కంగువ మూవీ రివ్యూ :  ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్!

కంగువ మూవీ రివ్యూ : ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్!

1 month ago | 5 Views

(చిత్రం : కంగువా,

విడుదల :  నవంబర్ 14, 2024,

రేటింగ్ : 3/5,

నటీనటులు : సూర్య, బాబీ డియోల్, దిశా పటానీ, నటరాజన్ సుబ్రమణ్యం, కె.ఎస్ రవికుమార్, యోగి బాబు, కోవై సరళ, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు.

దర్శకుడు : శివ,   

నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా-వంశీ, ప్రమోద్, 

సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్,

సినిమాటోగ్రఫీ : వెట్రి పళనిస్వామి,

ఎడిటింగ్ : నిషాద్ యూసుఫ్, 

యాక్షన్: సుప్రీమ్ సుందర్, 

డైలాగ్స్: మదన్ కార్కే

కథ: శివ, ఆది నారాయణ,

పాటలు: వివేక్, మదన్ కార్కే,

కాస్ట్యూమ్ డిజైనర్: అను వర్థన్, దష్ట పిల్లై,

కాస్ట్యూమ్స్: రాజన్ కొరియోగ్రఫీ: శోభి,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏ జే రాజాఇ, 

కో ప్రొడ్యూసర్: నేహా జ్ఞానవేల్ రాజా )

తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా ఈ గురువారం (నవంబర్ 14, 2024)  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా  ఎంతమేరకు మెప్పించిందో  తెలుసుకుందాం!

కథ : ఫ్రాన్సిస్ (సూర్య) బౌంటీ హంటర్ (కిరాయికి ఏపనైనా చేసేవాడు). ఇతడికి మరో బౌంటీ హంటర్ ఎంజెల్‌ (దిశా పటానీ)తో బ్రేకప్ జరుగుతుంది. అయితే డబ్బు కోసం తాము ఒప్పుకొన్న పనులు చేసే క్రమంలో ఇద్దరు గొడవ పడుతుంటారు. అలాంటి సమయంలో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జెటా అనే అబ్బాయిని ఫ్రాన్సిస్ కలుస్తాడు. అయితే జెటాను ఓ ముఠా సభ్యులు వెంటాడుతుంటారు.  జెటాను కాపాడేందుకు ఫ్రాన్సిస్ తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేస్తుంటాడు.   ఫ్రాన్సిస్‌ను మాత్రం ఆరాధ్యపూర్వకంగా చూస్తుంటాడు.  ఫ్రాన్సిస్‌కు జెటాకు ఉన్న పునర్జన్మ బంధం ఏమిటి? ఎలాంటి బంధం లేకున్నా ఫ్రాన్సిస్‌ ఎందుకు జెటాను కాపాడాలని అనుకొంటారు. అయితే ఎంతకు కంగువ ఎవరు? జెటాకు కంగువకు ఉన్న రిలేషన్ ఏమిటి? ప్రణవాది కోన, కపాల కోన, అరణ్య కోన, హిమ కోన, సాగర కోన మధ్య జాతి పోరాటం ఏమిటి? ప్రణవాది కోనకు చెందిన కంగువాకు కపాల కోనకు చెందిన రుధిర నేత్ర (బాబీ డియోల్‌) వైరం ఏమిటి? ఐదు కోనల మధ్య రుమేనియా ఎందుకు చిచ్చు పెట్టానుకొన్నది. కంగువకు రుధిర వర్గాల జాతి, ప్రాంత ఆధిపత్య పోరాటం ఎందుకు వచ్చింది? కపాల కోన జాతిపై కంగువ ఎలాంటి ప్రతీకారం తీర్చుకొన్నాడు? పులమాను కంగువ ఎందుకు ప్రాణాలకు తెగించి రక్షించాలని అనుకొన్నాడు?  గోవాలో అనుకోకుండా ఫ్రాన్సిస్‌ కి కలిసిన ఆ బాబు ఎవరు ?, ఆ బాబుకి, ఫ్రాన్సిస్‌కి ఏదో బంధం ఉందని అతనికి ఏవో జ్ఞాపకాలు వస్తుంటాయి. ఆ బంధం గత జన్మదని అతనికి గుర్తు వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కొన్ని.. వందల ఏళ్ల కిందట జరిగిన ఆ కథలో కంగువా ఎవరు ?, అతను తన జాతి బాగు కోసం ఏం చేశాడు ?, కంగువా తెగకి, మిగిలిన తెగల మధ్య జరిగిన యుద్ధం ఏమిటి ?, ఈ క్రమంలో కంగువా చేసే పోరాటాలు ఏమిటి ?, చివరకు ఈ జన్మలో ఫ్రాన్సిస్ గా పుట్టిన కంగువా ఏం సాధించాడు ?  అనే ప్రశ్నలకు సమాధానమే కంగువ సినిమా కథ. 

విశ్లేషణ: ఈ ‘కంగువా’లో బరువైన ఎమోషన్స్, భారీ విజువల్స్ ఉన్నా.. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు.  ‘కంగువా’ కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో(ముఖ్యంగా కంగువా క్లైమాక్స్ లో) మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు శివ, మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తను అనుకున్న ఎమోషనల్ డ్రామానే ఎలివేట్ చేయడానికి ఆసక్తి చూపారు. అలాగే సినిమాపై ఉన్న హైప్‌ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. ఇక దిశా పటానీ – సూర్య పాత్రల మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. 'కంగువ' సినిమా ప్రస్తుతం కాలమానంలో ఫ్రాన్సిస్.. 1070 సంవత్సరంలో కంగువ పోరాటం నేపథ్యంగా సమాంతరంగా కథ నడుస్తుంటుంది. దర్శకుడు కథకు మంచి బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకొన్నాడు. కానీ పాత్రల చిత్రీకరణ, సన్నివేశాలు ఈ జనరేషన్ ఆడియెన్స్ నచ్చే విధంగా సులభంగా అర్దమయ్యేలా, సరళీకృతంగా స్టోరీ నేరేషన్ చెప్పి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక మితీమీరిన యాక్షన్, అరిచి గోల పెట్టే డైలాగ్స్ కొంత వరకు భరించవచ్చేమో కానీ.. సినిమా మొదలైన తొలి సన్నివేశం నుంచి చివరి సీన్ వరకు అదే విధంగా ఉండటం భరించలేని విషయం. అయితే సూర్య, బాబీ డియోల్ పాత్రల వరకు ఓకేలా ఉంటాయి. మరో పాత్ర ఈ కథలో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా కనిపించకపోవడం మైనస్‌గా మారింది. పీరియాడిక్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘కంగువా’.. యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ తోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య పవర్ ఫుల్ నటన, క్లైమాక్స్ లో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ మరియు సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం బాగున్నాయి. కానీ, రొటీన్ స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, సూర్య తన నటనతో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్ గా ఈ చిత్రం సూర్య అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ ను  అలరిస్తుంది.

నటీనటలు విషయానికి వస్తే..ఎప్పటిలానే హీరో  సూర్య  తన నటన, ఫెర్ఫార్మెన్స్‌తో విశేషంగా ఆకట్టుకొన్నాడు. ఫ్రాన్సిస్, కంగువగా ఈ సినిమాలో రెండు పాత్రల్లో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లు, ఎమోషన్ సీన్లను బాగా పండించాడు. కంగువా, ఫ్రాన్సిస్ పాత్రల్లో సూర్య ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. ద్విపాత్రాభినయంలో సూర్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. తన జాతి కోసం, ఇచ్చిన మాట కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిగా సూర్య నటించిన విధానం, నిజంగా చాలా బాగుంది. సూర్య నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’తో సాగింది. ఇక దిశా పటానీ కేవలం గ్లామర్‌కే పరిమితమైంది.  తన పాత్రకున్న పరిధిమేరకు నటించి  న్యాయం చేసింది. గ్లామర్ లుక్స్ లో ఆమె యూత్ ని ఆకట్టుకుంది. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్ కూడా తన పాత్రలో జీవించాడు. బాబీ డియోల్ పాత్రలోని డెప్త్ ఆకట్టుకుంది. సూర్య పాత్రకు ధీటుగా ఆయన పాత్రను దర్శకుడు శివ తీర్చిదిద్దారు. బాబీ డియోల్ మరోసారి క్రూరమైన విలన్‌గా ఆకట్టుకొన్నాడు. అంతా సూర్యనే ఉండటం వల్ల ఆ షాడోలో బాబీ డియోల్ క్యారెక్టర్ పెద్దగా ఎలివేట్ కాలేకపోయిందనిపిస్తుంది. నటరాజన్ సుబ్రమణ్యం కూడా చాలా బాగా నటించాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. అదేవిధంగా అతిథి పాత్రలో మెరిసిన కార్తీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. క్లైమాక్స్‌లో అండ్ ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సముద్రపు యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా బాగున్నాయి. అలాగే ఆ చిన్న బాబుకి – సూర్యకి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన కె.ఎస్. రవికుమార్, యోగి బాబు, కోవై సరళ, మన్సూర్ అలీ ఖాన్ ఆకట్టుకున్నారు.ఇద్దరు బాలనటులు కథకు బలమైన పాత్రలుగా నిలిచాయి. మిగతా పాత్రల్లో నటించిన వారందరూ  ఫర్వాలేదనిపించారు. 

సాంకేతిక విభాగం : ఈ సినిమాలో   సినిమాటోగ్రాఫర్‌ వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా ఆయన అద్భుతంగా చిత్రీకరించారు. నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు బాగానే ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల ఆకట్టుకుంటుంది.  శివ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి న్యాయం చేశారు. ఈ  సినిమాకు అత్యంత బలం సాంకేతిక నిపుణుల పనితీరు. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ పాజిటివ్ అంశాలుగా ఉన్నాయి. అయితే కొన్నిసార్లు దేవీ శ్రీ ప్రసాద్ సన్నివేశాలకు అవసరానికి మించి మోత మోగించాడనిపించింది.  పళనిస్వామి సినిమాటోగ్రఫి ఈ సినిమాను మరింత రిచ్‌గా మార్చింది. అందమైన లోకేషన్లు ఈ సినిమాను అందంగా మార్చింది.  జ్ఞానవేల్ రాజా నిర్మాణ సారథ్యంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.  సూర్య, బాబీ డియోల్, సాంకేతిక విభాగాల పనితీరు, దర్శకుడు శివ టేకింగ్‌ బలంగా మారిన చిత్రం కంగువ. జాతి, ప్రాంతాల మధ్య ఆధిపత్య పోరాటం కథగా ఈ సినిమాను బడ్జెట్‌తో గ్రాండ్‌గా తీశారు. కానీ సామాన్య ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అంశాలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్. నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ రాజా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.  నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి.  చివరగా చెప్పొచ్చేదేమిటంటే.. ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ పొందాలనుకొనే వాళ్లు  ఈ చిత్రాన్ని చూడొచ్చు. .

ఇంకా చదవండి: ‘రహస్యం ఇదం జగత్’ మూవీ రివ్యూ : సాదాసీదా సైన్స్‌ ఫిక్షన్‌ !

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# కంగువ     # సూర్య     # దిశా పటాని     # యోగి బాబు     # బాబీ డియోల్    

trending

View More