'బచ్చల మల్లి' మూవీ రివ్యూ :  సో..సో.. మల్లి!

'బచ్చల మల్లి' మూవీ రివ్యూ : సో..సో.. మల్లి!

9 hours ago | 5 Views

(చిత్రం : బచ్చల మల్లి',  విడుదల : డిసెంబర్ 20, 2024,  రేటింగ్ : 2.25/5, నటీనటులు : అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, హరితేజ, ప్రవీణ్, అచ్యుత్, కోట జవరం, అంకిత్ కొయ్య, ప్రసాద్ బెహర, హర్ష చెముడు తదితరులు. దర్శకత్వం  : సుబ్బు మంగదేవ్వి, నిర్మాతలు : రాజేష్ దండ, బాలాజీ గుట్ట, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ : చోటా కె ప్రసాద్)

 హీరో అల్లరి నరేష్ తాజాగా నటించిన చిత్రం  “బచ్చల మల్లి” ప్రేక్షకుల ముందుకొచ్చింది.  అల్లరి నరేష్ ప్రస్తుతం తనపై ఉన్న ముద్రను మార్చుకొని  ట్రాక్ మార్చి   పలు సీరియస్ పాత్రలు  చేస్తున్న సంగతి తెలిసిందే.  అలా తను చేసిన  చిత్రమే “బచ్చల మల్లి”. మరి ప్రమోషనల్ కంటెంట్ తో బాగానే బజ్ అందుకున్న ఈ సినిమా ఎలా ఉందో  తెలుసుకుందాం... 

కథ:  1995 నుంచి 2005 మధ్యలో నడిచే సెటప్ తో  సినిమా కనిపిస్తుంది. తుని, సూరవరం ప్రాంతంలో ఒక పక్కా మొరటుగా పూర్తిగా మూర్ఖత్వంతో నడిచే బచ్చల మల్లి (అల్లరి నరేష్) కనిపిస్తాడు. అయితే తన జీవితంలో ఇలా ఎందుకు మారిపోయాడు? తను  ఎంతగానో ప్రేమించిన కావేరి (అమృత అయ్యర్)తో తన ప్రేమ కథ ఏమయ్యింది? అంత మూర్ఖత్వం మూలాన తను కోల్పోయింది ఏమిటి?  ఈ క్రమంలో తన కథకి వచ్చిన ముగింపు ఏమిటి? అనేది తెలియాలి అంటే సినిమా  చూడాల్సిందే.... 

 విశ్లేషణ: సినిమా  మొత్తంగా చూసినట్టు అయితే ఈ “బచ్చల మల్లి” మాస్ గా కనిపించే ఎమోషనల్ మూర్ఖుడు కథ అని చెప్పొచ్చు. తన రోల్ లో నరేష్ సాలిడ్ పెర్ఫార్మన్స్ అందించారు. తన రోల్ కి పూర్తి న్యాయం తను చేయగా సినిమాలో తన పాత్ర దాని చుట్టూ సాగే ఎమోషన్స్ ఇంప్రెస్ చేస్తాయి. కాకపోతే ఇంకొంచెం డెప్త్ ని తన రోల్ లో చూపించి ఉండాల్సింది అలాగే క్లైమాక్స్ కూడా అలాంటి ముగింపు ఇచ్చి ఉండాల్సింది కాదు అనిపించింది.  దర్శకుడు సుబ్బు మంగదేవ్వి విషయానికి వస్తే.. తన కథలో కోర్ పాయింట్ బాగుంది. అల్లరి నరేష్ రోల్ ని సాలిడ్ గా ప్రెజెంట్ చేశారు. ఒక పక్కా మూర్ఖుడు ఎలా ఉంటాడో ఎలా మసులుతాడో తను బాగా చూపించారు. అలాగే తన మూర్ఖత్వం మూలాన ఏమేం కోల్పోతాడో తను ఎమోషనల్ గా ఇంకా డీసెంట్ లవ్ స్టొరీతో హ్యాండిల్ చేయడం బాగుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది. సినిమా  సెకండాఫ్ లో కొన్ని ట్విస్ట్ లు క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే ఈ కథ కూడా మరీ అంత కొత్తగా కూడా అనిపించదు. పలు సన్నివేశాలు రెగ్యులర్ గానే అనిపిస్తాయి. ఇంకా పలు సన్నివేశాలు ముందే ఊహించే రకంగానే అనిపిస్తాయి. వీటితో పాటుగా హీరో రోల్ కి తన మూర్ఖత్వ ధోరణి ఎందుకు పతాక స్థాయిలోకి వెళ్ళింది అనేది ఒకో టైంలో కొంచెం ఓవర్ గా పోతున్నట్టు పక్క దారి పట్టినట్లు అనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకటి మాత్రం డెఫినెట్ గా అందరికీ ఎక్కకపోవచ్చు. అల్లరి నరేష్ పై చూపించే ఒక విషాదాంతం కొంచెం ఫోర్స్డ్ గా అర్ధ రహితంగా అనిపిస్తుంది.   ఈ మధ్య తన ట్రాక్ మార్చిన అల్లరి నరేష్ మరోసారి సాలిడ్ రోల్ ని ఎంచుకున్నారు అని చెప్పాలి. ఈ సినిమాలో 'బచ్చల మల్లి' అనే పాత్రలో తను ఒడిగిపోయాడు అని చెప్పొచ్చు. తన పాత్రలో మొరటుతనం ముఖ్యంగా మూర్ఖత్వం అనే ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా చేసి చూపించారు. తన మూర్ఖత్వంపై కనిపించే చాలా సీన్స్ సినిమాలో ఇంప్రెస్ చేస్తాయి. అలాగే హీరోయిన్ అమృత అయ్యర్ తన రోల్ లో బాగా చేసింది. ఇంకా ఇద్దరి నడుమ లవ్ ట్రాక్ కూడా బాగుంది. ఒక పాయింట్ లో ఇద్దరు నడుమ కనిపించే ప్రేమ వర్సెస్ మూర్ఖత్వం పాయింట్ సినిమాలో మెప్పిస్తుంది అని చెప్పాలి. ఇంకా ఇద్దరి నడుమ కెమిస్ట్రీ సినిమాలో సూపర్ గా ఉంది. ప్రతీ చిన్న పెద్ద నటునికి ఈ సినిమాలో మంచి స్కోప్ కనిపిస్తుంది. నటి రోహిణి ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో మరోసారి ఆకట్టుకున్నారు. అలాగే కోటా జవరం, నటుడు అచ్యుత్ ముఖ్యంగా రావు రమేష్ లు అయితే సాలిడ్ పెర్ఫార్మన్స్ ని కనబరిచారు.  

సాంకేతిక వర్గం: ఈ సినిమాలో  చాలా సీన్స్ లో వి ఎఫ్ ఎక్స్ వీక్ గా ఉండడం మూలాన బ్యాగ్రౌండ్  లో విలేజ్ నేటివిటీలో సహజత్వం లోపించినట్టుగా కనిపిస్తుంది.  విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన కొన్ని పాటలు నేపథ్య సంగీతం బాగున్నాయి. రిచర్డ్ ఎం నాథన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ బాగుంది. పాతకాలం నాటి విజువల్స్ ని సినిమా నేపథ్యంకి తగ్గట్టుగా బాగా చూపించారు.   ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి.

ఇంకా చదవండి: 'పుష్ప -2' రివ్యూ: ఊరమాస్‌ ట్రీట్‌!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# బచ్చలమల్లి     # అల్లరినరేష్     # సుబ్బుమంగదేవీ