గాంధీ తీవ్రంగా కుంగిపోతాడు. తన వల్లే కొడుకును కోల్పోవాల్సి వచ్చిందన్న బాధతో ఉద్యోగం వదిలేస్తాడు. భార్య కూడా అతన్ని దూరం పెడుతుంది. అలా 15ఏళ్లు గడిచిపోతాయి. ఓసారి ఓ పని విషయమై మాస్కోకి వెళ్లిన గాంధీకి అనూహ్యంగా తన కొడుకు జీవన్‌ (విజయ్‌) కనిపిస్తాడు. ఓ రౌడీ బృందం ఉచ్చులో చిక్కుకొని ఉన్న తన బిడ్డను కాపాడి భారత్‌కు తీసుకొస్తాడు. కొడుకు రాకతో గాంధీ కుటుంబం మళ్లీ కలుస్తుంది. ఇక అంతా బాగుందనుకున్న సమయంలో గాంధీ స్క్వాడ్‌ టీమ్‌ బాస్‌ నజీర్‌ (జయరాంను ఎవరో చంపేస్తారు. ఆ తర్వాత ఆ టీమ్‌లోని ఒక్కొక్కరూ వరుసగా హత్యకు గురవుతుంటారు. మరి ఈ హత్యలకు కారణమెవరు? జీవన్‌కు ఈ హత్యలకూ ఉన్న లింకేంటి? తను తండ్రిని చంపాలని ఎందుకు పగబడతాడు? జీవన్‌ను పెంచి పెద్ద చేసిన మేనన్‌ (మోహన్‌)కు.. గాంధీకీ ఉన్న విరోధం ఏంటి? అన్నది మిగతా కథ. 

విశ్లేషణ: దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ ఏజెంట్‌ కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో అతను ఓ మిషన్‌లో తన కొడుకును కోల్పోవలసి రావడం.. కట్‌ చేస్తే ఆ కొడుకే 15ఏళ్ల తర్వాత తన పాలిట యముడిలా మారి దేశానికి పెను సమస్యలా మారడం.. ఈ క్రమంలో అతని ఆట కట్టించేందుకు ఆ తండ్రి ఏం చేశాడన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. నిజానికి ఈ కథలో పెద్దగా కొత్తదనమేవిూ లేకున్నా.. స్క్రీన్‌ప్లే స్పెషలిస్ట్‌ వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన సినిమా కావడంతో దీంట్లో తప్పకుండా ఓ మ్యాజిక్‌ కనిపిస్తుందన్న భరోసా ప్రేక్షకుల్లో కపిస్తుంది. కానీ, ఏజెంట్‌ సినిమాల్లో కనిపించే ట్విస్ట్‌లు, మలుపులు, మెరుపులు ఏ ఒక్కటీ కథనంలో కనిపించలేదు. కనీసం హీరో చేసే ఆపరేషన్స్‌లోనూ థ్రిల్‌ లేదు. పైగా విరామం వరకూ కథంతా సాగతీత వ్యవహారంమే. హీరోకి తన తనయుడు తారస పడతాడో.. అక్కడి నుంచే కథలో వేగం పుంజుకుంటుంది. ఈ క్రమంలో తనయుడిని కాపాడుకోవడం కోసం మాస్కోలోని విలన్‌ గ్యాంగ్‌తో గాంధీ చేసే ఛేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ అలరిస్తుంది. విరామానికి ముందు జీవన్‌ పాత్రతో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్‌ ఆసక్తిరేకెత్తిస్తుంది. దానికి ముందు తండ్రీకొడుకులు మధ్య మెట్రోలో జరిగే యాక్షన్‌ సీక్వెన్స్‌ హైలైట్‌. విరామానికి ముందే జీవన్‌ విలన్‌ అని రివీలైపోవడంతో.. ద్వితీయార్ధంలో తండ్రీకొడుకుల మధ్య పోరు ఎలా ఉండనుందా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైపోతుంది. దానికి తగ్గట్లుగానే ద్వితీయార్ధం ఆరంభంలో గాంధీకి.. జీవన్‌కూ మధ్య నడిచే మైండ్‌ గేమ్‌ కాసేపు ఆసక్తిరేకెత్తిస్తుంది. అయితే, తండ్రిపై పగ పెంచుకోవడానికి జీవన్‌కు ఉన్న కారణాన్ని ప్రభావవంతంగా చూపించలేదు. ఇక మధ్యలో విూనాక్షితో తన లవ్‌ ట్రాక్‌.. అనవసరంగా వచ్చి పడిపోయే పాటలు.. యోగిబాబు కామెడీ ట్రాక్‌.. అన్నీ సహనానికి పరీక్ష. చివరిలో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌.. దానితో ముడిపడి సాగే ఐపీఎల్‌ ట్రాక్‌ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపుతాయి. తండ్రీకొడుకులుగా విజయ్‌ ద్విపాత్రాభినయం ఆకట్టుకుంటుంది.'ది గోట్‌ మూవీ’ దర్శకుడు వెంకట్‌ ప్రభు కథలో కొత్తదనం లేదు. ద్వితీయార్ధం బాగున్నా, ఓ బలమైన పాయింట్‌తో ముగించాల్సింది.

ఇంకా చదవండి: 'ఉరుకు పటేల' మూవీ రివ్యూ : అలరించే కామెడీ థ్రిల్లర్!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Goat     # Talapathyvijay     # Meenakshichaudhary    

trending

View More