ఎంగేజింగ్ క్రైం థ్రిల్లర్... పని
4 days ago | 5 Views
రేటింగ్: 3
జోజు జార్జ్, అభినయ జంటగా మలయాళంలో నటించిన చిత్రాన్ని తెలుగులో ‘పని’ పేరుతో విడుదల చేయడానికి తెలుగు నిర్మాత రాజవంశీ ముందుకొచ్చారు. జోజు జార్జి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇంకా సాగర్ సూర్య, జునైద్, అభయ హిరణ్మయి, సీమ, బాబీ కురియన్ తదితరులు నటించారు. క్రైం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు... పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్ మెంట్ కూడా ఇందలో జోడించారు. ఈ చిత్రం ఇప్పటికే మలయాళం, తమిళం, కన్నడలో విడుదలై ఘన విజయం సాధించింది. నేడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మన తెలుగు ఆడియన్స్ ను ఏమాత్రం ఎంగేజ్ చేసిందో చూద్దాం పదండి.
కథ: గిరి(జోజు జార్జ్) , గౌరి(అభినయ) ఇద్దరూ అన్యోన్య దంపతులు. ఇద్దకి ఒకరంటే ఒకరు ప్రాణం. అలాంటి ఈ జంట మధ్యలోకి ఇద్దరు ఆకతాయి కుర్రాళ్లు సెబాస్టియన్(సాగర్ సూర్య), సిజూ(జునైద్) వచ్చిఆ కుటుంబాన్ని గందరగోళానికి గురి చేస్తారు. వీరు చేసే ఓ పని వల్ల గౌరి చాలా అప్ సెట్ అవుతుంది. దాంతో గిరి ఆ ఇద్దరి కుర్రాళ్లను వెంటాడుతూ వుంటాడు. ఈక్రమంలో గిరి వర్గానికి చెందిన వారిని కూడా టార్గెట్ చేసి నానా చిత్రహింసలు పెడతారు ఆ ఇద్దరు ఆకతాయిలు. ఓ కరుడు గట్టిన వ్యక్తులను కూడా ఈ ఇద్దరు ఆకతాయిలు మట్టుబెడతారు. మరి వీరి ఆగడాలకు గిరి ఎలా అడ్డుకట్ట వేశారు? వారి నుంచి తన కుటుంబ సభ్యులను ఎలా కాపాడుకున్నాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా వుందంటే... కంటెంట్ బాగుంటే ఏ భాషా చిత్రాలనైనా ఆడియన్స్ ఆదరిస్తారు. మలయాళంలో విడుదలైన అనేక చిత్రాలు తెలుగులో విజయం సాధించాయి. ప్రేమకథా చిత్రాలు కానీ, థ్రిల్లర్ మూవీస్ కానీ, యాక్షన్ ఎంటర్టైనర్స్ గానీ కంటెంట్ బాగుంటే చాలు... సినిమాని హిట్ చేయడం తెలుగు ప్రేక్షకులు తమ భుజస్కంధాలపై వేసుకుంటారు. తాజాగా మలయాళంలో విజయం సాధించిన ‘పని’ సినిమా తెలుగులో ఇదే పేరుతో విడుదలైంది. ఈ సినిమా కూడా కంటెంట్ బేస్ సినిమా కావడం వల్ల సినిమా ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేస్తుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు... యాక్షన్ సన్నివేశాలన్నీ ప్రేక్షకులను అలరిస్తాయి. జోజు జార్జ్ ఎంచుకున్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే... మెయిన్ ప్లాట్ ను బాగా ఎంగేజింగ్ గా నడిపించింది. దాంతో ప్రేక్షకులు రెండు గంటల పాటు కుర్చీ నుంచి కదలకుండా చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ తరువాత వచ్చే క్రైం ఎలిమెంట్స్ అన్నీ ఉత్కంఠభరితంగా సాగుతాయి. హీరో... విలన్ల మధ్య జరిగే సీన్స్ అన్నీ టామ్ అండ్ జెర్రీలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎక్కడా కథ... కథనాలను డీవియేట్ చేయకుండా చిత్ర హీరో కం డైరెక్టర్ జోజు జార్జ్... ఎంతో పక్కాగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేశారు. అందుకే ఈ సినిమా అంతగా అన్నీ భాషల ఆడియన్స్ ఆదరించారు. గతంలో తమిళంలో వచ్చిన ఇలాంటి క్రైం థ్రిల్లర్స్ కూడా ఎంతో ఘన విజయం సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా ఆడియన్స్ ను అలరిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వీకెండ్ లో మంచి ఎంగేజింగ్ క్రైం అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. గో అండ్ వాచ్ ఇట్.
ఎవరెలా చేశారంటే... జోజు జార్జ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన యాక్షన్ సీక్వెన్స్ లో చూపే అగ్రెస్సివ్ నెస్... మాస్ ఆడియన్స్ ను అలరిస్తుంది. ఈచిత్రానికి తనే రచన, దర్శకత్వం కాబట్టి... ఏ సీన్ లో ఎలా నటించాలి... తోటి నటులతో ఎలాంటి అవుట్ పుట్ రాబట్టుకోవాలనేది ఆయకు బాగా తెలుసు. ఆయన టేస్ట్ కి తగ్గట్టుగానే హీరోయిన్ అభినయ నుంచి గానీ... ఆకతాయి పాత్రలు పోషించిన సాగర్ సూర్య, జునైద్ ల నుంచి ఓ సైకో కిల్లర్స్ ఎలా వుంటారో... అలాంటి నటనను రాబట్టుకున్నారు. అదే ఈ సినిమాకి ప్రధాన బలం. హీరోకి వీరిద్దరితో జరిగే పోరాట సన్నివేశాలన్నీ చాలా ఆసక్తికరంగా వుంటాయి.
ఈచిత్రానికి రచన, దర్శకత్వం జోజు జార్జ్ కాబట్టి... అతడు నటుడిగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో... దర్శకుడిగా కూడా అంతే మంచి పేరు సంపాధించుకున్నారు. గ్రిప్పింగ్ కథ... కథనాలతో సినిమాను సెల్యులాయిడ్ పై ఆవిష్కరించి ప్రేక్షకుల నుంచి మంచి మన్ననలు అందుకున్నారు. ఈ చిత్రానికి ప్రధాన బలం సంగీతం. సామ్ సీఎస్, విష్ణు విజయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్క్రీన్ ప్లేను బాగా ఎంగేజ్ చేస్తుంది. మను ఆంటోనీ ఎడిటింగ్ వర్క్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. రెండుగంటలపాటే సినిమా నిడివిని నడిపించారు. దాంతో ప్రేక్షకులు హాయిగా సినిమాను ఎంజాయ్ చేస్తారు. వేణు ఐఎస్ సీ, జినో జార్జ్ లు అందించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా వుంది. ఎక్కవశాతం నైట్ షూట్ చేశారు. విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా వున్నాయి. ఆమ్ వర్డ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజ వంశీ తెలుగులో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడానికి తీసుకోవాల్సిన అన్ని అనువాద జాగ్రత్తలనూ తీసుకుని విడుదల చేశారు. ఓ సారి ఈ చిత్రం ‘పని’తనం ఎలా వుందో చూసేయండి.
ఇంకా చదవండి: 'పుష్ప -2' రివ్యూ: ఊరమాస్ ట్రీట్!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# పని # జోజుజార్జ్ # అభినయ