మూవీ రివ్యూ : ఆకట్టుకునే  'అలనాటి రామచంద్రుడు'

మూవీ రివ్యూ : ఆకట్టుకునే 'అలనాటి రామచంద్రుడు'

1 month ago | 18 Views

(చిత్రం : అలనాటి రామచంద్రుడు, విడుదల తేదీ : ఆగస్టు 02, 2024, రేటింగ్ : 2.5/5,  నటీనటులు: కృష్ణవంశీ, మోక్ష, బ్రహ్మాజీ, వెంకటేశ్‌ కాకుమాను తదితరులు, దర్శకత్వం : చిలుకూరి ఆకాశ్‌ రెడ్డి, నిర్మాతలు : హైమావతి జడపోలు, శ్రీరామ్‌ జడపోలు, సంగీత దర్శకుడు: శశాంక్‌.టి, సినిమాటోగ్రఫీ: ప్రేమ్‌ సాగర్‌, ఎడిట‌ర్ : శ్రీకర్) 

చిలుకూరి ఆకాశ్‌ రెడ్డి దర్శకత్వంలో కృష్ణవంశీ, మోక్ష జంటగా నటించిన సినిమా 'అలనాటి రామచంద్రుడు'. ఈ చిత్రం నేడు (ఆగస్టు 02, 2024)  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా  ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో  తెలుసుకుందాం... 

 కథ : నలుగురిలోకి వెళ్ళడానికి, పదిమందిలో మాట్లాడడానికి చిన్న తనం నుంచి సిద్దు (కృష్ణవంశీ) ఇబ్బంది పడుతూ ఉంటాడు.  ఇలాంటి సిద్దు జీవితంలోకి ధరణి (మోక్ష) ఎంటర్ అవుతుంది. ఎంతో యాక్టివ్ గా ఉండే ధరణిని చూసి, సిద్దు ఆమెతో స్నేహం చేస్తాడు. చిన్న వయసులో మొదలైన ఆ స్నేహం పెరిగి పెద్దయ్యాక ప్రేమగా మారుతుంది. మరి తన ప్రేమ కోసం సిద్దు ఏం చేశాడు ?, తన ప్రేమను ధరణికి చెప్పడానికి ఎలాంటి పాట్లు పడ్డాడు ?, ఇంతకీ సిద్దు ప్రేమను ధరణి అర్థం చేసుకుందా ? లేదా ?, ఈ మధ్యలో సిద్దు ఎందుకు ధరణికి దూరం కావాలని నిర్ణయించుకున్నాడు ?,  చివరకు సిద్దు – ధరణి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది ? అనేది అసలైన కథ. 

 విశ్లేషణ:  ‘అలనాటి రామచంద్రుడు’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. కొన్ని బరువైన భావోద్వేగాలు, కొన్ని లవ్ సీన్స్ బాగున్నాయి. ఐతే, కథ కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలు మాత్రమే కనెక్ట్ అవుతాయి. దర్శకుడు చిలుకూరి ఆకాశ్‌ రెడ్డి పనితనం, హీరో కృష్ణవంశీ నటన సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… కథ కథనాల్లో కొత్తదనం లేకపోవడం, ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు కొంత  మైనస్ అయ్యాయి. దీనికితోడు అనవసరమైన సీన్స్ తో కథను అనవసరంగా డైవర్ట్ చేశారనిపించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు చాలా స్లోగా సాగుతూ  విసిగిస్తాయి.  ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని లవ్ ఎలిమెంట్స్ ఫర్వాలేదకున్నా.. మిగిలిన కంటెంట్ అంతా చాలా బోరింగ్ ప్లేతో రోటీన్ గా సాగింది.   లవ్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన భావోద్వేగాలతో సాగిన ఈ 'అలనాటి రామచంద్రుడు' లో బరువైన ప్రేమ కథ ఉంది. ఎమోషనల్ గా సాగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్‌ కూడా బాగున్నాయి. ఇక ఈ సినిమాలో కృష్ణవంశీ పోషించిన ప్రధాన పాత్ర అయిన సిద్దు పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన ఇంట్రావర్ట్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు కామెడీ సీన్స్.. ముఖ్యంగా ధరణి పాత్ర మరియు ఆ పాత్రతో లవ్ ట్రాక్.. ఇలా మొత్తానికి 'అలనాటి రామచంద్రుడు' సినిమా కాన్సెప్ట్ అండ్ కొన్ని ప్రేమ సన్నివేశాల పరంగా ఆకట్టుకుంది. అయితే.. ‘అలనాటి రామచంద్రుడు’ స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.  సినిమాలో కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో కృష్ణవంశీ క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. పైగా ఉన్న కంటెంట్ లో కూడా ఫ్రెష్ నెస్ మిస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన కృష్ణవంశీ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ మోక్ష కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. అలాగే, తన గ్లామర్ తో సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరో కీలక పాత్రలో నటించిన బ్రహ్మాజీ తన నటనతో మెప్పించాడు. ఇతర పాత్రల్లో నటించిన సుధ, ప్రమోదిని, చైతన్య గరికపాటి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు. 

సాంకేతిక విభాగం : ఈ సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు.  సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ ప్రేమ్‌ సాగర్‌ వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. సంగీత దర్శకుడు శశాంక్‌.టి సమకూర్చిన పాటలు బాగున్నాయి.  ఎడిటింగ్ ఫర్వాలేదు.   చిత్ర నిర్మాతలు హైమావతి జడపోలు, శ్రీరామ్‌ జడపోలు పాటించిన నిర్మాణ విలువలు ఓకే అనిపించాయి.  మొత్తం మీద ఈ  'అలనాటి రామచంద్రుడు' ఆకట్టుకుంటాడు.

ఇంకా చదవండి: 'శివం భజే' మూవీ రివ్యూ : మిస్టీరియస్ థ్రిల్లర్‌!

# Alanatiramachandradu     # Krishnavamshi     # Moksha     # August2    

trending

View More