'డార్లింగ్' మూవీ రివ్యూ : కామెడీ ఎంటర్టైనర్ !
4 months ago | 39 Views
(చిత్రం: 'డార్లింగ్' , విడుదల తేదీ : జూలై 19, 2024, రేటింగ్ : 2.5/5, నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్, బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్, అనన్య నాగళ్ల, తదితరులు, దర్శకులు: అశ్విన్ రామ్, నిర్మాతలు : కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య, సంగీత దర్శకుడు: వివేక్ సాగర్, సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై, ఎడిటర్ : ప్రదీప్ ఇ రాఘవ)
నవతరం కథానాయిక నభా నటేష్, యువతరం నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా కామెడీ ఎంటర్టైనర్ “డార్లింగ్”. ట్రైలర్ తో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఈ వారం థియేటర్స్ లో అలరించేందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం...
కథ: అనగనగా రాఘవ(ప్రియదర్శి) తన చిన్నప్పటి నుంచే బాగా చదువుకుని జాబ్ చేస్తే మంచి భార్య వస్తుంది అపుడు పారిస్ వెళ్లొచ్చు అని కలలు గంటు తన పెళ్లి, లైఫ్ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఓరోజు నందిని (అనన్య నాగళ్ళ) తో పెళ్లి ఫిక్స్ అవుతుంది, కానీ సరిగ్గా పెళ్లి ముందే ఆమె తాను ప్రేమించినవాడితో వెళ్ళిపోతుంది. దీనితో డిప్రెషన్ లోకి వెళ్లిన రాఘవ తాను చనిపోవాలని ఫిక్స్ అవుతాడు. అలా చనిపోయే సమయంలో పరిచయం అవుతుంది ఆనంది (నభా నటేష్) పరిచయం అవుతుంది. మరి అలా పరిచయం అయ్యిన గంటల్లోనే ఆమెని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ నుంచి రాఘవ పడ్డ ఇక్కట్లు ఏంటి? ఆనందికి ఉన్న సమస్య ఏంటి అసలు ఆమె ఎవరు? చివరికి ఇద్దరూ కలిసి ఉంటారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ: ఈ “డార్లింగ్” చిత్రంలో మెయిన్ లీడ్ ప్రియదర్శి అలాగే నభా నటేష్ లు మాత్రం తమ పాత్రల్లో అదరగొట్టేసారు. అలాగే ఫస్టాఫ్ లో డీసెంట్ కామెడీ అక్కడక్కడా పర్వాలేదనిపించే కొన్ని సీన్స్ ఈ చిత్రాన్ని ఓకే ఎంటర్టైనర్ రేంజ్ లో మార్చాయి. కానీ బోర్ కొట్టించే సీన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి వీటితో ఈ సినిమా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైనర్ గా అనిపించదు. వీటితో అయితే చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని సినిమాని చూడాలి అనుకునేవారు ట్రై చేస్తే బెటర్. ఈ చిత్రంలో ప్రామిసింగ్ అంశాల్లో ఫస్టాఫ్ అని చెప్పవచ్చు. స్టార్టింగ్ నుంచే మంచి కామెడీతో నరేషన్ సాగుతుంది. ఆలా ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా నవ్వించే ఫన్ సీన్స్ అలాగే మంచి వన్ లైనర్స్ ఇంప్రెస్ చేస్తాయి. ఇంకా సెకండాఫ్ లో రఘుబాబు పై ఒక ఎమోషనల్ సీన్ బావుంది. అలాగే నటీనటుల పెర్ఫామెన్స్ లలో మెయిన్ లీడ్ మాత్రం సాలిడ్ పెర్ఫామెన్స్ లు అందించారని చెప్పాలి. డెఫినెట్ గా నభా నటేష్, ప్రియదర్శిలు ఈ సినిమాకి వాళ్ళ లోని ది బెస్ట్ ని అందించారు. నభా నటేష్ అయితే అయితే తన కెరీర్ లోనే ఎక్కువ షేడ్స్ తో మంచి నటన ఈ చిత్రంలో కనబరిచింది. పలు రకాల హావభావాలు చాలా క్యూట్ గా చేసేసింది. అలాగే కొన్ని ఎమోషన్స్ సీన్స్ లో కూడా ఆమె బాగా నటించింది. ఇక ప్రియదర్శి కోసం మనకి తెలిసిందే. చాలా చిత్రాల్లో తనదైన ఈజ్ పెర్ఫామెన్స్ ని తాను కనబరిచాడు. అలాగే ఇందులో కూడా మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడు. అలాగే సెకండాఫ్ లో తన ఎమోషనల్ పెర్ఫామెన్స్ బాగుంది. ఇక వీరితో పాటుగా సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ క్యామియోస్ కూడా ఉన్నాయి. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం సర్ప్రైజ్ చేశారు. యంగ్ నటి అనన్య నాగళ్ళ, మెగా డాటర్ నిహారిక, టాలెంటెడ్ నటుడు సుహాస్ లు మంచి పాత్రల్లో ఈ సినిమాలో కనిపించారు. ఇక వారితో పాటుగా మురళీధర్ గౌడ్, రఘు బాబు, సునీత మనోహర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు. ఒక డీసెంట్ అండ్ ఓకే అనిపించే ఫస్టాఫ్ తర్వాత అదే రీతిలో లేదా అంతకు మించే సాలిడ్ సెకండాఫ్ ఉంటే ఆ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. కానీ ఇది మాత్రం ఈ చిత్రంలో బాగా మిస్ అయ్యింది. ఎగ్జైట్ చెయ్యని ట్విస్ట్ లు పేలవంగా సాగే స్క్రీన్ ప్లే తో చాలా వరకు సెకండాఫ్ అంతా చికాకు తెప్పించే విధంగా ఉంటుంది. అలాగే ఫస్టాఫ్ లో మైంటైన్ చేసిన ఫన్ ఎలిమెంట్స్ కూడా సెకండాఫ్ లో పెద్దగా లేవు ఒకవేళ ఉన్నా అవి ఖచ్చితంగా అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించలేవు. ఇక వీటితో ఆల్రెడీ మనం అపరిచితుడు, చంద్రముఖి లాంటి సినిమాలు చూసేసాం ఈ సినిమా కూడా ఆ కోవలోనే వచ్చి పరమ బోరింగ్ ట్రీట్ ఇస్తుంది. పాటుగా సినిమాలో సరైన ఎమోషన్స్ కూడా లేవు. ఇంకా నిహారిక పాత్ర అయితే సినిమాలో అసలు పొంతన లేకుండా కనిపిస్తుంది. ఆమె రోల్ ఎలా వస్తుందో ఆమెకి లీడ్ నటీనటుల విషయం ఎలా తెలుస్తుందో అసలు లాజిక్ లేదు. ఇదే కాకుండా సెకండాఫ్ లో చాలానే లాజిక్స్ ను దర్శకుడు బాగా మిస్ అయ్యాడు. వీటికి తోడు నభా నటేష్ పెర్ఫామెన్స్ కొంతమేర ఓకే కానీ ఒక టైం లో ఓ సెక్షన్ ఆడియెన్స్ కి చాలా బోర్ కొట్టించవచ్చు. ఇలా సెకండాఫ్ అంతా డిజప్పాయింటింగ్ గానే అనిపిస్తుంది. పోనీ క్లైమాక్స్ తో అయినా సినిమా ఏమన్నా ఎగ్జైట్మెంట్ తెస్తారా అంటే అది కూడా కనిపించదు. అలాగే సినిమా ఒక టైం తర్వాత అలా సాగదీతగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక దర్శకుడు అశ్విన్ రామ్ విషయానికి వస్తే ఈ చిత్రానికి తన వర్క్ బిలో యావరేజ్ గానే ఉందని చెప్పాలి. ప్రియదర్శి లైన్ వరకు ఓకే కానీ మిగతా సినిమా అంతా బోరింగ్ గా ఆల్రెడీ మనం చూసినట్టుగానే అనిపిస్తుంది. పైగా నరేషన్ ని చాలా వరకు సాగదీసాడు. కొన్ని చోట్ల కామెడీ ఓకే కానీ మిగతా అంతా డిజప్పాయింటింగ్ గానే ఉంటుంది.
సాంకేతిక వర్గం: సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఇచ్చిన పాటలు తన మార్క్ లో లేవు. ఫస్టాఫ్ లో ఒక్క సాంగ్ మినహా తన వర్క్ డిజప్పాయింటింగ్ గానే ఉంది. అలాగే రీ రికార్డింగ్ కూడా ఇంప్రెసివ్ గా లేదు. నరేష్ రామ దురై సినిమాటోగ్రఫీ బాగుంది. ఏ రాఘవ్ ఎడిటింగ్ లో బోరింగ్ సీన్స్ ని తగ్గించాల్సింది. డైలాగ్స్ పర్వాలేదు. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
ఇంకా చదవండి: 'బహిష్కరణ' మూవీ రివ్యూ : సాదాసీదా కథనం!
# Darling # Priyadarshi # Nabhanatesh