జితేందర్ రెడ్డి మూవీ రివ్యూ :   ట్రాక్ తప్పింది!

జితేందర్ రెడ్డి మూవీ రివ్యూ : ట్రాక్ తప్పింది!

1 month ago | 5 Views

(చిత్రం: జితేందర్ రెడ్డి

విడుదల : నవంబర్ 08, 2024, 

రేటింగ్ : 2/5,

నటీనటులు : రాకేష్ వర్రే, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాశ్ తదితరులు. 

డైరెక్టర్ : విరించి వర్మ,

ఎడిటింగ్ : రామకృష్ణ అర్రం,

సినిమాటోగ్రఫీ : వి. ఎస్. జ్ఞాన శేఖర్,

మ్యూజిక్ : గోపీ సుందర్,

ప్రొడ్యూసర్ : ముదుగంటి రవీందర్ రెడ్డి) 

బయోపిక్ చిత్రాలకు టాలీవుడ్‌లో  మంచి ఆదరణ లభిస్తుంది. చాలా మంది పొలిటికల్ లీడర్స్, సినిమా యాక్టర్స్‌పై బయోపిక్ చిత్రాలు వచ్చాయి. అయితే, ఓ స్వయంసేవకుడి జీవితకథను ‘జితేందర్ రెడ్డి’ అనే బయోపిక్‌గా తెరకెక్కించాడు దర్శకుడు విరించి వర్మ. టీజర్, ట్రైలర్స్‌తో ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ బయోపిక్ మూవీ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో తెలుసుకుందాం.. 

కథ:  ఉమ్మడి కరీంనగర్‌లోని జగిత్యాలలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులుగా జితేందర్ రెడ్డి కుటుంబం ముందు నుండీ దేశం కోసం, ధర్మం కోసం నిలబడుతుంది. 1980 సమయంలో కథ సాగుతుంది.  జితేందర్ రెడ్డి(రాకేష్ వర్రే) కూడా చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగి ఉంటాడు. ఈ ప్రభావం అతడి కాలేజీ సమయంలో మరింతగా పెరుగుతుంది. ధర్మం కోసం, ప్రజలకు న్యాయం చేయాలని పరితపిస్తుంటాడు. అయితే, పేదలను పీడిస్తున్న నక్సల్స్.. వారు చేస్తున్న అన్యాయాలను ఎదురించాలని జితేందర్ రెడ్డి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తాడు. మరి జితేందర్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడా..? అతడికి రాజకీయంగా ఎలాంటి ప్రత్యర్థులు ఉన్నారు..? జితేందర్ రెడ్డి వ్యవహారంలో నక్సల్స్ ఏం చేశారు..? అనేది మిగతా సినిమా కథ.

విశేషణ:  దర్శకుడు విరించి వర్మ తీసుకున్న కథలో బలం ఉన్నా, ఆయన దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలో పొరబాట్లు కనిపించాయి. స్క్రీన్‌ప్లే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. కథను నెరేట్ చేసే విధానం కూడా ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది.  ‘జితేందర్ రెడ్డి’ బయోపిక్ మూవీలో కథ బలంగా ఉన్నా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే లేకపోవడంతో ఈ సినిమా ట్రాక్ తప్పినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ సాగదీసినట్లుగా అనిపించడం.. సంగీతం పెద్దగా ప్రభావం చూపకపోవడం లాంటి అంశాల వల్ల ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమా రొటీన్ బయోపిక్‌గా మిగిలిపోయింది.   ‘జితేందర్ రెడ్డి’ వంటి పవర్‌ఫుల్ బయోపిక్‌కు కావాల్సిన కథ ఉన్నా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం మైనస్ అని చెప్పాలి. ఈ సినిమాలో ఎమోషన్‌కు మంచి స్కోప్ ఉన్నా, దానిని పూర్తిగా వినియోగించు కోలేకపోయారు. హీరో నుండి కేవలం సెటిల్డ్ పర్ఫార్మెన్స్ రాబట్టేందుకే చిత్ర యూనిట్ ప్రయత్నించడంతో, అతడిలోని యాక్టర్‌ని పూర్తిగా వినియోగించలేకపోయారు. ఇక కథను నెరేట్ చేసే విధానంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. సినిమా ఫస్టాఫ్‌లో ల్యాగ్ సీన్స్, అనవసరమైన సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతాయి. అటు మ్యూజిక్ పరంగానూ సాంగ్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. కేవలం బీజీఎం వరకే ఆకట్టుకుంది. గోపీ సుందర్ మార్క్ సాంగ్స్ ఎక్కడా కనిపించవు. సినిమాలోని చాలా సీన్స్‌లో డబ్బింగ్ వర్క్ వీక్‌గా కనిపిస్తుంది. ‘జితేందర్ రెడ్డి’ బయోపిక్ చిత్రం ఓ ప్యూర్ అటెంప్ట్ అని చెప్పాలి. వాస్తవిక ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపెట్టారు. ఈ సినిమాలో బడుగు, బలహీనవర్గాల ప్రజలను పీడిస్తున్న నక్సల్స్‌ను ఎదుర్కొనేందుకు.. ధర్మం కోసం, జాతీయవాదం కోసం పోరాడే వ్యక్తిగా జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కథలో మంచి బలం ఉంది. కానీ, ఈ కథను ఇంకాస్త పవర్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. హీరోకు ఎదురయ్యే పరిస్థితులు అతడిలోని మంచిని ప్రేరేపించేలా కథను ముందుకు తీసుకెళ్లారు. ఓ కాలేజీ కుర్రోడిగా.. జాతీయభావం కలిగిన వ్యక్తిగా హీరో పాత్రను హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. రాజకీయ ప్రవేశం కోసం హీరో చేసే ప్రయత్నాలు.. ప్రజలకు అతడు ఇచ్చే ధీమా బాగా చూపెట్టారు. సినిమాల్లో కామ్రేడ్స్‌ని ఎప్పుడూ హీరోలుగా చూపెట్టారు. కానీ, ఇందులో వారిలోని చీకటి కోణాలను బహిర్గతం చేశారు. ఇలాంటివి చూపెట్టాలంటే నిజంగా గట్స్ ఉండాలి. ఈ విషయంలో చిత్ర యూనిట్‌ని అభినందించాలి. నక్సల్స్‌పై హీరో చేసే పోరాటాన్ని బాగా ప్రెజెంట్ చేశారు. సెకండాఫ్‌లో సినిమా కథ బాగున్నా.. దాన్ని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు మిస్‌ఫైర్ అయ్యాడు. హీరోకు లవ్ ట్రాక్ పెట్టాలని చూసినా, అది పెద్దగా వర్కవుట్ కాదు. దీంతో హీరోయిన్ పాత్రకు ఎలాంటి న్యాయం లేకుండా పోతుంది. హీరో స్నేహితుల పాత్రలకు ఇంకాస్త ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండాల్సింది. నక్సల్స్ బ్యాక్‌డ్రాప్ బాగున్నా, నటీనటుల విషయంలో జాగ్రత్త పడాల్సింది. కవలం ఛత్రపతి శేఖర్ తప్ప నక్సల్స్‌లో గుర్తుపట్టే పాత్ర ఎవరిదీ కనిపించదు. ఇక క్లైమాక్స్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ ఉన్నా, కథను నడిపించిన మెయిన్ క్యారెక్టర్ చేసిందేమిటనే పాయింట్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. 

సాంకేతిక విభాగం:  సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. 1980ల పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపెట్టారు. గోపీసుందర్ మ్యూజిక్ అంతగా మెప్పించదు. సాంగ్స్ ఇంప్రెస్ చేయకపోయినా, బీజీఎం వరకు బాగుంది. ఎడిటింగ్ వర్క్‌పై ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి.

ఇంకా చదవండి: మూవీ రివ్యూ : లవ్ థ్రిల్లర్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# జితేందర్ రెడ్డి     # రాకేష్ వర్రే     # రియా సుమన్    

trending

View More