పాటల  చిత్రీకరణలో 'పోలీస్ వారి హెచ్చరిక'

పాటల చిత్రీకరణలో 'పోలీస్ వారి హెచ్చరిక'

2 months ago | 22 Views

నల్లపూసలు ఫేం  " బాబ్జీ"  దర్శకత్వం లో  తూలికా  తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న

'పోలీస్  వారి  హెచ్చరిక'. చిత్రం శరవేగంగా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకొని  ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటుంది.....!

ఈ సందర్భంగా  దర్శకుడు బాబ్జీ చిత్రం ప్రోగ్రెస్ ను తెలుపుతూ  " అరకులోయ , కాఫీ వనం , ఆపిల్ రిసార్ట్స్ , వైజాగ్  యారాడా  బీచ్ , నకిరేకల్  లాండ్స్ , యస్ స్టూడియో మొదలైన  లొకేషన్ లలో యీ చిత్రం లోని పాటలను చిత్రీకరించమని ...." తెలిపారు....!

గత రెండు దశాబ్దాలుగా  రెండు తెలుగు రాష్ట్రాలలోని గాయనీ గాయకులతో  ఐదు లక్షల ప్రైవేట్  సాంగ్స్ ను  స్వరపరచి సంచలనం సృష్టించి , రెండు రాష్ట్రాలలోని ప్రైవేటు పాటల గాయనీ గాయకులకు , పాటల రచయితలకు అభిమాన పాత్రుడైన  సంగీత దర్శకుడు

" గజ్వేల్  వేణు" ను  యీ సినిమా ద్వారా వెండితెరకు  పరిచయం చేస్తున్నామని ..." దర్శకుడు బాబ్జీ తెలిపారు...!

చిత్ర నిర్మాత   బెల్లి జనార్థన్  మాట్లాడుతూ  " రెండు రోజులలో పాటల చిత్రీకరణ పూర్తి అవుతుందని , ఆ వెంటనే  నల్గొండ లో  క్లైమాక్స్

సన్నివేశాలను చిత్రీకరించడం తో  సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని " తెలిపారు....!

అఖిల్ సన్నీ , అజయ్ ఘోష్ , రవి కాలే , షియాజీ షిండే , శుభలేఖ సుధాకర్ , కాశీ విశ్వనాథ్ , సంజయ్ నాయర్, జబర్దస్త్ వినోద్ , జబర్దస్త్ పవన్ ,  హిమజ , జయ వాహిని , శంకరాభరణం తులసి, మేఘనా ఖుషి , రుచిత తదితరులు ఈ చిత్ర తారాగణం.....!

కెమెరా : నళినీ కాంత్ , సంగీతం : గజ్వేల్ వేణు ,

ఎడిటర్ : శివ శర్వాణి ,

పి ఆర్ ఓ .మధు వి .ఆర్

ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ : హను మంతరావు ,

నిర్మాణ నిర్వహణ : ఎన్. వై. సుబ్బరాయుడు ,

నిర్మాత : బెల్లి జనార్థన్ ,

రచన , దర్శకత్వం :  బాబ్జీ

ఇంకా చదవండి: బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్ సంయుక్త

# Babji     # Akhilsunny     # Ajayghosh