ధనుష్'రాయన్' మూవీ రివ్యూ : మెప్పించే రివేంజ్ డ్రామా !
3 months ago | 75 Views
(చిత్రం : 'రాయన్' , రేటింగ్ : 3/5, నటీనటులు: ధనుష్, ఎస్.జె. సూర్య, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దసరా విజయన్, అపర్ణ బాలమురళి, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్ తదితరులు, నిర్మాణం: సన్ పిక్చర్స్ బ్యానర్ )
కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్.. కేవలం సౌత్‌లోనే కాక బాలీవుడ్, హాలీవుడ్ వరకు క్రేజ్, గుర్తింపు సంపాదించుకున్నాడు. మరి ఆయన నటించిన సినిమా అంటే.. దక్షిణాదితో పాటు.. బాలీవుడ్‌లో కూడా ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో ధనుష్ హీరోగా.. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'రాయన్'. తమిళంలో ధనుష్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ధనుష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతాయి. తాజాగా ధనుష్ స్యీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్' ఈ శుక్రవారం (26, జూలై 2024) థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ధనుష్ రాసిన ఈ కథలో 'రాయన్' అనే పాత్రలో మెప్పించేందుకు రెడీ అయ్యాడు. ధనుష్ కెరీర్‌లో ఈ 'రాయన్' 50వ సినిమాగా కావడం విశేషం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా 'రాయన్'. ముందు నుంచి ఈసినిమాపై దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి ఓ రేంజ్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు ధనుష్. ముఖ్యంగా ఈ హీరోకు హిందీ అడియన్స్ లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది. అలాగే ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుకోవాలని చూస్తున్నాడు. 'రాయన్' సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేసినప్పటికీ తెలుగులో అంతగా బజ్ క్రియేట్ కాలేదు. దాంతో సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానాలు తలెత్తాయి. మరి ఈ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం...
కొందరి మధ్య జరిగే అధిపత్య పోరునే 'రాయన్ 'అసలు' కథ. నాయకుడుగా ఎదిగిన హీరోకు చెక్ పెట్టాడానికి శత్రువులందరు ఒకటవుతారు. వీరందర్ని హీరో ఎలా ఎదరించాడు. తనని నమ్ముకున్న వారికి హీరో ఎలా న్యాయం చేశాడనేది మిగిలిన కథ. "రాయన్ మూవీ రా అండ్ రస్టిక్‌గా ఉంది. ధనుష్ ట్రాన్సర్ఫమేషన్, స్క్రీన్ ప్రజెన్స్ ఫైర్ అంతే. అలాగే ధనుష్ డైరెక్షన్ టాప్ నాచ్‌గా ఉంది. వెట్రిమారన్‌ను గుర్తు చేశారనడంలో సందేహం లేదు. 'రాయన్' ఒక సాధారణ రివేంజ్ డ్రామా మూవీ. కానీ, డైరెక్టర్ ధనుష్ తన టేకింగ్‌తో కొత్త ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. ఇంటర్వెల్ పోర్షన్ అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగుంది. ధనుష్ నటన పీక్స్‌లో ఉంది. కథకు ముఖ్యమైన పాత్రగా సందీప్ కిషన్ రోల్ ఉంది. ఫస్టాఫ్‌లో ఎస్‌జే సూర్య పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేదు. సెకండాఫ్‌కు కావాల్సిన పర్ఫెక్ట్ ప్లాట్ ఫస్టాఫ్‌లో ఉంది ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదరగొట్టాడు. కథ పాతదే అయినప్పటికీ తెర మీద అద్భుతంగా చూపించడంలో ధనుష్ సక్సెస్ అయ్యాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి ప్రతిభ కనబరిచాడు. రా అండ్ రస్టిక్ రోల్‌లో ధనుష్ మరోసారి విజృభించాడు. గుండు చేయించుకుని ధనుష్ డీ గ్లామర్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా ఎస్ జె సూర్య నటించారు. ఎప్పటిలాగే ఎస్ జె సూర్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని. ఆయన పాత్ర డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంది.
ఓ కీలక పాత్రలో కనిపించిన సందీప్ కిషన్ పాత్రకు న్యాయం చేశాడు. ధనుష్, సందీప్ కిషన్ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ మెప్పిస్తాయి. కీలక పాత్రల్లో కనిపించిన నటులు, వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక సినిమాకు ఏఆర్ రెహమాన్ ప్లస్ పాయింట్ అని, 'రాయన్' కు సెకండ్ హీరో మ్యూజిక్ అని ఆడియన్స్ చెబుతున్నారు. చాలాకాలం తర్వాత ఏఆర్ రెహమాన్ తన మార్క్ చూపించారు. ఈ సినిమాతో ఏఆర్ రెహమాన్ కమ్ బ్యాక్ అయ్యారని చెప్పొచ్చు. మొత్తానికి ధనుష్ ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడనిపిస్తోంది. ఇంప్రెసివ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రాయన్ పాత్రకు సంబంధించి చిన్ననాటి ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో సినిమా షురూ అవుతుంది. అటు నుంచి కథ వర్తమానంలోకి వచ్చేస్తుంది. కాలిదాస్ జయరామ్‌గా సందీప్ కిషన్ ఇంట్రడక్షన్ తర్వాత ధనుష్ సింపుల్‌గా ఎంట్రీ ఇస్తాడు. ధనుష్ అతని కుటుంబం మధ్య వచ్చే సన్నివేశాలు.. ఎస్‌జే ఆగమనం ఉంటుంది. అటు ఫోకస్ అంత ఎస్‌జే సూర్య చుట్టూ ఉంటుంది. వార్నింగ్ సన్నివేశం తర్వాత సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ ఉంటుంది. ఎజేసూర్య, అతని ప్రత్యర్థి మధ్య ఘర్షణ సృష్టించేందుకు ప్రకాశ్ రాజ్ ప్లాన్ వేస్తాడు. ఇక ధనుష్ సోదరి నిశ్చితార్థానికి సంబంధించిన సన్నివేశాలు వస్తాయి. షాకింగ్ సంఘటనలతో సందీప్ కిషన్ ఏజే సూర్య మనుషులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తతకు దారితీస్తుంది. కథలో ట్విస్ట్ ఇస్తూ బ్రేక్ వస్తుంది. ధనుష్ ఎజే సూర్యల మధ్య సాగే సన్నివేశాలతో సెకండాఫ్ షురూ అవుతుంది. ధనుష్ తన సోదరిని కాపాడుకునే ప్రయత్నంతో కథలో ఊహించని ట్విస్ట్ నెలకొనడం.. ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ధనుష్ ఇంట్రో సీన్, ఇంటర్వెల్ సీన్స్, సందీప్ కిషన్ యాక్టింగ్, ప్రీ ఇంటర్వెల్ గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతాయి. ధనుష్ 50వ సినిమాకు సరైన ఎంపిక రాయన్ అని చెప్పొచ్చు. నటుడిగానే స్టన్నింగ్ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టడమే కాదు.. డైరెక్టర్‌గా కూడా ధనుష్‌కు సూపర్ కెరీర్ ఉందని రాయన్‌తో రుజువైంది. రాయన్ తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా. తన బెంచ్ మార్క్ సినిమాను డైరెక్ట్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడని చెప్పొచ్చు. రొటీన్‌గా అనిపించిన లీడ్ క్యారెక్టర్ల నటన డీసెంట్‌గా ఉంటుంది. . డైరెక్టర్‌గా ధనుష్ సినిమాకు పూర్తి న్యాయం చేశాడని.. ఓ క్రైం డ్రామాలో టైటిల్ రోల్‌తోపాటు పలు పాత్రలపై పెట్టిన ఫోకస్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే.. సెకండాప్ ఉత్తమంగా ఉంటుంది. డైరెక్టర్‌గా ఫుల్ మార్కులు వేయొచ్చు. తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. గ్లామరస్, స్టైలిష్, డీగ్లామరైజ్‌డ్, యాక్షన్.. ఇలా ఏ జోనర్ సినిమా అయినా తనకు తానే పోటీ అంటూ చెప్పకనే చెబుతుంటాడు. ఈ క్రేజీ యాక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. మరి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్‌లో సినిమా వస్తుందంటే.. అందులోనా కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ సినిమా (D50) అయితే క్రేజ్ ఎలా ఉంటుంది. ఆ క్రేజీ సినిమానే రాయన్.
ఇంకా చదవండి: 'పేకమేడలు' మూవీ రివ్యూ : మధ్యతరగతి ప్రజల జీవితం
# Raayan # Dhanush # July26