హైడ్ న్ సిక్ మూవీ రివ్యూ: ఉక్కిరి బిక్కిరి చేసే సస్పెన్స్ థ్రిల్లర్!
3 months ago | 58 Views
(చిత్రం : హైడ్ న్ సిక్, విడుదల: 20-09-2024, రేటింగ్: 3/5, నటీనటులు : నటీనటులు: విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్, శ్రీధర్ తదితరులు. బ్యానర్: సహస్ర ఎంటర్ టైన్మెంట్స్, సమర్పణ: ఎంఎన్ఓపీ, సంగీత దర్శకుడు: లిజో కె జోష్, సినిమాటోగ్రఫీ : చిన్న రామ్, ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల, పాటలు : సుద్దాల అశోక్ తేజ, ఆర్ట్ : నిఖిల్ హస్సన్, పీఆర్ఓ: హరీష్-దినేష్, నిర్మాత: నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, దర్శకత్వం: బసిరెడ్డి రానా)
బసిరెడ్డి రానా దర్శకత్వంలో సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో.. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించిన తాజా చిత్రం 'హైడ్ న్ సిక్'. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రచారచిత్రాలు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. కేరింత, మనవంతా వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసులను దోచుకున్న యువ హీరో విశ్వంత్ ఈ చిత్రానికి కథానాయకుడు కావడంతో సినిమాపై మరింత ఆసక్తి కలిగింది. యంగ్ హీరో విశ్వంత్ నటిస్తున్న చిత్రం అంటే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకంతో 'హైడ్ న్ సిక్' చిత్రంపై ప్రేక్షకులు అంచనాలు పెంచుకున్నారు. ఈ శుక్రవారం (20-09-2024) థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో తెలుసుకుందాం...
కథ: ఈ చిత్రం కథ కర్నూల్ నేపథ్యంలో సాగుతుంది. శివ (విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెడిసిన్ చదువుతూ.. తన అక్కతో కలిసి ఉంటాడు. తన తండ్రి, బావ ఆర్మీలో పనిచేసి వీరమరణం పొందారు కాబట్టి అతడు ఆర్మీకి వెళ్లడం శివ అక్కకు ఇష్టం ఉండదు. తనతో పాటు కాలేజీలో చదువుతున్న వర్ష(రియా సచ్దేవ్)తో శివ ప్రేమలో ఉంటాడు. వీరి పెళ్లికి వర్ష తండ్రి కేకే కూడా ఒప్పుకున్నారు అని సంతోషపడతారు. కేకే మెంటల్ హెల్త్ హాస్పటల్ స్థాపించి రోగులకు నయం చేస్తుంటాడు. అయితే సిటీలో ఒక డెలివరీ బాయ్ ని ఒకతను ఏ కారణం లేకుండా రాడ్ తో కొట్టి చంపేస్తాడు. అది యాక్సిడెంట్ కేసు అని క్లోజ్ చేస్తారు పోలీసులు. అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని ఎవరో పోలీస్ స్టేషన్ కు లెటర్ పంపిస్తారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న వైష్ణవి (శిల్పా మంజునాథ్) దాన్ని సిరీయస్‌గా తీసుకోదు. ఈ సమయంలో శివ ఫ్రెండ్ చందు సుసైడ్ చేసుకుంటాడు. ముందు అందరూ దాన్ని సుసైడ్ అనుకుంటారు కానీ శివ మాత్రం అది మర్డర్ అని నమ్ముతాడు. కట్ చేస్తే మీడియాకు అది సూసైడ్ కాదు మర్డర్ అని శివ లెటర్ పంపిస్తాడు. దాంతో ఆ కేసు మీడియాలో సంచలనంగా మారుతుంది. పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు. ఆ తరువాత ఈ కేసులో శివను ఫ్రేమ్ చేస్తారు. దాంతో శివ మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. శివను ఎందుకు కార్నర్ చేశారు. ఎవరు చేశారు. ఈ వరుస మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి. కేకేకు ఈ మర్డర్లకు సంబంధం ఏంటి? పోలీసు ఆఫీసర్ వైష్ణవి ఈ కేసును ఎలా డీల్ చేసింది. ఈ కేసులో శివ పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ: సినిమా కథ, కథనం, బీజీఎమ్, ఫస్ట్ ఆఫ్ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.
నాలుగు ఫైట్లు ఐదు పాటలు ఉండే రెగ్యులర్ సినిమా కాదు 'హైడ్ న్ సిక్'. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని ఉక్కిరి బిక్కిరి చేసే సస్పెన్స్ థ్రిల్లర్. పిల్లలు చాలా మంది మొబైల్ గేమ్స్ కు అలవాటు పడుతున్నారు. ఆ మధ్య బ్లూవేల్ గేమ్ అని బాగా ట్రెండ్ అయింది. అలాంటి ఒక గేమ్ పిల్లలనే కాదు యువకులను కూడా ఎలా బానిసలుగా చేసి వారి జీవితాలతో ఎలా ఆడుకుంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. మొదటి మర్డర్ నుంచి ఇంటర్వెల్ వరకు స్క్రీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహకు అందనట్లుగా చాలా క్రియేటీవ్ గా తెరకెక్కించారు. అసలు మర్డర్ల వెనుక ఎవరు ఉన్నారు అనేది ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్. అయితే ఈ మర్డర్లను ఎవరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనే విషయాలతో పాటు ఏ పద్దతిలో చేస్తున్నారు. అనేది పూరాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ చెప్పే విధానం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రతీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ క్షణ క్షణం ఉత్కంఠకు గురిచేస్తుంది. మారణహోమం జరిగితే ఏంటి పరిస్థితి అనే ఆలోచనకు ప్రేక్షకుడిని తీసుకెళ్లి భయపెట్టిస్తుంది. తరువాత మర్డర్ ఎక్కడ ఎలా చేయబోతున్నారు అనే విషయాన్ని కనుగోనే పద్దతి మెప్పించింది. ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి ఈ చిత్రంలో. ప్రీ క్లైమాక్స్ తరువాత మళ్లీ సినిమా వేగం పెరుగుతుంది. అయితే ముందే చెప్పుకున్నట్లు ఇది రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాల లాగా ఉండదు. క్లైమాక్స్ కూడా చాలా స్మూత్ గా హ్యండిల్ చేశారు. ఎక్కడ పెద్ద రక్తపాతాలను చూపించలేదు.
ఎవరెలా చేశారంటే: హీరో విశ్వంత్ ఇన్ని రోజులు లవర్ బాయ్ క్యారెక్టర్లో అలరించి పేరుతెచ్చుకున్నారు. ఈ హైడ్ న్ సిక్ చిత్రంలో ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించారు. తన నటనతో అందరి మెప్పును పొందారు. బాధ్యతగల తమ్ముడిగా, స్టూడెంట్ గా ఫ్రెండ్ కేసును సాల్వ్ చేసే ఇన్వెస్టిగేటర్ గా విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో అవలీలగా నటించి ప్రేక్షకుల చేత వాహ్... అనిపించుకున్నారు. విశ్వంత్ తరువాత పోలీసు క్యారెక్టర్ చేసిన శిల్పా మంజునాథ్ మంచి నటనను కనబరిచింది. ఆఫీసర్ గా తన లుక్స్ చాలా బాగున్నాయి. ఆమె పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తన ఫేస్ లో సీరియస్ నెస్ ను మెయింటైన్ చేస్తూనే ఒక సీన్లో ఎమోషనల్ సీన్ అద్భుతంగా పండించింది. అలాగే ఇందులో కేకే క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టుకు తక్కువ స్పేస్ ఉంది కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న పాత్ర. ఉన్నంతలో మెప్పించారు. అలాగే మిగితా ఆర్టిస్టుల అంతా వారి వారి పాత్రల పరిధి మేరకు నటించి ఆయా పాత్రలకు ప్రాణం పోశారు.
టెక్నీకల్ విషయాలకొస్తే... డైరెక్టర్ బసిరెడ్డి రానా రాసుకున్న కథను చాలా గ్రిప్పింగ్ తీశారు. చేసింది మొదటి సినిమా అయినా చాలా బాగా తెరకెక్కించారు. . ముఖ్యంగా సస్పెన్స్ సీన్లను చాలా బాగా హ్యండిల్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం ఉంది. ఫస్ట్ అవుట్ పుట్ అయినా అద్భుతంగా ఇచ్చారు. ఆయన రాసుకున్న కథ చాలా బాగుంది. ఇక ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు ప్రాణం పోసింది మ్యూజిక్. మ్యూజిక్ డైరెక్టర్ లిజో కె జోష్ ఇచ్చిన మ్యూజిక్ సస్పెన్స్ సీన్లలో నరాలు తెగేలా ఇచ్చారు. ఇక సినిమాటో గ్రాఫర్ చిన్న రామ్ తనకు ఉన్నంతలో బాగాచేశారు. ఎడిటర్ ఫర్వాలేదు. అలాగే నిర్మాణ విలువలు కథకు తగ్గట్టే ఉన్నాయి.
ఇంకా చదవండి: 'మత్తువదలరా-2' మూవీ రివ్యూ: మర్డర్ కేసు ఛేదన!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# HideNSeek # Sivaji # NaveenMedaram