C 202 మూవీ రివ్యూ: ఆకట్టుకునే  హర్రర్

C 202 మూవీ రివ్యూ: ఆకట్టుకునే హర్రర్

3 days ago | 5 Views

(చిత్రం : C 202, నటీనటులు : మున్నాకాశి, తనికెళ్ల భరణి, సత్య ప్రకాష్, షఫీ; శుభలేఖ సుధాకర్, అర్చన, చిత్రం శ్రీను, వై. విజయ, షరూన్ రియా ఫెర్నాండెస్, డ్రీమ్ అంజలి, సెల్వ (ఇక్బాల్), డాక్టర్ ఏవి గురవారెడ్డి తదితరులు.  టెక్నీషియన్స్ : నిర్మాణం : మై టీ ఓక్ పిక్చర్స్, నిర్మాత : మనోహరి కెఏ,  డి ఓ పి : సీతారామరాజు ఉప్పుతల, కథ స్క్రీన్ ప్లే మ్యూజిక్ ఎడిటర్ డైరెక్టర్ : మున్నాకాశి)

మున్నాకాశి, తనికెళ్ల భరణి, సత్య ప్రకాష్, షఫీ; శుభలేఖ సుధాకర్, అర్చన ప్రధాన పాత్రల్లో మున్నాకాశి దర్శకత్వంలో  మై టీ ఓక్ పిక్చర్స్ బ్యానర్ పై  మనోహరి కెఏ  నిర్మించిన చిత్రం 'C 202' . ప్రేక్షకుల తీర్పు కోరుతూ విడుదలైంది. విడుదలకు ముందే ప్రేక్షకుల్లో , ఇండస్ట్రీలో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం... 

కథ లోకి వెళదాం... C 202 చిత్రానికి సంబంధించిన కథ మొత్తం  ఒక ఇంట్లోనే జరుగుతుంది. వివరాల్లోకి వెళితే..C 202 ఇంట్లో సాంఘిక శక్తి చేతబడి వల్ల ఒక హత్య జరుగుతుంది. బూరా (తనికెళ్ల భరణి) భూతాల రాజుగా, వశీకరణం, చేతబడి తెలిసిన వ్యక్తి. తను చేసిన చేతబడితోనే ఆ ఇంట్లో ఒక అమ్మాయి మరణిస్తుంది. అదే ఇంట్లోకి శుభలేఖ సుధాకర్-అర్చనల కుటుంబం దిగుతుంది.  వాళ్లకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి పెళ్లి అయి విదేశాల్లో ఉంటుంది. వాళ్లు తమ పెద్దమ్మాయి దగ్గరికి వెళుతూ మిగతా ఇద్దరు కూతుళ్ళని ఇద్దరు స్నేహితులతో ఆ ఇంట్లో వదిలి వెళ్తారు.  అందులో ఒక స్నేహితుడిగా మున్నాకాశి (అయాన్),  షరూన్ రియా ఫెర్నాండెస్ (రియా), తన చెల్లికి మరియు తన స్నేహితురాలు మ్యాడి కి తోడుగా ఉంటాడు. ఆ ఇంట్లో వీళ్ళందరికీ వింత వింతగా రూపాలు కనపడటం భయం కలిగించే సంఘటనలు జరుగుతుంటాయి. అసలు ఆ ఇంట్లో ఏముంది? శుభలేఖ సుధాకర్ కుటుంబం ఆ ఇంటికి ఎలా వెళ్లారు? ఎందుకు వెళ్లారు?  ఆ ఇంట్లో ఉన్న అసాంఘిక శక్తులను ఎవరు తరిమికొట్టారు?  తెలుసుకోవాలంటే  సినిమా చూడాల్సిందే... 

విశ్లేషణ:  సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తితో సాగుతుంది. కథని ఎంచుకోవడం దగ్గర నుంచి స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఎడిటింగ్ తో పాటు  దర్శకత్వం బాధ్యతలను వహించిన మున్నాకాశి పడిన కష్టం ప్రతీ ఫ్రేమ్ లో స్పష్టంగా  కనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న కథ, కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే రీతిలో సాగుతుంది. నటీనటుల పాత్రలు మరియు వారి నటన ఈ  సినిమాకు బాగా ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ముఖ్యంగా తనికెళ్ల భరణి, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శ్రీను క్యారెక్టర్స్ బాగా పండాయి. తెరపై వారు ప్రదర్శించిన అహభావాలు .. వాటిని పలికించి తీరు సూపర్.  ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హై లైట్ గా చెప్పొచ్చు. అయితే.. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ బోర్ కొట్టించే సన్నివేశాలు .. కథలోకి వెళ్లడానికి పట్టిన టైం లాగ్ .. సినిమా ద్వితీయార్ధంలో  కొన్ని సీన్స్ కి మధ్య కనెక్టివిటీ లేకపోవడం లాంటివి కొంచెం ఇబ్బందికరంగా తోచినా .. అవి ప్రేక్షకులను పెద్దగా  ఇబ్బంది పెట్టవు.   పేరుకు చిన్న సినిమా అయినా  నిర్మాణ విలువల పట్ల ఎక్కడా రాజీపడని తత్వం ఇట్టే కనిపిస్తుంది.  ప్రొడక్షన్ వైస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మాత మనోహరి ఈ చిత్రాన్ని నిర్మించిన తీరు ప్రతీ ఒక్కర్నీ ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఎంతగానో  ఆకట్టుకునుంది. ఇదే సినిమాకి బాగా  ప్లస్ పాయింట్ గా నిలిచిందని చెప్పొచ్చు కూడా.  మున్నాకాశి, షరూన్ రియా ఫెర్నాండెస్ అద్భుతంగా నటించి .. భయపడి భయపెట్టే క్యారెక్టర్లలో మంచి నటనను కనబరిచారు. వారు ఆయా పాత్రలను తెరపై పండించిన తీరు అమోఘం అనిపించక మానదు. ఇక   భూతాల రాజు గా తనికెళ్ల భరణి  క్యారెక్టర్  వాహ్.. అనిపిస్తుంది. ఆ  క్యారెక్టర్ ఎంతో బావుంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.  సత్య ప్రకాష్, షఫీ, వై.విజయ వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సపోర్టింగ్ రోల్ లో చిత్రం శ్రీను నటన, క్యారెక్టర్ ఓకే అనిపిస్తుంది.  తనికెళ్ల భరణి, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శ్రీను పాత్రలు సినిమాకి ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. హర్రర్ సినిమాను  ఇష్టపడే ప్రేక్షకులను  ఈ  'C 202 ' సినిమా ఎంతగానో ఆకట్టుకుంది.  

రేటింగ్ :3/5

ఇంకా చదవండి: "వీక్షణం" సినిమా రివ్యూ

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# C 202     # మున్నాకాశి     # తనికెళ్ల భరణి     # అక్టోబర్25