మూవీ రివ్యూ : ‘ధూం ధాం’ లేదు..!
1 month ago | 5 Views
(చిత్రం : ‘ధూం ధాం’ ,
విడుదల : నవంబర్ 08, 2024 ,
రేటింగ్ : 2.5/5,
నటీనటులు : చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు
స్టోరీ స్క్రీన్ ప్లే : గోపీ మోహన్,
డైరెక్టర్ : సాయి కిషోర్ మచ్చా,
ఎడిటింగ్ : అమర్ రెడ్డి కుడుముల,
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ : గోపీ సుందర్,
ప్రొడ్యూసర్ : ఎంఎస్ రామ్ కుమార్)
చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘ధూం ధాం’. ఈ చిత్రం ఈ రోజు (నవంబర్ 08, 2024 ) విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం ...
కథ : కార్తీక్ (చేతన్ కృష్ణ) అంటే అతని తండ్రి (సాయి కుమార్)కి మితిమీరిన ప్రేమ. తన కొడుకు మాత్రమే నంబర్ వన్ గా ఉండాలని ఆశ పడతాడు. కార్తీక్ కి కూడా తండ్రి అంటే అంతే ప్రేమ. ఈ క్రమంలో కార్తీక్ జీవితంలోకి సుహానా (హెబ్బా పటేల్) ఎంట్రీ ఇస్తోంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కార్తీక్ లైఫ్ లో జరిగిన డ్రామా ఏమిటి ?, కార్తీక్.. తన తండ్రి కోసం చేసిన పొరపాటు ఏమిటి ?, అలాగే కార్తీక్ తండ్రి (సాయి కుమార్) తన కొడుకు కోసం చేసిన పొరపాటు ఏమిటి ?, ఈ తప్పులు సుహానా (హెబ్బా పటేల్) ఫ్యామిలీకి ఎలా లింక్ అయ్యాయి ?, చివరికి ఈ కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: ‘ధూం ధాం’ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, సెకండ్ హాఫ్ కామెడీ ట్రాక్, మరియు పెళ్లిలో యాడ్ అయ్యే ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఐతే, రెగ్యులర్ స్క్రీన్ ప్లే, మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో స్క్రీన్ ప్లే రచయిత గోపీ మోహన్ కొన్ని చోట్ల తడబడ్డాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ప్లే ఫుల్ ఫన్ తో సాగితే బాగుండేది. కానీ, సెకండ్ హాఫ్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫన్ ఎలిమెంట్స్.. ఫస్ట్ హాఫ్ లో మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమాకి మైనస్ అయ్యింది. హీరోహీరోయిన్ల ఫ్యామిలీస్ మధ్య కాన్ ఫ్లిక్ట్ ను బిల్డ్ చెయ్యడానికి సిల్లీ ట్రాక్స్ వేయడం కూడా బాగాలేదు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు పేలవంగా సాగుతాయి. దీనికితోడు లాజిక్స్ కూడా ఎక్కడా కనిపించవు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ కు కూడా సరైన బలం లేదు. అసలు ఈ కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేయవచ్చు. సెకండ్ హాఫ్ నిజంగానే కొన్ని చోట్ల ఫన్ తో సాగింది. ఆ ఫన్ ను కూడా దర్శకుడు సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయాడు. తండ్రికొడుకులు ఒకరి పై మరొకరు పెంచుకున్న అమితమైన ప్రేమ కారణంగా వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, లవ్ సీన్స్ మరియు పెళ్లి సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన చేతన్ కృష్ణ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో బాగానే నటించాడు. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన సాయి కుమార్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్ హెబ్బా పటేల్ తన గ్లామర్ తో అలరించింది. హీరోయిన్ కి పెద్దనాన్నగా నటించిన గోపరాజు రమణ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కీలక పాత్రలో కనిపించిన వెన్నెల కిషోర్ చాలా బాగా నవ్వించాడు. ప్రధాన పాత్రలు – వెన్నెల కిషోర్ మధ్య వచ్చే పంచ్ లు అండ్ కామెడీ టైమింగ్ కూడా అలరిస్తోంది. శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్ లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ కూడా బాగానే నటించారు. మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్.. అలాగే ఆ ట్రాక్ తో ముడి పడిన ఫ్యామిలీ సీన్స్.. మరియు పెళ్లిలో యాడ్ అయ్యే మిగిలిన పాత్రలు.. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి.
టెక్నికల్ గా చూసుకుంటే.. సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా గోపీ సుందర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా సిద్ధార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాత ఎంఎస్ రామ్ కుమార్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తంమీద సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమాలో ఏ మాత్రం ధూం ధాం’ లేదు..!
ఇంకా చదవండి: జితేందర్ రెడ్డి మూవీ రివ్యూ : ట్రాక్ తప్పింది!