
‘బ్రహ్మా ఆనందం’ మూవీ రివ్యూ : ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా
1 month ago | 5 Views
(చిత్రం : ‘బ్రహ్మా ఆనందం’, రేటింగ్: 3.25, తారాగణం: రాజా గౌతమ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని. ఐశ్వర్య హోలక్కల్, సంపత్, రాజీవ్ కనకాల తదితరులు. రచన, దర్శకత్వం: RVS నిఖిల్, నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా, బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్, సమర్పణ: శ్రీమతి. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్, DOP: మితేష్ పర్వతనేని, సంగీతం: శాండిల్య పీసపాటి, ఎడిటర్: ప్రసన్న, ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి దయాకర్ రావు, పీఆర్వో : వంశీ శేఖర్, పబ్లిసిటీ డిజైన్స్: మాయాబజార్, మార్కెటింగ్: ఫస్ట్ షో)
హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ చిత్రంలో బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ తాత, మనవళ్ళుగా నటించారు. ఫస్ట్-టైమర్ ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్100% సక్సెస్ రేట్‌తో న్యూ ఏజ్ కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందిస్తోంది. వారి గత చిత్రాలు మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందించాయి. తాజాగా మరో యూనిక్ ఎంటర్ టైనర్ గా ‘బ్రహ్మా ఆనందం’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషించగా .. సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి శాండిల్య పిసాపాటి మ్యూజిక్ అందించారు. మితేష్ పర్వతనేని డీవోపీ గా పని చేశారు. ప్రసన్న ఎడిటర్ గా వ్యవహరించారు. సినిమా నిర్మాణ రంగంలో మంచి టేస్ట్ ఉన్న నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. అతను ఇప్పటి వరకు నిర్మించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. సుమన్ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమా ‘మళ్లీ రావా’. ఇది సుమంత్ కి కంబ్యాక్ మూవీలాగా ఉపయోగపడింది. అలాగే నవీన్ పొలిశెట్టితో ఓ మంచి కడుపుబ్బ నవ్వించే కామెడీ థ్రిల్లర్ ను ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’గా మన ముందుకు తీసుకొచ్చి విజయం అందుకున్నారు. గ్లామర్ క్వీన్ సంగీత ప్రధాన పాత్రలో ‘మసూద’అంటూ ఓ హారర్ డ్రామాను తీసుకొచ్చి అందరినీ భయపెట్టారు. అలా మూడు చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా... ఇప్పుడు ‘బ్రహ్మా ఆనందం’తో మన ముందుకు వచ్చారు. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం...
కథ: బ్రహ్మానందం(రాజా గౌతమ్) మంచి థియేటర్ ఆర్టిస్ట్. నాటకలు కూడా రాస్తూ ఉంటారు. తను ఎప్పుడైనా ఈ రంగంలో రాణించాలని ప్రయత్నాలు చేస్తూ వుంటారు. అతనికి ఓ తాత ఆనంద్ మూర్తి(బ్రహ్మానందం) ఓ ఓల్డేజ్ హోంలో వుంటారు. వీరిద్దరూ అప్పుడప్పుడు కలుస్తూ వుంటారు. నేషనల్ లెవల్ థియేటర్ ఆర్టిస్ట్ కాంపిటేషన్ లో బ్రహ్మానందం రాసిన నాటకం సెలెక్ట్ అవుతుంది. కానీ అది ప్లే చేయాలంటే ఆరు లక్షలు అడుగుతారు. డబ్బుల కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు బ్రహ్మానందం. కానీ ఇవేవీ ఫలించక పోగా తను ప్రేమించిన తార(ప్రియ వడ్లమాని)కి కూడా దూరం అవుతాడు. ఇలా బాధల్లో వున్న బ్రహ్మానందంకి... తన తాత నుంచి కండీషన్స్ తో కూడిన ఓ ఆఫర్ వస్తుంది. ఆ ఆఫర్ ఏంటి? తను పెట్టిన కండీషన్స్ ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ... కథనం విశ్లేషణ: వరుస హిట్లతో దూసుకుపోతున్న నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా... ఈ సారి ఓ ఫీల్ గుడ్ సెంటిమెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకూ ముందు తాను తీసిన మూడు సినిమాల జోనర్స్ కి సంబంధం లేకుండా బ్రహ్మా ఆనందంను తీశారు. లవ్, కామెడీ థ్రిల్లర్, హారర్ డ్రమాలతో అలరించిన యన ఇప్పుడు... బంధాలు, బంధుత్వాలు, సెంటిమెంట్ ను ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను నిర్మించారు. బ్రహ్మానందం తనయుడికి కూడా మంచి ఎంట్రీనే లభించినా.. ఆ తరువాత నిలదొక్కోలేకపోయారు. అందుకే తండ్రీకొడుకులను తాత మనవళ్ళ పాత్రలో నటింపజేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.
ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయాలు, బ్రహ్మనందం కష్టాలు, థియేటర్ ప్లే ఛాన్స్ రావడం, ఆనంద్ రామ్మూర్తి ఓల్డ్ ఏజ్ హోమ్, అన్నయ్య – తాతయ్య మీద రాశి ప్రేమ, డబ్బుల కోసం ఆనంద్ రామ్మూర్తి వెంట బ్రహ్మానందం ఊరికి వెళ్లడంతో సాగుతుంది. ఊరికి వెళ్ళాక ఇంటర్వెల్ కి తాత ఓ ట్విస్ట్ ఇవ్వడంతో సెకెండ్ హాఫ్ పై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఆ ట్విస్ట్ తో బ్రహ్మానందం అక్కడే ఇరుక్కుపోవడం, తాత కోసం ఏం చేసాడనేది ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా కామెడీతోనే నడిపించి అక్కడక్కడా చిన్న ఎమోషన్ చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో నవ్విస్తూనే... ముసలి వాళ్ళ ఎమోషన్, వాళ్ళ కష్టాలు, మనుషులతో అనుబంధాలు... ఎమోషన్ ను ఎక్కువగా క్యారీ చేసారు. రాజా గౌతమ్ పాత్రను ఎన్ని ఎమోషన్స్ వచ్చినా మారని ఒక సెల్ఫిష్ క్యారెక్టర్ లా పొట్రైట్ చేసారు. మంచి ఎమోషన్ నడిపించి ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ప్రమోషన్స్ లో చెప్పినట్టు... సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు కేవలం రాజా గౌతమ్ పాత్ర మాత్రమే గుర్తుండి పోతుంది. ఓ వైవిధ్యమైన హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో తెరకెక్కిన బ్రహ్మ ఆనందం... అందిరినీ ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం గురించి చెప్పాల్సిన పనే లేదు. వెయ్యికి పైగా సినిమాల్లో మనల్ని నవ్వించి అప్పుడప్పుడు ఏడిపించిన బ్రహ్మానందం.. ఈ సినిమాలో కూడా ఓ పక్క నవ్విస్తూనే కాస్త ఏడిపించారు. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో హీరోగా పలు సినిమాలు చేసినా అంత గుర్తింపు రాని రాజా గౌతమ్ ఈ సినిమాలో నటుడిగా తన కసి అంతా తీర్చుకున్నట్టు, నటనలో ఎంతో పరిణీతి చెందినట్టు అనిపిస్తుంది. రాజా గౌతమ్ తండ్రికి ధీటుగా ప్రతి సన్నివేశంలోనూ బాగా నటించాడు అని చెప్పొచ్చు. ఇక వెన్నెల కిషోర్ కూడా ఫుల్ గా నవ్వించారు. సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ బ్రహ్మానందం మనవరాలి పాత్రలో మెప్పించింది. భవిష్యత్తులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. రాజీవ్ కనకాల, సంపత్, ఐశ్వర్య హోలక్కల్, ప్రియా వడ్లమాని, బామ్మ పాత్రలో నటించిన పెద్దావిడ.. అందరూ వారి పాత్రల్లో బాగా మెప్పించారు.
టెక్నీకల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా బాగున్నాయి. ఒక మంచి పాయింట్ చుట్టూ కామెడీ అల్లుకొని కథనం చాలా గ్రిప్పింగ్ గా రాసుకుని నడిపించారు. క్లైమాక్స్ మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. దర్శకుడు టైటిల్ కి తగ్గ న్యాయం చేసాడనే చెప్పొచ్చు. నిర్మాత రాహుల్ యాదవ్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా వున్నాయి. ఈ వారంలో మంచి ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన చిత్రం ఇది. ఓ సారిలుక్కేయండి మరి!
ఇంకా చదవండి: ‘తండేల్’ మూవీ రివ్యూ : ఎమోషనల్ గా సాగే ప్రేమకథ !
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# బ్రహ్మా ఆనందం # రాజీవ్ కనకాల # వెన్నెల కిషోర్