సినిమా రివ్యూ : ‘గ్యాంగ్ స్టర్'.

సినిమా రివ్యూ : ‘గ్యాంగ్ స్టర్'.

1 month ago | 5 Views

’రివ్యూ రేటింగ్ : 3/5

నటీనటులు - చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంఛన్, అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్యనారాయణ, డి. యస్. రావు, గిరి పోతురాజు, నవీన్ ఆర్యాన్ తదితరులు

సమర్పణ - రవి అండ్ నరసింహా,

బ్యానర్ - వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్,

ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత దర్శకత్వం- చంద్రశేఖర్ రాథోడ్      

కెమెరామెన్ : జి. యల్ .బాబు

కో  డైరెక్టర్.. విజయ్ సారధి

పీఆర్ఓ - శ్రీపాల్ చొల్లేటి

చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటించిన  సినిమా "గ్యాంగ్ స్టర్". ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ లో రవి, నరసింహా సమర్పణలో చంద్రశేఖర్ రాథోడ్  ' గ్యాంగ్ స్టర్ ' సినిమాకి దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 25 న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు వచ్చిన “గ్యాంగ్ స్టర్’ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో తెలుసుకుందాం.

కథ

ఈ కథ కంప్లీట్ గా గోవా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది.  ఫ్రెండ్స్ గా ఉన్న డేవిడ్(సూర్యనారాయణ), జేమ్స్ (అడ్ల సతీష్ ) లు సిటీ లో పెద్ద గ్యాంగ్ స్టర్స్.  సిటీకి కింగ్ మేకర్ అవ్వాలని ఒకరిమీద ఒకరు పోటీ పడుతుంటారు.ఈ క్రమంలో వీరిద్దరూ మధ్య కొద్దిపాటి గొడవలు జరిగి బద్ద శత్రువులుగా మారతారు. వీళ్ళు సమాజంలో ఉండే రూల్స్  కాకుండా వారికంటూ సపరేట్ రూల్స్ పెట్టుకుంటారు. రూల్స్ ని ఎవరు బ్రేక్ చేస్తే. వాళ్ళని చంపేస్తారు.మరోవైపు హీరో మైఖేల్ (చంద్రశేఖర్ రాథోడ్) తల్లి తండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. అయితే జేమ్స్ ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ అయినా కూడా తనలో ఉన్న కొద్దిపాటి మంచితనంతో  మైకేల్ ను దగ్గర తీసుకొని రూల్స్  చెప్పడంతో  జేమ్స్ దగ్గర  సీక్రెట్ వెపన్ (కిల్లర్ )గా మారతాడు. మైకేల్ కు ప్రేమ,బాధ, కోపం,వంటి ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. తనకు తెలిందల్లా ఒక్కటే ఇచ్చిన మాటకోసం ఎంత దూరమైనా వెళ్లడం, తనకొచ్చిన డీల్ ను ఫినిష్ చేయడం.

మైకేల్ కు ఒకచోట జెస్సిక (కాస్వీ కాంచన్) పరిచయం అవుతుంది. 

ఎటువంటి ప్రేమ, ఎమోషన్స్ లేని మైక్  జెస్సీని ను ఎందుకు ఇష్టపడ్డాడు..తను ఇష్టపడిన జెస్సీ.. జేమ్స్ భార్యగా  ఎలా మారింది.? జెస్సీ ని చంపాలని డీల్  కుదుర్చుకున్న మైక్ మొదటి సారి రూల్స్ ను బ్రేక్ చేసనందున ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు? ఇలాంటి అంశాలు తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి "గ్యాంగ్ స్టర్" సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు

మైఖేల్  పాత్రలో నటించిన హీరో చంద్రశేఖర్ రాథోడ్ కి ఇది మొదటి సినిమా అయిన కూడా హావ భావాలతో చాలా చక్కగా నటించాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా డూప్ లేకుండా చాలా అద్భుతంగా నటించాడు. జెస్సిక పాత్రలో నటించిన హీరోయిన్ కాశ్వీ కాంఛన్ తన పాత్రకు 100% న్యాయం చేసింది. మన తెలుగు అమ్మాయి కాకున్నా తెలుగుతనాన్ని ఉట్టిపడేలా లుక్స్ పరంగానూ తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే అడ్ల సతీష్ కుమార్, సూర్యనారాయణ, అభినవ్ జనక్, లు గ్యాంగ్ స్టర్స్ గా అద్భుతంగా నటించారు.డి. యస్. రావు, గిరి పోతురాజు, నవీన్ ఆర్యాన్ తదితరులందరూ వారికిచ్చిన పాత్రల పరిధి మేరకు చాలా చక్కగా నటించి మెప్పించారని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు

ఇంతవరకు ఎన్నో గ్యాంగ్ వార్స్ పైన సినిమాలు చూసి ఉంటాము. కానీ ఈ సినిమా ఒక కొంతమేరకు  కొత్తగా ఉంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.  తనకిది మొదటి సినిమా అయినా డైరెక్టర్ చంద్రశేఖర్ రాథోడ్ రాసుకున్న కథ చాలా గ్రిప్పింగ్ ఉంది. హాలీవుడ్ స్టాండర్డ్ లో లైటింగ్సు ,సౌండ్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా వచ్చింది. 

ఒక అనిమల్, కిల్ బిల్ సినిమాలలో ఎటువంటి ఫైట్స్ ఉంటాయో అలాంటి ఫైట్స్ ఈ సినిమాలో వున్నాయి. 

ఇందులో లవ్, యాక్షన్, సెటిల్డ్ ఎమోషన్ ఇలా అన్ని రకాల అంశాలను తెరకెక్కించడంలో దర్శకుడుగా, నటుడుగా సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.టెక్నికల్‌ గా, ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత, దర్శకత్వం..ఇవన్నీ ఒక్కరే చేయడం ఈజీ కాదు.  మ్యూజిక్ బాగుంది. జతగా నీ తలపే అనే సాంగ్ డీసెంట్ గా వుంది. ఇందులో 6 నిమిషాలు యాక్షన్ సీక్వెన్స్  వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇక సినిమాటో గ్రాఫర్ జి. యల్. బాబు తనకు ఉన్నంతలో బాగాచేశారు .నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. 

ప్లస్ పాయింట్స్

పెర్ఫార్మన్స్

సినిమాటోగ్రఫీ

డైరెక్షన్

ప్రొడక్షన్ వ్యాలూస్

మైనస్ లు

ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉండడం

ఓవరాల్‌గా చెప్పాలంటే  యాక్షన్ ,ఎమోషన్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం “గ్యాంగ్ స్టర్ “ సినిమా  కచ్చితంగా నచ్చుతుందని  చెప్పవచ్చు.

ఇంకా చదవండి: ‘లగ్గం’ మూవీ రివ్యూ : మెప్పించే కథ!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# గ్యాంగ్‌స్టర్     # చంద్రశేఖర్రాథోడ్     # కాశ్వీకాంఛన్    

trending

View More