'దేవర` మూవీ  రివ్యూ : విజువల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌!

'దేవర` మూవీ రివ్యూ : విజువల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌!

2 months ago | 5 Views

(చిత్రం : దేవర, విడుదల : 27 సెప్టెంబర్ 2024, రేటింగ్ :3.75, నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ ఆలీ ఖాన్, శ్రీకాంత్, అజయ్, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ తదితరులు. దర్శకత్వం: కొరటాల శివ,  నిర్మాతలు: నందమూరి కల్యాణ్ రామ్ సంగీతం: అనిరుధ్ సినిమాటోగ్రఫీ : రత్నవేలు ఎడిటర్: శ్రీకర ప్రసాద్ ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్)

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన తాజా చిత్రం  'దేవర`.  ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.   కొరటాల శివ దర్శకత్వంలో విజువల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో  బాలీవుడ్‌ హీరోయిన్‌, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.  ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన తొలి సినిమా ఇదే కావడం మరో విశేషం. ఆమెతోపాటు బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ సైతం 'దేవరతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించగా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ తదితర సీనియర్లంతా నటించారు.అనిరుధ్  రవిచందర్‌ సంగీతం అందించారు.  రెండు సార్లు విడుదల వాయిదా పడ్డ 'దేవర' నేడు (సెప్టెంబర్‌ 27, 2024) ఆడియెన్స్ ముందుకు వచ్చింది.  విడుదలకు ముందే  అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ రికార్డులు నెలకొల్పింది.  నార్త్ అమెరికాలో దుమ్మురేపి రెండున్నర మిలియన్స్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే సాధించింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా ఎనిమిదిన్నర లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.  ఇది సరికొత్త రికార్డుగానే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో  'దేవర'పై  భారీ అంచనాలున్నాయి.  సాధారణంగా ఓవర్సీస్‌ క్రిటిక్స్ గా చెలామణి అవుతూ, వివాదాస్పద పోస్ట్ లతో వార్తల్లో నిలిచే ఉమైర్‌ సందు పెట్టిన పోస్ట్ సైతం బాగా వైరల్‌ అయింది.  ఆయన చాలా వరకు ఏ సినిమాకైనా, ముఖ్యంగా పెద్ద సినిమాలకు నెగటివ్‌ రివ్యూలు ఇస్తుంటారు. అందులో చాలా వరకు హిట్లు అయిన సందర్భాలున్నాయి. అలాగే ఆయన చెప్పింది కూడా నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'దేవర` పై ఆయన పెట్టిన పోస్ట్ లు దుమ్మురేపాయి.   'ఆచార్య' డిజాస్టర్‌ తర్వాత   కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోంది 'దేవర'పై ఆయన మరింత శ్రద్ధ పెట్టడంతో చిత్ర పరిశ్రమలో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ ఈ సినిమా విడుదలయింది.  'జ‌న‌తా గ్యారేజ్' బ్లాక్‌బ‌స్టర్‌ త‌ర్వాత ఎన్టీఆర్‌, డైరెక్టర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వచ్చిన  ఈ మూవీపై భారీగా అంచ‌నాలు ఏర్పడడం సహజమే.  

కథ:  దట్టమైన అడవిలోని కొండ ప్రాంతం.. ఎర్ర సముద్రం తీరంలో  దేవర (జూనియర్ ఎన్టీఆర్) భైరా (సైఫ్ ఆలీ ఖాన్) తన స్నేహితులు (శ్రీకాంత్, చాకో) కలిసి సముద్రంలో వేటకు వెళ్తూ తమ జీవనం సాగిస్తుంటారు. అయితే వారి జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల లేకపోవడం చూసి మురగ (మురశీ శర్మ) వారికి భారీగా డబ్బు వచ్చేలా పని ఇచ్చి ఆదుకుంటాడు.  అయితే సముద్రంలో అధికారుల కళ్లు గప్పి సరుకును ఈ గ్యాంగ్‌ తరలిస్తుంటుంది.  మురుగ ఇచ్చే పని కోసం సముద్రం పైకి వెళ్ల కూడదని దేవర ఆంక్షలు విధిస్తాడు. దాంతో దేవరను మట్టు పెట్టడానికి భైర ప్లాన్ వేస్తాడు. ఆ విషయం తెలిసిన దేవర ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకొంటాడు. సముద్రంపై వేటకు వెళ్లకూడదనే ఆంక్షల్ని దేవర ఎందుకు విధించాడు? ప్రాణ స్నేహితులుగా ఉండే దేవరను భైరా తన స్నేహితులతో కలిసి ఎందుకు చంపాలనుకొన్నాడు? తనపై జరిగిన కుట్రను తెలుసుకొన్న దేవర ఎవరికి చెప్పకుండా సముద్రంపైకి ఎందుకు వెళ్లాడు? భైరా గ్యాంగ్‌కు భయం ఎందుకు చూపించాలని అనుకొన్నాడు. దేవర కుమారుడు (వర) పిరికి వాడిగా ఎందుకు మారాడు? వరతో తంగం (జాన్వీ కపూర్) ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు దేవర తిరిగి వచ్చాడా? నాలుగు గ్రామాల కోసం వర ఏం చేశాడు? అనేదే దేవర సినిమా కథ. 

ఎవరెలా చేశారంటే:  ఎన్టీఆర్‌ అసాధారణమైన నటనతో మెప్పించి మరోసారి తన విశ్వరూపం చూపించాడు. రెండు పాత్రల్లో మంచి ట్రీట్‌ ఇచ్చాడు. అతడి నటన అద్భుతంగా ఉంది. సినిమాకి కావాల్సిన పవర్‌ ఇచ్చాడు. ఈ మూవీతో సోలో హీరోగా ఎన్టీఆర్ అదిరిపోయే బ్యాంగ్‌తో వచ్చాడు. . సినిమాలో ఆయన లుక్‌ ఎంతో క్రేజీగా ఉంది. తన మెస్మరైజింగ్‌ యాక్టింగ్‌తో అందరిని కట్టిపడేస్తాడు.  జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో చాలా డిగ్నిఫైడ్‌గా కనిపించారు. ఎమోషనల్ సీన్లలో యంగ్ టైగర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఫైట్స్, రొమాంటిక్ సీన్లలో జాన్వీ కపూర్‌తో కలిసి ఫ్యాన్స్‌ను కేక పెట్టించే ప్రయత్నం చేశాడు.   ఆయనకు పోటీగా సైఫ్‌ అలీ ఖాన్‌ మరో అద్భుతం.  ఈ ఇద్దరి నటన నెక్ట్స్ లెవల్‌లో ఉంది. సైఫ్‌  మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టే. తెరపై ఆయన లుక్ కట్టిపడేస్తుంది.  యాక్షన్‌ సీన్లలో దుమ్ములేపాడు. సైఫ్  చాలా కొత్త విలనిజం పండించాడు.  జాన్వీ కపూర్ ఉన్నంత సేపు తన గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. అయితే..  ఆమె  పాత్ర అంతగా  సెట్‌ కాలేదు.  ఇరికించినట్టుగా ఉంది. పాటల్లో మాత్రం జాన్వీ గ్లామర్‌ ఆకర్షించే అంశం. పాత్ర పరంగా ఆమెకి పెద్దగా స్కోప్‌ లేదు, పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. శ్రీకాంత్, అజయ్, ప్రకాశ్ రాజ్, జాన్వీ కపూర్ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఫర్వాలేదనిపించారు.  

విశ్లేషణ:  సినిమా కథ సాధారణంగానే ఉన్నప్పటికీ దర్శకుడు కొరటాల శివ మాత్రం తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు.  సముద్రంలో సన్నివేశాలు హైలైట్ గా చెప్పొచ్చు.కథ కంటే.. కథనం బాగుంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌‌లో కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించారు. రెండు పార్టులుగా చేయడం వల్ల కొంత సాగదీశారనిపిస్తుంది. ఓవరాల్‌గా పక్కాగా ఇది ఫ్యాన్ప్‌ మెచ్చే చిత్రం. ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా దేవర మారడం ఖాయం.  సినిమా కథ మామూలు స్టోరీనే కానీ, ఎంగేజింగ్‌గా ఉంది.  స్క్రీన్‌ ప్లే రేసిగా ఉంది. ఇంటర్వెల్‌ సీన్‌ అదిరిపోయింది. అలాగే షార్క్ ఫైట్‌ నెక్ట్స్ లెవల్‌. వీఎఫ్‌ఎక్స్ కొత్త ఫీలింగ్‌ని ఇచ్చాయి. మరో కొత్త ప్రపంచలోకి తీసుకెళ్తాయి.  ఇంటర్వెల్‌ బ్యాంగ్ పిచ్చెక్కిస్తే, క్లైమాక్స్ సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తూ, నెక్ట్ పార్ట్ పై క్యూరియాసిటీని కలిగిస్తుంది.  మరోవైపు సినిమాలో యాక్షన్‌ సీన్లు హైలైట్‌గా నిలిచాయి.  ముఖ్యంగా సముద్రంలోని సీని నెక్ట్స్ లెవల్. షార్క్ తో చేసే ఫైట్ తెలుగులోనే కాదు..  ఇండియాలోనే ఇంతవరకూ ఎవరూ చూడని రీతిలో ఉన్నాయి.  యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.  సముద్రంలో వచ్చే సన్నివేశాల గురించి ఎంత చెప్పినా తక్కువే . ఇండియాలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచులు జరిగే స్టేడియాలపై బాంబు దాడి చేసేందుకు యతి మాఫియా ప్లాన్ చేస్తుంది. దాంతో రా అధికారులు (అజయ్ టీమ్) యతి కోసం వేట ప్రారంభించి..తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులోని రత్నగిరి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ యతి కోసం వెతుకుతుంటే.. ముందు మీరు దేవర గురించి తెలుసుకోవాలంటూ ప్రకాశ్ రాజ్ చెప్పే కథతో మూవీ ఎమోషనల్‌గా మారుతుంది. సైఫ్‌తో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్లు పవర్‌ఫుల్‌గా ఉండటంతో మూవీ ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఓ భారీ ట్విస్టుతో ఫస్టాఫ్ ముగించడం బాగుంది. ఇక సెకండాఫ్‌లో దేవర కనిపించకుండా పోయాక.. ఆయన కుమారుడు వర, తంగం మధ్య లవ్ ట్రాక్, కొన్ని యాక్షన్ సీన్లతో కొరటాల శివ కథను నడిపించిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు స్టోరిని, సన్నివేశాల్లో ట్విస్టులను జొప్పించిన విధానం ఓ రేంజ్‌లో ఉంది. దేవరకు సంబంధించిన ఓ ట్విస్టు బాహుబలి రేంజ్‌లో ప్లాన్ చేయడం ఫ్యాన్స్‌కు హై ఇచ్చే మూమెంట్స్‌గా ఓ కొత్త అనుభూతిని పంచుతుంది.

టెక్నీకల్ విషయాలకొస్తే.... ఈ సినిమాకి మ్యూజిక్‌ పెద్ద అసెట్‌.. అనిరుధ్ రవిచందర్ అందించిన బీజీఎం గురించి ఎంత చెప్పినా తక్కువే.  పాటలు ఇప్పటికే ఆకట్టుకున్నాయ. బీజీఎం పగిలిపోయింది. ఈ  సినిమాకు అత్యంత బలం.. అనిరుధ్ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫి. ఈ రెండు విభాగాలు సినిమాకు ఓ రేంజ్‌ను తీసుకొచ్చాయి. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేశాయనే చేశాయని చెప్పవచ్చు. సముద్ర తీరం.. అలాగే కొండలు, అటవీ ప్రాంతాన్ని రత్నవేలు చక్కగా కెమెరాల బంధించారు. 

ఓవరాల్‌గా 'దేవర` పైసా వసూల్‌ మూవీ అని చెప్పొచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో  ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌ రామ్‌, యువ సుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్‌ మిక్కిలినేని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన  ఈ చిత్రం నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి.  దేవర సినిమా విషయానికి వస్తే.. ఎమోషనల్, పవర్‌ఫుల్ పాత్రలతో నడిచే ఓ డిఫరెంట్ జానర్‌ మూవీ. 6 ఏళ్ల తర్వాత సోలోగా వచ్చి అభిమానులకు పండగ వాతావరణం కల్పించే విధంగా ఎన్టీఆర్ సినిమా ఉంది.

ఇంకా చదవండి: మన్యం ధీరుడు… మెప్పించే ఓ విప్లవ వీరుడి కథ

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Devara     # JrNTR     # Janhvikapoor     # September27