మూవీ రివ్యూ : గ్రావిూణ నేపథ్యంలో సాగిన 'కమిటీ కుర్రోళ్లు'
4 months ago | 66 Views
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు’ సినిమా... పవన్‌కల్యాణ్‌కు అభిమాని అయిన యదు వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. 11 మంది కొత్త హీరోలు, నలుగురు హీరోయిన్లతో ఈ చిత్రం తెరకెక్కింది. సాయికుమార్, గోపరాజు రమణ, సీనియర్ నటి శ్రీ లక్ష్మి, 'కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కిశోర్ కీలక పాత్రధారులు. ఇప్పటి వరకూ ఓటీటీ సిరీస్‌లకు నిర్మాతగా వ్యవహరించిన నిహారికకు నిర్మాతగా తొలి సినిమా ఇది. గ్రావిూణ నేపథ్యం అంటూ ట్రైలర్లు, పోస్టర్‌లను ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం...
కథ: అది గోదావరి జిల్లాల్లోని పురుషోత్తమపల్లి అనే గ్రామం. అక్కడ గ్రామ దేవత బరింకాలమ్మ తల్లి. 12 ఏళ్లకు ఓసారి ఘనంగా జరిగే జాతర. స్నేహానికి మారుపేరుగా ఉండే 11మంది కుర్రోళ్లు. వారి ఆటలు, పాటలు. ఈసారి జాతర జరిగిన పది రోజులకు సర్పంచ్ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో శివ (సందీప్ సరోజ్) సర్పంచ్‌గా, అతనికి ఎదురు పోలిశెట్టి బుజ్జి (సాయికుమార్) పోటీ చేయడానికి సన్నాహాల్లో ఉంటారు. అయితే గత జాతరలో 11 మంది స్నేహితుల్లో కులం రిజర్వేషన్ కారణంగా జరిగిన గొడవలో స్నేహితుడు ఆత్రం (నరసింహ) మరణిస్తాడు. దాంతో స్నేహితుల్లో కొందరు తలో దారికి వెళిపోతారు. ఆ స్నేహితులంతా జాతరలో కలిశారా? కులాలను అడ్డుపెట్టుకుని పన్నెండేళ్ల క్రితం జరిగిన గొడవను ఎప్పటికప్పుడు రగిలిస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం పరితపించే ఊరి జనాలు ఎవరు? ప్రస్తుత ప్రెసిడెంట్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్) పాత్ర ఏమిటి? ఈసారి జాతరను 11 మంది కమిటీ కుర్రోళ్లు ఎలా చేశారు అన్నది కథ.
విశ్లేషణ: పురుషోత్తమ పల్లి అనే గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే జాతర నేపథ్యంలో సాగే కథ ఇది. దానికి 11 మంది చిన్ననాటి స్నేహితులు, ప్రేమ, రాజకీయం ఇలు పలు అంశాలను మిళితం చేసి దర్శకుడు యదువంశీ తెరకెక్కించారు. ఫస్టాఫ్ పాత్రల పరిచయం, వారి చిన్నతనం, అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సాగింది. ఇంటర్వెల్ సమయానికి 11 మంది మిత్రుల్లో చిన్న కలహం అది ప్రాణాలు తీసేవరకూ వరకూ వెళ్లడం ఒక ట్విస్ట్‌లాగా ఇచ్చారు. పాత్రల పరిచయం, చిన్నప్పటి విషయాలు చెప్పడం కాస్త సాగదీతగా అనిపించినా స్నేహం విూద ఒక పాట, సంగీతం ఆ భావనను దూరం చేశాయి. 90ల్లో గ్రావిూణ ప్రాంతాల జీవలశైలి కులమతాలకు అతీతంగా స్నేహితుల మధ్య మైత్రీ, అప్పటి ఆటలు, ప్రేమకథలు, భావోద్వేగాలను దర్శకుడు తన అనుభవం పరంగా హృద్యంగా, వినోదాత్మకంగా చెప్పాడు. ఫోన్‌లు సోషల్ విూడియా లేని సమయంలో పిల్లల జీవితం ఎలా ఉండేదో చక్కగా ఆవిష్కరించారు. సరదాగా సాగుతున్న స్నేహితుల మధ్య కులం కారణంగా చిన్నపాటి ఘర్షణ, అప్పటిదాకా కులమతాలకు అతీతంగా మెలిగిన స్నేహితులు, ఒక్కసారిగా దూరం కావడం, సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే బుజ్జి ఆ గొడవను రాజకీయ స్వార్దానికి ఎలా వాడుకున్నాడు? జాతరలో విషాదం ఇవన్నీ కూడా ఉత్కంఠగా సాగుతాయి. 11 మంది మిత్రుల్లో చిన్నవాడైన నరసింహ అలియాస్ ఆత్రం మరణం గుండెల్ని కదిలిస్తుంది. కుర్రోళ్లు అంతా కమిటీగా ఏర్పడటం, జాతర ఘనంగా జరిపించడం వంటి సన్నివేశాలు బాగానే ఉంటాయి. తదుపరి సర్పంచ్ ఎన్నికల సన్నివేశాలు గత ఎన్నికలను తలపిస్తాయి. ’గెలవాలనే ఆశ... ఓడిపోతామనే భయం లేనోడు నిజమైన నాయకుడు, ఓడిపోయి కూడా జనాల్లో ఉండి సేవ చేయొచ్చు‘ అని శివ చెప్పే డైలాగ్‌లు జనసేన ప్రస్థానాన్ని గుర్తు చేస్తాయి. ఇందులో నటులు 11 మంది బాగా నటించారు. శివ, సుబ్బు, విలియం, బ్రిటీష్, కిశోర్, సూర్య ఇలా ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇచ్చారు. శివ, సుబ్బు, విలియం, సూర్య పాత్రలు బాగా రిజిస్టర్ అయ్యాయి. ఎమోషన్స్ బాగా పండిరచారు. సాయి కుమార్, గోపరాజు రమణల అనుభవం సినిమాకు ఉపయోగపడిరది. ’కేరాఫ్ కంచరపాలెం’ కిశోర్, శ్రీలక్ష్మి సెకెండాఫ్‌లో కంటతడి
పెట్టిస్తారు. యూట్యూబ్ సిరీస్‌లతో ఫేమస్ అయిన ప్రసాద్ బెహరా పెద్దోడు పాత్రతో మెప్పించారు. యూట్యూబ్‌లో కామెడీ టైమింగ్‌తో అలరించిన అతను ఎమోషన్స్ పండిరచగలడని, అతనిలో కమెడీయన్ మాత్రమే కాదు. మంచి నటుడు ఉన్నాడని నిరూపించాడు. మిగతా ఆర్టిస్ట్‌లు అంతా పరిధి మేర నటించారు. నిర్మాతగా నిహారిక ఖర్చు చేసిన ప్రతి రూపాయి తెరపై కనిపించింది. వింటేజ్ లుక్ లో చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు.
ఇంకా చదవండి: 'సింబా' మూవీ రివ్యూ: సరదాగా చూసేయండి!
# CommitteeKurrollu # NiharikaKonidela # YadhuVamsi