మెకానిక్ రాకీ మూవీ రివ్యూ : మాస్ షో!

మెకానిక్ రాకీ మూవీ రివ్యూ : మాస్ షో!

1 month ago | 5 Views

(చిత్రం:  మెకానిక్ రాకీ,

విడుదల : నవంబర్ 22, 2024,

రేటింగ్ :2.75/5, 

నటీనటులు : విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేష్, హర్ష వర్ధన్, ఆది, హర్ష చెముడు.

దర్శకత్వం : రవితేజ ముళ్ళపూడి,

నిర్మాత : రామ్ తళ్లూరి,

సంగీతం  : జేక్స్ బిజోయ్,

ఎడిటింగ్ : అన్వర్ అలీ,

సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి)

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'మెకానిక్ రాకీ'.  మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ లు ఫీమేల్ లీడ్ పోషించారు.  దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించిన చిత్రం నేడు (నవంబర్ 22, 2024) విడుదలయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో  తెలుసుకుందాం... 

కథ: పక్కా మాస్ కుర్రాడు రాకీ(విశ్వక్ సేన్).  తన తండ్రి(నరేష్) పెట్టిన మెకానిక్ గ్యారేజ్ లోనే వర్క్ చేసుకుంటుంటాడు.  తాను ఊహించని రీతిలో తన లైఫ్ లో జరిగిన ట్రాజడీ ఫలితంగా ఎన్నో  ఇబ్బందులు ఎదుర్కొంటాడు.  ఓ పక్క రంకిరెడ్డి (సునీల్) వల్ల వచ్చిన సమస్య ఏంటి? ఇది కాకుండా తాను ఎదుర్కొన్న మరో సమస్య ఏంటి? ఈ క్రమంలో ప్రియా(మీనాక్షి చౌదరి) అలాగే మాయా(శ్రద్ధా శ్రీనాథ్) ల పాత్రలు ఏంటి? రాకీ ఎలా తన సమస్యలు ఎలా పరిష్కరించుకున్నాడు అనేది సినిమా కథ.  

విశ్లేషణ: దర్శకుడు రవితేజ ముళ్ళపూడి ఈ చిత్రానికి మంచి వర్క్ అందించారు. మెయిన్ గా సెకండాఫ్ ని డీల్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. రేసి స్క్రీన్ ప్లే, క్రేజీ ట్విస్ట్ లు ఆడియెన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి. కానీ ఈ ఫ్లో లోకి సినిమాని తీసుకురావడానికి ఫస్టాఫ్ ని సాగదీతగా లాగినట్టుగా అనిపిస్తుంది. ఇంకా పలు ఎమోషన్స్ ని కూడా తాను బాగా హ్యాండిల్ చేశారు.  సాలిడ్ లైన్ ఉన్నప్పటికీ దీనిని కొన్ని అనవసర సన్నివేశాలు పాటలతో ల్యాగ్ చేసారనిపించింది. ఫస్టాఫ్ అయితే చాలా పేలవంగా అనిపిస్తుంది. అక్కడక్కడా ఒకటీ రెండు సన్నివేశాలు అయితే ఆడియెన్స్ ముందే ఊహించగలిగేలా అనిపిస్తాయి.  విశ్వక్ పై కొన్ని కామెడీ సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. ఈ చిత్రంలో విషయంలో మేకర్స్ చాలా విషయాన్ని ముందే రివీల్ చేయకుండా చేసిన పని థియేటర్స్ లో ఆడియెన్స్ ని థ్రిల్ చేస్తుంది అని చెప్పాలి. టీజర్, ట్రైలర్ లని చాలా సాదా సీదా మాస్ డ్రామాగా కట్ చేశారు కానీ వాటిని చూసి తక్కువ అంచనాలు పెట్టుకునేవారిని ఈ చిత్రం ఇంప్రెస్ చేస్తుందనడంలో డౌట్ లేదు. దీనితో విశ్వక్ తన స్క్రిప్ట్ సెలక్షన్ లో సాలిడ్ గా ఉంటాడు అని మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పాలి. సెకండాఫ్ మొత్తం సాలిడ్ హైలైట్ అని చెప్పాలి. క్రేజీ ట్విస్ట్ లు టర్న్ లతో మంచి కామెడీతో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో వెళుతుంది. అలాగే విశ్వక్ సేన్ మరోసారి తన మార్క్ మాస్ షేడ్ తో దుమ్ము లేపాడని చెప్పాలి. మంచి ఎమోషన్స్ తో పాటుగా పలు సీన్స్, వేరియేషన్స్ ని చూపించి తన ఫ్యాన్స్ కి మాస్ ఆడియెన్స్ కి కిక్ ఇస్తాడు. మెయిన్ లీడ్ నటీనటులు అంతా వారి పాత్రలు సినిమాలో ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడం అని చెప్పాలి.  మీనాక్షి చౌదరి డీసెంట్ రోల్ లో కనిపించి మంచి ఎమోషన్స్ తో ఆకట్టుకుంది. కానీ శ్రద్దా శ్రీనాథ్ మాత్రం తన రోల్ తో ఇంప్రెస్ చేస్తుంది.  ఈ సినిమాలో  '35' ఫేమ్ నటుడు విశ్వదేవ్ రాచకొండ మంచి రోల్ ని చేసాడు. అలాగే వీటితో పాటుగా సినిమాలో కనిపించే సోషల్ మెసేజ్, దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం సినిమాలో మెప్పిస్తాయని చెప్పాలి. అలాగే వారితో పాటుగా హర్షవర్ధన్, వైవా హర్ష తదితరులు తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పిస్తారు. మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మెకానిక్ రాకీ” లో మంచి థ్రిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే విశ్వక్ సేన్ మరోసారి తన మాస్ షోతో అదరగొట్టాడు,  ముఖ్యంగా సెకండాఫ్  మెప్పిస్తుంది. అయితే ఇదే తరహాలో ఫస్టాఫ్ కూడా ఉండి ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈ చిత్రం మరింత బెటర్ గా థ్రిల్ చేసి ఉండేది. 

సాంకేతిక వర్గం: మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని షాట్స్ లో మంచి ఫ్రేమ్స్ ని  చూపించాడు. సినిమా సెటప్ అంతా నీట్ గా ఉంది. అలాగే జేక్స్ బిజోయ్ సాంగ్స్, బ్యాగ్రౌండ్  స్కోర్ లు బాగున్నాయి. అన్వర్ అలీ ఎడిటింగ్ ఫర్వాలేదు. చిత్రం నిర్మాణ విలువలు  సినిమా స్థాయికి  తగ్గట్టుగానే ఉన్నాయి.

ఇంకా చదవండి: కంగువ మూవీ రివ్యూ : ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# మెకానిక్ రాకీ     # విశ్వక్ సేన్     # మీనాక్షి చౌదరి     # శ్రద్ధా శ్రీనాథ్     # సునీల్    

trending

View More