'35 చిన్న కథ కాదు' మూవీ రివ్యూ :    కమర్షియల్‌ హంగులు లేని కథ !

'35 చిన్న కథ కాదు' మూవీ రివ్యూ : కమర్షియల్‌ హంగులు లేని కథ !

10 days ago | 14 Views

నివేథా థామస్‌ కథల ఎంపికలో పట్టున్న కథానాయిక. ఆమె ఓ సినిమా అంగీకరించిందీ అంటే.. ఆ సినిమాలో ఏదో విషయం ఉంటుందనే ప్రేక్షకుల నమ్మకం. అలా వచ్చిందే '35 చిన్న కథ కాదు..'.సరస్వతి (నివేథా థామస్‌) ప్రసాద్‌ (విశ్వదేవ్‌ రాచకొండ) తిరుపతిలో సాధారణ జీవితం సాగించే భార్యభర్తలు.  ప్రసాద్‌ బస్సు కండెక్టర్‌. సరస్వతి టెన్త్‌ ఫెయిల్‌ అయిన గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్దోడు అరుణ్‌ (అరుణ్‌ దేవ్‌), చిన్నోడు వరుణ్‌ (అభయ్‌ శంకర్‌). చిన్నోడు చదువులో పర్వాలేదు కానీ పెద్దోడు లెక్కల్లో వీక్‌. అందుకే లెక్కల మాస్టారు చాణక్య వర్మ( ప్రియదర్శి) అరుణ్‌ని ’జీరో’ అని పిలుస్తాడు. అయితే లెక్కలకు సంబంధించి అరుణ్‌ ఎప్పుడూ లాజిక్కులు అడుగుతుంటాడు. ఆ లాజిక్కులకు మాస్టార్ల దగ్గర సమాధానం ఉండదు. లెక్కల్లో వరుసగా జీరోలు తెచ్చుకోవడం వల్ల ఒక సంవత్సరం డిమోట్‌ అయ్యి తమ్ముడు చదువుతున్న క్లాసులో కూర్చోవాల్సి వస్తుంది. స్నేహితులకు దూరమై, చదువు భారంగా మారిన అరుణ్‌ స్కూల్లో కొనసాగాలంటే లెక్కల్లో కనీసం '35’ మార్కులు తెచ్చుకోవాల్సిందే. అప్పుడు అరుణ్‌ ఏం చేశాడు? స్నేహితులకు దగ్గర కావడానికి, ఏం చేశాడు. లెక్కలంటే భయపడుతున్న కొడుకుకి పదో తరగతి ఫెయిల్‌ అయిన తల్లి పాఠాలు ఎలా చెప్పింది. చివరికి అరుణ్‌ లెక్కల్లో పాస్‌ అయ్యాడా లేదా అన్నది మిగిలిన కథ. 

విశ్లేషణ:  తిరుపతిలో నివశించే చిన్న కుటుంబం, ఇద్దరు పిల్లలు వారి భవిష్యత్తు కోసం తపన పడే తల్లిదండ్రులు చుట్టూ తిరిగే కథ ఇది. ప్రథమార్ధం సరస్వతి కుటుంబం, పిల్లలు, స్కూలు, లెక్కల్లో జీరో అయిన అరుణ్‌ గురించి చూపించారు. బ్రాహ్మణ కుటుంబం, ఇంట్లో వారి పద్దతులు, మాట తీరూ అన్ని కూడా సన్నివేశాల రూపంలో చూపించారు దర్శకుడు. ఆ తర్వాత స్కూల్‌, అక్కడి పిల్లల యాంగిల్‌లోకి కథ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. మ్యాథ్‌మేటిక్స్‌ సబ్జెక్ట్‌ అనేది ఎప్పటికీ అంతు చిక్కని కథే. లాజిక్‌ తెలిసి, దాన్ని ఎలా సాల్వ్‌ చేయాలో తెలిస్తే ఆ సబ్జె క్ట్‌ అంతా ఈజీ, స్కోరింగ్‌ మరొకటి ఉండదు. ఈ చిత్రంలో చాణక్య (ప్రియదర్శి) పాత్రను అదే కోణంలో డిజైన్‌ చేశారు. ’నేను పిల్లలతో బాగుండకపోయినా ఫర్వాలేదు. పిల్లలు, వారి భవిష్యతుల్ల బాగుండాలనే తీరు ఆ పాత్రది.  కాపీ కొట్టి అయినా 35 మార్కులు తెచ్చుకోవచ్చు అని అరుణ్‌ని పుష్‌ చేస్తారు. అతను మాత్రం నిజాయతీగా తనని తాను నిరూపించుకోవాలనుకుంటాడు. అక్కడే కథ టర్న్‌ అయింది. అప్పటి దాకా పిల్లలు, స్కూల్‌ నేపథ్యంలో సాగిన కథ.. తల్లి కథగా మారింది. సరస్వతి పాత్రని మరింత స్ట్రాంగ్‌ చేయడం కోసం పదో తరగతి ఫెయిల్‌ అయిన ఆమె చేత మళ్లీ పుస్తకాలు పట్టించాడు దర్శకుడు. తన బిడ్డను లెక్కల్లో రాణించేలా తీర్చిదిద్దడానికి తను కష్టపడి పిల్లాడికి మంచి బాట వేసే ప్రయత్నం చేసింది.  ’సున్నా’కి విలువ ఎందుకు లేదు? అనే క్వశ్చన్‌తో మొదలైంది కథ.  లెక్కల్లో ప్లస్‌, మైనస్‌లు ఉన్నట్లు ఈ చిత్రంలో కూడా ప్లస్‌, మైనస్‌లు ఉన్నాయి. కథ ప్రారంభం నుంచి నెమ్మదిగా నడవడం, అసలు దర్శకుడు ఏం చెప్పాలను కున్నాడో రివీల్‌ కావడానికి 45 నిమిషాల వ్యవధి తీసుకోవడం సినిమాకు మైనస్‌గా అనిపిస్తుంది. 35 మార్కుల కోసం ఇదంతా అని ఊహకు అందినప్పటికీ తెరపై అది రివీల్‌ కావడం బాగా సమయం తీసుకోవడం కాస్త సాగదీతలా అనిపించింది. కమర్షియల్‌ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షుకలు ఈ తరహా కథను అంత తొందరగా యాక్సెప్ట్‌ చేయలేరు. కమర్షియల్‌ హంగులు లేకపోవడం ఈ సినిమాకు ఓ మైనస్‌ అనుకోవచ్చు.

ఇంకా చదవండి: మూవీ రివ్యూ : సాదాసీదా కథతో ముగించిన ..ది గోట్‌ !

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# 35chinnakathakaadu     # Nivethathomas     # Priyadarshi    

trending

View More